మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని బోయిసర్ ఎంఐడీసీ ప్రాంతంలోని భగేరియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ యూనిట్‌లోని 2,500 లీటర్ల ఓలియం ట్యాంక్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది.
ముందు తెల్లటి పొగ దట్టంగా ఏర్పడింది, బలమైన గాలుల కారణంగా వేగంగా ఈ పొగ చుట్టుపక్కలా వ్యాపించింది.
ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా 1,600 మంది పాఠశాల విద్యార్థులు సహా 2,600 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని ఒక రసాయన యూనిట్ నుంచి మార్చి 2న ప్రమాదకరమైన ఓలియం గ్యాస్ భారీగా లీక్ అయ్యింది.
ముందు జాగ్రత్తల చర్యలలో భాగంగా ఈ ఘటన సమీపంలోని 1,600 మంది పాఠశాల విద్యార్థులు సహా 2,600 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అధికారుల ప్రకారం, కొంతమందికి తేలికపాటి కంటి చికాకు ఉన్నట్టు ఫిర్యాదు చేశారు.
ముంబై శివార్లలోని బోయిసర్ ఎంఐడీసీ ప్రాంతంలోని భాగేరియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ యూనిట్లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని వార్తా సంస్థ పీటీఐ తెలియజేసింది.
2,500 లీటర్ల ఓలియం ట్యాంక్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో దట్టమైన తెల్లటి పొగ ఏర్పడింది, బలమైన గాలుల కారణంగా ఇది వేగంగా చుట్టుపక్కలకు వ్యాపించింది.
ప్రభావిత ప్రాంతం దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో ఉంది. పారిశ్రామిక ప్రాంతంలోని నివాసితులు, కార్మికులలో భయాందోళనలు వ్యాపించాయి. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా- తారాపూర్ విద్యా మందిర్ నుంచి 1,600 మంది విద్యార్థులు, ఫ్యాక్టరీ, చుట్టుపక్కల పారిశ్రామిక యూనిట్ల నుంచి 1,000 మందికి పైగా కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లీక్ అయినట్లు సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ ప్రణాళికను ప్రారంభించామని పాల్ఘర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇందూ రాణి జఖర్ తెలిపారు. అయితే, లీక్ కావడానికి గల కారణం వెంటనే స్పష్టంగా తెలియలేదని తెలియజేశారు.
నియంత్రణలోకి పొగ..
దట్టమైన పొగ కారణంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్), భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బీఏఆర్సీ)- అగ్నిమాపక శాఖ బృందాలు లీక్ మూలాన్ని చేరుకోవడంలో మొదట ఇబ్బంది పడ్డారు.
తరువాత రసాయన నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లీక్ అవుతున్న ట్యాంక్‌ను గుర్తించారు. స్వీయ-నియంత్రణ శ్వాస ఉపకరణం(ఎస్సీబీఏ) ధరించి ప్రాంగణంలోకి ప్రవేశించారు. పొగను నియంత్రించడానికి, దాని వ్యాప్తిని నిరోధించడానికి ట్యాంక్ చుట్టూ ఇసుక సంచులను పేర్చారు.
కనీసం ముగ్గురు వ్యక్తులు స్వల్ప కంటి చికాకుతో బాధపడుతున్నారని ఫిర్యాదు చేయడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యతీష్ దేశ్‌ముఖ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రజలు భయపడవద్దని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని, పుకార్లకు దూరంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
