పిటిషనర్ ఫేస్బుక్ పోస్టులో ఎలాంటి అసభ్యమైన పదాలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీని మీద స్పందించిన ఉన్నత న్యాయస్థానం “మా నుంచి ఎలాంటి స్పందనను ఆశించవద్దు”అని తెలియజేసింది.
న్యూఢిల్లీ: బాబ్రీ మస్జీద్ మీద అభిప్రాయాన్ని తెలియజేసిన ఫేస్బుక్ పోస్టుకు సంబంధించిన కేసును అక్టోబరు 27న సుప్రీంకోర్టు విచారించింది.
లైవ్‌లా ప్రకారం, “టర్కీలోని సోఫియా మస్జీదులానే బాబ్రీ మస్జీదు కూడా ఏదో ఒక రోజు పునర్నిర్మించబడుతుంది”అని ఓ వ్యక్తి 2020లో ఫేసుబుక్‌లో పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసు నమోదైంది. దానిని కొట్టివేయాలని ఆ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
బాధిత పిటిషనర్ మహ్మద్ ఫైయ్యాజ్ మన్సూరీకు వ్యతిరేకంగా 2020 ఆగస్టు 6న ఎఫ్ఐఆర్ నమోదైయ్యింది. ఆ తర్వాత, జాతీయ భద్రతా చట్టం-1980 కింద ఆగస్టు 8న మన్సూరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా మన్సూరీ తరపున న్యాయవాది తల్హా అబ్దుల్ రెహమాన్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్‌పై కేసును ఉపసంహరించాలని ఆయన కోరారు. వాదనలను విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విజ్ఙప్తిని తిరస్కరించింది.
పిటిషనర్ పోస్టులో ఎలాంటి అసభ్యకరమైన పదాలు లేవని, “తన ఆశను, అభిప్రాయాన్ని మాత్రమే” వ్యక్తపర్చారని న్యాయవాది కోర్టుకు వివరించారు. అంతేకాకుండా ఇదే కేసుకు సంబంధించిన మరో విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఓ వ్యక్తి అసభ్యకరంగా రెచ్చగొట్టే విధంగా ప్రచురించచినప్పటికీ దానిపై ఎలాంటి దర్యాప్తు చేయలేదని తెలియజేశారు.
తన ఫేస్బుక్ పోస్టు గురించి మన్సూరి పిటిషన్లో తెలియజేస్తూ- తన ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి, తన అనుమతి లేకుండానే తన పోస్టును సవరించారన్నారు. అంతేకాకుండా, హిందూ దేవీ దేవతల మీద సమ్రీన్ బానోతో పాటు చాలా మంది అసభ్యకర వ్యాఖ్యాలు చేసినట్టుగా చెప్పుకొచ్చారు.
“సమ్రీన్బానో అనే ఏ వ్యక్తి ఉనికిలో లేన్నట్టుగా తమ వద్ద ఆధారాలున్నాయి; పిటిషనర్‌ను కేసులో ఇరికించడానికి, వినియోగదారుని పేరు సమ్రీన్ బానోగా మార్చుకొని రితేష్ యాదవ్ ఖాతాను నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కనుగొనబడినప్పటికీ యాదవ్‌పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. కానీ పిటిషనర్ ఒక్కరే విచారణను ఎదుర్కొంటున్నారు”అని పిటిషనర్ పేర్కొన్నట్టుగా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలియజేసింది.
రాజ్యాంగంలో పొందుపర్చిబడిన ప్రాథమిక హక్కు అయినటువంటి భావస్వేచ్ఛా ప్రకటన మేరకు ఫేస్బుక్ పోస్టు రూపుదిద్దకున్నట్టుగా అందులో తెలియజేయబడింది.
అయితే వాదనలతో జస్టిస్ కాంత్ సంతృప్తి చెందలేదు. “పిటిషనర్ పోస్టును బెంచ్ చూసింది. మా నుంచి ఎలాంటి స్పందనను ఆశించొద్దు”అని న్యాయమూర్తి హెచ్చరించారు.
పిటిషనర్ లేవనెత్తిన అన్ని అంశాలను ట్రయిల్ కోర్టు తన యోగ్యతను బట్టి పరిగణంలోకి తీసుకుంటుందని బెంచ్ వ్యాఖ్యానించి కేసును తిరస్కరించింది.
జాతీయ భద్రతా చట్టం కింద తనను నిర్బంధించాలని లఖింపూర్ ఖేరి జిల్లా మేజిస్ట్రేట్ జారిచేసిన ఉత్తర్వునను అలహాబాద్ హైకోర్టు కొట్టవేయడంతో, 2021 సెప్టెంబరు వరకు తాను జైల్లో ఉన్నానని మన్సూరీ చెప్పారు.
ఏదిఏమైనప్పటికీ, కేసుకు సంబంధించి జూలై 3న హజరుకావాలని లఖింపూర్ ఖేరి అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ ఈ ఏడాది మొదట్లో ఆదేశాలను జారి చేశారు.
మన్సూరికి వ్యతిరేకంగా దాఖలైన చార్జిషీట్‌ను ట్రయిల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో తన కేసును కొట్టెయ్యాలని మన్సూరి మరోసారి అలహబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
తన విజ్ఙప్తిని సెప్టెంబరులో హైకోర్టు తిరస్కరించింది, అయితే విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మన్సూరి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
