సామాజిక మాధ్యమంలో కాకుండా న్యాయస్థానంలో పోరాడాలని ఓ ఎక్స్ ఖాతాదారుడు గీతాంజలి ఆంగ్మోకు సూచించాడు. “కేంద్ర హోంమంత్రి ఇక్కడ(ఎక్స్) ట్రోల్స్‌తో పోరాటాన్ని మొదలుపెట్టారు”అని ఆంగ్మో ఆ మాటలకు బదులిచ్చారు.
న్యూఢిల్లీ: వీడియోలలోని తన మాటలను దుబాసీ కావాలని వక్రీకరించారని, వాటి ఆధారంగా జాతీయ భద్రతా చట్టం కింద తనను నిర్బంధించారని లేహ్ పరిపాలన సలహా బోర్డుకు జైలులో ఉన్నటువంటి పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ విన్నవించారని తన భార్య, సామాజిక వ్యవస్థాపకురాలు గీతాంజలి ఆంగ్మో తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
అక్టోబరు 24న జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో వాంగ్చుక్ను ముగ్గురు సభ్యుల సలహాబోర్డు విచారించింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన విచారణలో వాంగ్‌చుక్ తన వినతి పత్రాన్ని బోర్డుకు అందచేసినట్టుగా కథనాలు చెప్తున్నాయి.
జమ్మూకశ్మీర్ మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎంకె హంజురా అధ్యక్షతన సలహాబోర్డు ఏర్పాటైంది. లేహ్ జిల్లా ముఖ్య సెషన్స్ జడ్జి మనోజ్ పరిహర్, కార్గిల్ జల్లా ముఖ్య సెషన్స్ జడ్జి స్పాల్జెస్ ఆంగ్మో ఈ బోర్డులో సభ్యులుగా ఉన్నారు.
విచారణ సందర్భంగా తాను కూడా వాంగ్‌చుక్‌తో పాటు వెళ్లానని ఆంగ్మో ఎక్స్ ఖాతాలో తెలియజేశారు. లద్దాఖ్ పోలీసులు- సీఆర్పీఎఫ్లు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలను, అసలు దాంతో సంబంధమేలేని ఒక విద్యావేత్తకు ఆపాదించారని విచారణాధికారులకు సోనం చెప్పినట్టుగా కూడా ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.
వీడియోలలోని తన మాటలను, ప్రకటనలను, ఆలోచనలను సందర్బం లేకుండా తీసుకొని వాటన్నింటినీ కావాలని ఎలా తప్పుగా దుబాసీ వక్రీకరించి పొందుపర్చారో వాంగ్‌చుక్ విచారణాధికారులకు వివరించారని ఆంగ్మో రాసుకొచ్చారు. అంతేకాకుండా సీఆర్పీఎఫ్, లద్దాఖ్ పోలీసులకు, వ్యక్తుల మధ్య యాదృచ్ఛికంగా- స్వతంత్ర ఘర్షణ ఎలా చెలరేగిందో- ఆ ఘర్షణలతో సంబంధంలేని తనకు ఎలా ఆపాదించారో, దాని ఆధారంగా తనను ఎలా ఎన్ఎస్ఏ కింద అక్రమంగా నిర్బంధించారో వాంగ్‌చుక్ చెప్పారని ఆమె వివరించారు.
దీనికంటే ముందు, కేంద్ర ఏజెన్సీలు తనను వెంబడిస్తూ తన గోప్యతను ఉల్లంఘిస్తున్నాయని ఆంగ్మో ఆరోపించారు. జైలు సందర్శన సందర్బంగా తనపై నిఘా పెట్టి, తన సంభాషణలను పోలీసులు రికార్డు చేస్తున్నారని తెలియజేస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
“ఇది న్యాయాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినట్టే అవుతుంది. ఇంతలా జరుగుతోన్నా కానీ తను(వాంగ్‌చుక్) చెక్కుచెదరకుండానే ఉన్నారు. అంతేకాకుండా, ఇన్సాఫ్ కే ఘర్ దేర్ హై పర్ అంధేర్ నహీ(న్యాయం లభించడంలో ఆలస్యం కావచ్చు. కానీ చివరికి సత్యం, న్యాయానిదే విజయం) అంటూ సందేశమిచ్చారు. సత్యమేవ జయతే, సత్యం గెలుస్తుందని పునరుద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా తమకు మద్దతునిస్తూ సంఘీభావం తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఙతలు” అంటూ వాంగ్‌చుక్ తెలియజేశారని ఆంగ్మో తన ఎక్స్ ఖాతాలో రాశారు.
సోషల్ మీడియాలో కాకుండా కోర్టులలో పోరాడాలని ఒక ఎక్స్ ఖాతాదారు ఆంగ్మోకు సూచించారు. దానికి ఆంగ్మో స్పందిస్తూ, “కేంద్ర హోం మంత్రి ‘ఇక్కడ(ఎక్స్) ట్రోల్స్ ద్వారా పోరాటాన్ని మొదలు పెట్టారు’. అందుకే ఇక్కడ కూడా పోరాడాల్సిందే. కానీ చింతించకు. ప్రతిచోట పోరాటం కొనసాగుతుంది. సోషల్‌మీడియాలో, కోర్టుల్లో, మీ మెదడులో ప్రతిచోట”అని ఘాటుగా బదులిచ్చారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్‌తో పాటు ఇతర లద్దాఖ్ నాయకులు సెప్టెంబరు నెలలో దీక్షను మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కొంతమంది నిరసనకు దిగారు, ఆ నిరసన కాస్తా పోలీసుల రంగప్రవేశంతో హింసాత్మకంగా మారింది. పోలీసులు జరిపినట్టుగా ఆరోపిస్తున్న కాల్పుల్లో నలుగురు నిరసనకారులు మరణించారు. తనకు వ్యతిరేకంగా క్రూరమైన జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసినప్పటి నుంచి వాంగ్‌చుక్ జైల్లోనే ఉన్నారు. తన అరెస్టుకు కొద్ది నెలల ముందు లద్దాఖ్‌లోని వాంగ్చుక్కు చెందిన హిమాలయన్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటీవ్స్ సంస్థ 40 సంవత్సరాల లీజును ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా తన ఎన్జీఓ లైసెన్సును కూడా ఉపసంహరించుకుంది.
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
