
తెలంగాణ శాసనసభలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినందుకు వారి అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో స్పీకర్ ఒక న్యాయాధికారి మాదిరిగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలియజేసింది. అంతేకాకుండా, శాసనసభ కార్యకలాపాల్లో జోక్యం చేయకూడదనే రక్షణ పూర్తిగా వర్తించదని ఆయనకు కోర్టు గుర్తు చేసింది.
2023 డిసెంబరులో ఎన్నికలు జరిగిన తర్వాత, 10 మంది ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)పార్టీని వీడి ఇతర పార్టీలా కండువాలను కప్పుకున్నారు. పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ నేతలు కోరారు.
స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారవడంతో మెతకగా వ్యవహరిస్తూ, ఈ విషయంలో నెలల తరబడి ఎటువంటి చర్య తీసుకోలేదు. ఒకసారి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాలుగు వారాల్లో ఈ విషయం మీద విచారణ చేపట్టాలని ఆదేశించగా, మరో బెంచ్ ఆ ఆదేశాన్ని తిరస్కరించింది.
నిర్ణయాలు తీసుకొని అసెంబ్లీ..
1985లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారకుండా ఉండేందుకు భారత రాజ్యాంగంలో ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని(10 షెడ్యూల్డ్) ప్రవేశపెట్టారు. అప్పట్లో ఇందిరా గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. కాబట్టి ఫిరాయింపులు ఆపేసి రాజకీయ స్థిరత్వాన్ని నిలుపుకోవడం కోసం రాజీవ్ గాంధీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో స్పీకర్లు నిర్ణయాలు ఆలస్యం చేశారు. దీంతో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. స్పీకర్ చర్య తీసుకునేలోపే నష్టం జరగకుండా ఉండేందుకు కోర్టులు ముందస్తుగా చర్య తీసుకోవాలనే ఆలోచన కొన్నిసార్లు ఉత్పన్నమవుతోంది.
1992లో ఒక కీలకమైన కేసులో స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ, అనేక సందర్భాల్లో స్పీకర్లు అసెంబ్లీ పదవీకాలం ముగిసే వరకు నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందుకే 2007లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కేసులో సుప్రీంకోర్టే ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని, కొందరు ఎమ్మెల్యేల అనర్హతను ప్రకటించింది.
తర్వాత 2020లో మణిపూర్ కేసులో కోర్టు తన మునుపటి అభిప్రాయాన్ని మారుస్తూ, స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఆటంకం కలిగించకూడదని తేల్చిచెప్పింది. కానీ నిర్ణయం తీసుకునేలా గడువు విధించవచ్చని సూచించింది.
ఇదే విధానాన్ని ఈసారి కూడా కోర్టు అనుసరిస్తూ, తెలంగాణ స్పీకర్‌కు గడువు విధించింది. కానీ ఎవరినీ నేరుగా అనర్హులుగా ప్రకటించలేదు.
2023లో మహారాష్ట్ర శివసేన కేసులో కూడా ఇటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ సమయం తీసుకోవద్దని కోర్టు పేర్కొన్నది. అయినా కానీ ఎప్పుడూ మొదట స్పీకర్‌కే నిర్ణయం తీసుకునే హక్కు ఉందన్నదే కోర్టు అభిప్రాయం.
వ్యవస్థపై సాధారణ సందేహం..
ఈ ఫిరాయింపు రాజకీయాలు చూసిన తరువాత ఈ వ్యవస్థపై సాధారణ సందేహం వస్తుంది. స్పీకర్లు రాజకీయ పార్టీ అవసరాలకు లోబడి, ఈ ఎమ్మెల్యేలు కూడా రాజకీయపరమైన వ్యక్తులే అయినందున, వారు ఇలాంటి ముఖ్యమైన అంశాలను చక్కదిద్దగలరా? అనే ప్రశ్న కోర్టే లేవనెత్తింది.
గతంలో “ఆపరేషన్ సక్సెస్ అయినా, పేషెంట్ చనిపోయాడు” అనే విమర్శల నేపథ్యంలో ఈసారి మూడు నెలల గడువు విధించడం కోర్టు అవసరంగా భావించింది.
సుప్రీంకోర్టు అబ్సర్వర్ సంపాదకుల ప్రకారం, ఒక న్యాయవాది కోర్టు తీర్పును ప్రశంసిస్తూ “పేషెంట్ ఇంకా బ్రతికే ఉన్నాడు” అన్నారు. నిజమే, గత తీర్పులతో పోలిస్తే ఇది మెరుగైనదే. కానీ ఇది సరిపోతుందా?
ఈ పిటిషన్లు ఇప్పటికే 16 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఈ ముగింపు నిర్ణయం కూడా మళ్లీ కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. దీంతో మొత్తం ప్రక్రియ ఇంకా పొడిగించటమే గాక, త్వరగా ముగిసే ఆశలేమీ ఉన్నట్టు దాఖలాలేవీ లేవు.
అంతెందుకు, పేషెంట్ బ్రతికే ఉన్నాడు. కానీ పెద్ద ఆపరేషన్ తర్వాత ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు అనిపిస్తుందా?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.