♦ ప్రస్తుత దాడిలో టెహ్రాన్‌లో 12 మంది పౌరుల బలి, ధీటుగా బదులిచ్చిన ఇరాన్
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై తాము మరోసారి భారీ దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) ప్రకటించింది. ఇరాన్ దాడుల పరంపరలో ఇది 80వ విడత కావడం గమనార్హం.
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడి బుధవారం మార్చి 25 నాటికి 26వ రోజుకు చేరుకుంది.
టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
గమనించాల్సిందేంటే, ఒక పక్క చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. అయిన్నప్పటికీ, ఇరాన్ మీద దాడులు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజలు చనిపోతున్నారు.

అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకారం
మరోవైపు పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై తాము తాజాగా దాడులు జరిపినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) వెల్లడించింది.
ఇరాన్ ప్రతీకార దాడుల పరంపరలో ఇది 80వ విడత. తన తాజా దాడుల్లో భాగంగా కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
