♦ పర్షియన్ నూతన సంవత్సర ముగింపు వేడుకలు జరుపుకుంటున్న ఎనిమిది మంది మృతి
దేశం నుంచి ముప్పును దాదాపుగా తొలగించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఇరాన్ తన పొరుగు దేశాలపై దాడులు చేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది.
న్యూఢిల్లీ: ఇరాన్‌పై దాడి చేయాలన్న అమెరికా, ఇజ్రాయిల్ నిర్ణయంతో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం ఏప్రిల్ 3నాటికి 35వ రోజుకు చేరుకుంది.
ఇరాన్ నుంచి కాల్పులను ఎదుర్కొంటున్నామని ఇజ్రాయిల్ చెప్పడం; కువైట్, బహ్రెయిన్లు కూడా దాడులకు గురవుతున్నట్టు తెలియజేశాయి.
దీంతోపాటు అమెరికా దాడిలో దెబ్బతిన్న ఒక ప్రధాన వంతెన సమీపంలో పర్షియన్ నూతన సంవత్సర ముగింపు వేడుకలు జరుపుకుంటున్న ఎనిమిది మంది మరణించినట్టు ఇరాన్ తెలిపింది.
ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో శుక్రవారం యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు ఏమాత్రం కనిపించలేదు.
దాడిని ఖండించిన ఇరాన్
దేశం నుంచి ముప్పును దాదాపుగా తొలగించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
దీంతో పాటు, పశ్చిమాసియాలోనే అత్యంత ఎత్తైనదిగా భావిస్తున్న వంతెన గురువారం కూలిపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ ఇరాన్ తన పొరుగు దేశాలపై దాడులు చేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది.
వంతెనపై జరిగిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పర్షియన్ నూతన సంవత్సరమైన ‘నౌరుజ్’ ఆఖరి రోజైన ‘ప్రకృతి దినోత్సవం’ సందర్భంగా ఇరానియన్లు ఆరుబయట విహారయాత్రలు, ఇతర వేడుకల కోసం గుమిగూడిన సమయంలో జరిగిన ఈ దాడిలో మరో 95 మంది గాయపడినట్టు ఇరాన్ వెల్లడించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
