నూతన ఆలోచనలకూ- ఆవిష్కరణాలకు పునాది కావాల్సిన విశ్వవిద్యాలయాలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయి చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు అరకొర వసతులతో నడుస్తున్నప్పటికీ, అవి అందించే విద్యా నాణ్యత పెద్ద సవాలుగా మారింది. విద్యా ప్రమాణాలను కొనసాగించడానికి నిరంతరం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకూ సమస్య మరింత తీవ్రమవుతుంది.
స్వరాష్ట్రం ఏర్పడితే అన్ని వస్తాయనే భ్రమ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఏమీ సాధించాలేమనే అసంతృప్తి గత దశబ్ద కాలంగా సర్వత్రా కొనసాగుతోంది. అయితే, ప్రధానంగా తెలంగాణలో విశ్వవిద్యాలయాల మీద గత ప్రభుత్వం అవలంభించిన నియంతృత్వ విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు విద్యార్థి వసతి గృహాలను ఆగష్టు 25న సీఎం రేవంత్ ప్రారంభించారు. అయితే, విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కారించి వెళ్తారని భావించిన విద్యాలయ సమాజానికి తీవ్ర నిరాశను కలిగించారు. ఒక వ్యవస్థ అభివృద్ధిని సోనియా గాంధీ జన్మదినానికి ముడిపెట్టి డిసెంబర్ 9న వచ్చి సమస్యలను పరిష్కరించి వెళ్తానని వాగ్దానం చేశారు. కానీ, మిగత విశ్వవిద్యాలయాల మీద ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు.
దీనస్థితిలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు..
ఎంతో గణమైన చరిత్ర కలిగిన ఓయూ ప్రస్తుతం అనేక సమస్యలతో సతమాతమవుతున్నది. పన్నెండేళ్ల క్రితం జరిగిన అధ్యాపకుల భర్తీ తర్వాత మళ్ళీ జరగకపోగా; విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు లేక తరగతి గది పనితీరు ఆగిపోయింది. ప్రతి డిపార్ట్మెంటులో ఒకరిద్దరు పర్మనెంట్ ఫ్యాకల్టీ తప్పితే మిగిలిన వారంతా సొంత సబ్జెక్టులో కనీస జ్ఞానంలేని, భాషా పరిజ్ఞానం లేని వ్యక్తులు కాంట్రాక్టు అధ్యాపకులుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాల పరిస్థితి కూడా ఇలానే ధీనంగా ఉంది.
ప్రస్తుతం తెలంగాణాలో విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి. విద్యావేత్తల చేతుల నుంచి బయటపడి, బలమైన రాజకీయ ఎజెండాలు కలిగిన అధికారుల చేతుల్లోకి మారింది. అకాడమిక్ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం మితిమీరింది. విద్యార్థులకు కొంతమంది అధ్యాపకులు అందుబాటులో ఉండటం కంటే, సెక్రటేరియట్లో మంత్రులకే ఎక్కువ అందుబాటులో ఉంటున్నారు. దీని వల్ల యూనివర్సిటీ అకాడమిక్ వ్యవహారాల్లో విద్యార్థులకు, అధ్యాపకులకు ఉండాల్సిన సంబంధం దెబ్బతింటున్నది.
గత ప్రభుత్వం ఉన్నత విద్యా వ్యవస్థను బలహీనపరుస్తూ, ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించింది. గత ప్రభుత్వంలో వారికి అనుకూలకంగా ఉన్నవారికే వీసీలను నియమించారు. నిధుల విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అంతే, ఉన్నత విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లే వారిని నియమించకుండా క్యాస్ట్ కార్డుతో వీసీలను నియమించారు. వీరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం అధికారదాహనికి మరిగి ఉన్నత విద్య విలువలను దిగజారుస్తున్నారు.
కొత్త నిబంధనతో ఇబ్బంది..
ప్రభుత్వాలు యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిలో ఇష్టానుసారంగా జోక్యం చేసుకుంటున్నాయి. అధ్యాపకులు పదవులకు ఆశపడి ప్రశ్నిస్తున్న విద్యార్థులపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. 28 ఏళ్ళు దాటితే విద్యార్థులకు హాస్టల్ వసతి ఇవ్వలేమనే కొత్త నిబంధనతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారు. కరోనా వల్ల నష్టపోయిన పీహెచ్డీ విద్యార్థులకు సబ్మిషన్కు అవకాశం ఇవ్వటంలేదు. ఇలాంటి విద్యార్ధి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న యూనివర్సిటీ అధికారులను ప్రజాపాలనను చెప్పుకునే ప్రభుత్వం చూసి చూడనట్టిగా వ్యవహారిస్తున్నది.
ప్రస్తుతం యూనివర్సిటీల్లో చర్చించాల్సిన ప్రధాన అంశాల్లో విద్యాపరమైన స్వేచ్ఛ రోజురోజుకు దిగజారుతుంది. రోహిత్ వేముల, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలలో జరిగిన సంఘటనల తర్వాత ఉక్కుపాదంతో యూనివర్సిటీలను అణిచివేయాలని చూస్తున్నారు. ఇటీవల ఒక సదస్సుల్లో యూనివర్సిటీలలో భావప్రకటన స్వేచ్ఛ లోపించటం; ఇది ఆరోగ్యావంతమైన సమాజ నిర్మాణానికి, దేశ ప్రజాస్వామ్యనికి ఆటంకమని ప్రముఖ చరిత్రకారిణి ‘రోమిళ్ల థాపర్’ ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీలు పోలీసు కంటోన్మెంట్లుగా మారుతున్నాయి. చీటికి మాటికి పోలీస్ ప్రమేయం లేకుండా పాలనాను నిర్వహించలేకపోతున్నారు. ఈ తరహా పరిస్థితులకు ప్రభుత్వాలే కారణమైనప్పుడు. వీటికి యూనివర్సిటీలే ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీటి వల్ల హేతుబద్ధమైన ఆలోచన, పరిశోధనలకు, చర్చలను ప్రోత్సహించడానికి యూనివర్సిటీలు తమ బాధ్యతను ఉద్దేశపూర్వకంగానే నిర్వర్తించలేకపోతున్నాయి. మేధోపరమైన, అభివృద్ధిపరమైన అంశాలను పక్కన పెట్టి యూనివర్సిటీ పాలకులు నైతిక విలువలను దిగజరుస్తున్నారు.
ఉన్నత విద్య రక్షణ..
ప్రస్తుతం యూనివర్సిటీలో అకాడమిక్ వ్యవహారలకంటే నాన్ అకాడమిక్ వ్యవహారాలు ఎక్కువయ్యాయి. బయటి వ్యక్తులు యూనివర్సిటీని ప్రైవేటు వ్యవహారాలకు అడ్డాగా మార్చారు. దీన్ని క్లోస్డ్ క్యాంపస్‌గా మార్చి యూనివర్సిటీ అకాడమిక్ వాతావరణాన్ని కాపాడాలి. విద్యార్ధి ఎన్నికలు నిర్వహించాలి. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణను వ్యతిరేకించి క్వాలిఫైడ్ అభ్యర్థులను కులప్రీతి, బంధుప్రీతి లేకుండా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేసి యూనివర్సిటీ అకాడమిక్స్ ఎత్తిక్స్ని కాపాడాలి. రీసెర్చ్ స్కాలర్స్, పీజీ విద్యార్థులకు ప్రతీ నెలా ఫెలోషిప్స్ ఇచ్చి పరిశోధలను ప్రోత్సహించి ఉన్నత విద్య భవిష్యత్తును కాపాడాలి.
విశ్వవిద్యాలయాలు ఇంతటి దీనస్థితిలోకి వెళ్ళటానికి ప్రభుత్వం, ప్రభుత్వ ప్రమేయల ద్వారా ఎంపికవుతున్న వైస్ ఛాన్సెలార్లు, ప్రొఫెసర్స్ అకాడెమిక్స్ పోస్టులకు అలవాటుపడి తరగతి గది మరిచి కాలాన్ని వెళ్లగకుతున్నారు. విద్యార్థుల ఉద్యమలకు మద్దతునిచ్చే ప్రొఫెసర్స్ కరువయ్యారు. అంతేకాదు ఇంతటి విషాదాల్లో విద్యార్థులు కూడా భాగస్వాములే; విద్యార్థిసంఘాల పనితీరు సైద్ధాంతికంగా కాకుండా వ్యక్తిగత ఎజెండాలకే ప్రాధాన్యతనిస్తున్నాయి. హేతుబద్ధమైన ఆలోచనలకు, సైద్ధాంతిక చర్చలకు అసలే తావేలేకుండా పోయింది. ఇలాంటి వాటి వల్ల విద్యార్థుల్లో ప్రశ్నించేతత్త్వం లోపించింది; కుల, బంధు ప్రీతి పెరిగింది.
ఓయూ అభివృద్ధికి వేయి కోట్లు ఇస్తానని మాటిచ్చిన రేవంత్ రెడ్డి; దాని మీద ఒక బ్లూప్రింట్ విడుదల చేయాలి. రాజకీయజోక్యాన్ని తగ్గించి, యూనివర్సిటీలను ఒక సవాలుగా తీసుకొని అభివృద్ధి చేయాలి. అంతేకాదు ఉస్మానియాను సందర్శించినట్టుగానే మిగతా యూనివర్సిటీలను సందర్శించి వాటి అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టడం అంటే, ప్రాంతీయ అభివృద్ధిని కాపాడటం. డిసెంబర్ 7న విశ్వవిద్యాలయాన్ని సందర్శించబోతున్న ముఖ్యమంత్రి, విశ్వవిద్యాలయ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన తన మాటను నిలబెట్టుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
