జార్ఖండ్ శాసనసభ సచివాలయంలో నియమకాలు, పదోన్నతులలో అక్రమాలు జరిగినట్టుగా పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణ చేపట్టడానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ను సీబీఐ దాఖలు చేసింది. దీనిని పరిగణలోకి తీసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
న్యూఢీల్లీ: “రాజకీయ యుద్ధాల” కోసం తమ యంత్రాంగాన్ని ఎందుకు వాడుకుంటున్నారని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
జార్ఖండ్ శాసనసభ సచివాలయంలో పదోన్నతులు, నియమకాలలో; అక్రమాలు, అవకతవకలు జరిగినట్టుగా పలు ఆరోపణల వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణ ప్రారంభించడానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ తరఫున పిటీషన్ దాఖలయింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ను నిరాకరిస్తూ నవంబరు 18న తీవ్రంగా స్పందించినట్టుగా డెక్కన్ హెరాల్డ్ కథనం పేర్కొన్నది.
“మీ రాజకీయ యుద్ధాల కోసం యంత్రాంగాన్ని ఎందుకు వాడుకుంటారు? మేము ఈ విషయాన్ని మీతో చాలాసార్లు చెప్పాము”అని ధర్మాసనం గుర్తు చేసింది.
ముందుగానే ప్రత్యక్షమైన సీబీఐ..
అయితే జార్ఖండ్ రాష్ట్ర శాసనసభలో నియమకాలు, పదోన్నతులలో; అక్రమాలు, అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీని మీద దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశిస్తూ జార్ఖండ్ హైకోర్టు 2024 సెప్టెంబరు 23న తీర్పునిచ్చింది. ఈ తీర్పును గత ఏడాది నవంబరులో సుప్రీం కోర్టు నిలిపివేసింది.
ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత సీబీఐ అభ్యర్ధనను మన్నించడానికి సిద్ధంగా లేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
కేసు విచారణకు వస్తున్నప్పుడు, కోర్టులో సీబీఐ ముందుగానే ప్రత్యక్షం కావడం పట్ల జార్ఖండ్ శాసనసభ సచివాలయం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఈ వాదనను సీబీఐ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అంగీకరించడానికి నిరాకరిస్తూ; ఎక్కడ నేరం జరిగినా అక్కడ సీబీఐ ప్రత్యక్షమవుతుందని అన్నారు. అయితే, ఈ వాదనతో ధర్మాసనం సంతృప్తి చెందలేదని డీహెచ్ కథనం తెలియజేసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
