అప్పటికప్పుడు అరెస్టులు,దానంతటఅదే ఎఫ్ఐఆర్లతోఆన్లైన్ ప్రసంగాల కేసులను పాలక వర్గాలు బలవంతంగా నిర్వహించలేవు
సామాజిక మాధ్యమాల్లో పోస్టలకు ఏకపక్షంగా అరెస్టులను అరికట్టాలన్న ఉద్ధేశ్యంతో తెలంగాణ హైకోర్టు జారి చేసిన ఉత్తర్వును సుప్రీం కోర్టు సమర్ధించింది, ఈ ఉత్తర్వుల ప్రకారం ఫిర్యాదు పై చట్టబద్దత, విచారణ, దృవీకరించడాన్ని తప్పనిరి చేస్తూ వీటికి బదులుగా సామాజి మాధ్యమంలో రాజకీయ విమర్శలకు సంబంధించి” యాంత్రబద్దంగా” కేసులను నమోదు చేయడం అరికట్టడాన్ని హైకోర్టు ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది.
సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన శశిధర్ గౌడ్ (నల్లబాలు) అనే పేరు గల కార్యకర్తకు వ్యతిరేకంగా నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేయడాన్నిసవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పటీషన్‌ను,ఇద్దరు సభ్యులు న్యాయమూర్తులు జస్టిస్ జెబి పార్ధివాలా జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఫిబ్రవరి 2న త్రోసిపుచ్చింది.
భారత రాష్ట్ర సమితి( బిఆర్ఎస్) అధికార X వేదికలో పెట్టి పోస్టును తిరిగి పెట్టడంతో పాటు కాంగ్రేస్ ప్రభుత్వాన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ పోస్టులు పెటినందుకు గౌడ్‌ను జూన్ 2025లో అరెస్టు చేశారు.
“కాంగ్రెస్ రాష్ట్రానికి కొరడా దెబ్బ కొడుతుంది, పొలానికి కీటకాల ప్రభావం ఏర్పడితే , ప్రజలు కలవరపడతారు” అని పేర్కొంటూ ఆయనకున్న వేదికల్లోఒక X వేదికలో పోస్టు పెట్టారు,” ముఖ్యమంత్ర బొమ్మతో ” దూరదృష్టిలేదు, బాధ్యత లేదు, కేవలం 20% కమీషన్”, అంటూ మరో పోస్టు పెట్టారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో 15 మాసాల కాంగ్రేస్ ప్రభుత్వం పాలన ఈ విధంగా ఉంది”.
రాజ్యాంగంలోని అధికరణ 19(1)(a) ప్రకారం పౌరులకు భావ వ్యక్తీకరణ హక్కును మంజురుచేయబడిందన్న విషయాన్ని ప్రస్తావస్తూ ఎఫ్ఐఆర్ లను సెప్టెంబర్‌లో తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. గౌడ్ ట్వీట్టు కొంత కఠినంగా ఉన్నప్పటికి అవి రాజకీయ విమర్శలని,అవి నేరపూరితమైన ముంజూరికి ఆకర్శించలేవని, కోర్టు పేర్కొంది. కాగా ఎఫ్ఐఆర్లను కొట్టి వేస్తూ. ఇలాంటి కేసుల్లో పోలీసుల కోసం కార్యచరణ మార్గదర్శకాలను న్యాయ మూర్తి జస్టిస్ ఎన్.తుకారాం పొందుపర్చారు.
ఉత్తర్వును వివరంగా ఇక్కడ చదవ వచ్చు.
ఈ మార్గదర్శకాలు ఒకదానితో ఒకటి స్థరంగా లేవని, వాటిని సమీక్షించి సరిదిద్దాలని వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లింది. హై కోర్టు తీర్పును మార్గ దర్శకాలను పరిశీలించిన తర్వాత ఆక్షేపించబడిన తీర్పు లేదా హై కోర్టుతో పాటు జారి చేసిన మార్గదర్శకాల విషయంలో జోక్యం చేసుకోరాదని సుప్రీం కోర్టు బెంచ్ నిర్ణయించింది
ఎస్సి సమర్ధించిన తెలంగాణ హై కోర్టు ఉత్తర్వులోని కీలక అంశాలు.
- కేసు నిలబడుతుందా అనేది దృవీకరించాలి:” పరువు నష్టం లేదా అలాంటి సరిసమాన నేరారోపణల పై ఎఫ్ఐఆర్ నమోదు చేయక ముందు , బాధపడుతున్న వ్యక్తి చట్టం దృష్టిలో ఫిర్యాదుకు అర్హుడా అన్నది పోలీసులు ఖచ్చితంగా దృవీకరించాలి. సంబంధం లేని మూడవ వ్యక్తులు చేసే ఫిర్యాదులు నివజాలవు, కోర్టు అనుమతి లేకుండా లేదా వారెంటు లేకుండా అరెస్టు చేసి కేసు నమోదు చేయగల తీవ్రమైన నేరం తప్పా” పరువునస్టం లేదా దానితో సరిసమాన నేరం పై ఎఫ్ఐఆర్ నమోదు చేయక ముందు చట్టం దృష్టిలో ఫిర్యాదుదారుని అర్హతను ఖచ్చితంగా పోలీసులు ధీవీకరించాలి, అదే ఫిర్యాదు చేయడానికి చట్టపరమైన హక్కు. తన ప్రతిష్టకు హని కల్గిస్తున్నారని ఆరోపిస్తూ బాధపడుతున్న వ్యక్తి మాత్రమే ప్రత్యేకంగాఅలాంటి ఫిర్యాదు దాఖలు చేయవచ్చు, పరువు నష్టం ఆరోపణలతో ఏమాత్రం సంబంధంలేని, ప్రత్యేక్షంగా ప్రభావితం కాని మూడవ పార్టీ ఫిర్యాదు దాఖలు చేసినట్లయితే, అట్టిదాన్ని పరిగణించరాదు లేదా నమోదు చేయరాదు.” కోర్టు అనుమతి లేకుండా లేదా వారెంట్ లేకుండా అరెస్టు చేసి కేసు నమోదు చేయగల తీవ్రమైన నేరాన్ని తెలియచేసినప్పుడు,” ఫిరియాదుదారుడు ఆ వ్యక్తి కాక పోయినప్పటికి అలాంటప్పుడు కోర్టు అనుమతి లేకుండానే పోలీసులు చర్యలు తీసుకోవడానికి మినహయింపు ఉంది.
- కోర్టు అనుమతి లేకుండా వారెంట్ లేకుండా అరెస్టు చేసే నేరాల పై ప్రాధమిక విచారణ: ” కోర్టు అనుమతి లేదా వారెంట్ లేకుండా అరెస్టు చేసే నేరాలకు సంబంధించి వినతి పత్రం లేదా ఫిర్యాదులో తెలియచేసినట్లయితే, నేరాన్ని నమోదు చేయక ముందు, నేరారోపణలకు చట్టబద్దంగా కావల్సిన సాక్షాధారాలు ఉన్నాయా లేవా అనేది నిర్ధారించుకోవడానికి ప్రాధమిక విచారణ జరపాలి” కోర్టు అనుమతి, వారెంట్ లేకుండా అరెస్టు చేసే నేరాలలో భాగస్వాములుగా ఉన్నట్లు ఫిర్యాదు లేదా నివేదికలో ఉన్నట్లయితే,పోలీసులు వెంటనే నేరాన్ని నమోదు చేయలేరు, నేరారోపణలో కావల్సిన చట్టపరమైన అంశాలు ఉన్నాయా లేదా దృవీకరించడానికి తొలత ప్రాధమిక విచారణ జరపాలి, ఫిర్యాదు చెల్లుబాటు అవుతుందని విచారణ సూచిస్తేనే కేసును నమోదు చేయవచ్చు.
- మిడియా పోస్టులకు ఉన్నత పరిమితి/ ప్రసంగం సంబంధిత నేరాలు: శతృత్వాన్ని పెంచడం, ఉద్దేశపరంగా కించపర్చడం,ప్రజల్లో అసభ్యకర ప్రవర్తన, ప్రజల భద్రతకు ప్రమాదం, లేదా దేశద్రోహం వంటి కేసుల్లో హింసకు ప్రేరేపించడం అసహించుకోవడం లేదా ప్రజల అభద్రత విషయంలో వస్తు రూపంలో సాక్షాధారాలు లభించినప్పుడే కేసులను నమోదు చేయవచ్చు.
కేదార్నాధ్సింగ్,బీహర్‌కు మధ్య 1962 సప్లి(2) ఎస్సిఆర్ 769,అలాగే శ్రేయసింగాల్కు యూనియన్ ఆఫ్ ఇండియా (2015)5 ఎస్సిసి1.” ప్రజా ప్రసంగం లేదా కించపర్చడం వంటివి ఎవరో సామాజిక మాధ్యమంలో కనుగొన్నదే కారణంతో పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేరని కోర్టులు పేర్కొన్నాయి. ” శతృత్వాన్ని ప్రోత్సహించడం ఉద్దేశపరంగా కించపర్చడం, ప్రజల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రజల భద్రతకు ప్రమాదం, లేదా దేశద్రోహం” వంటి కేసులతో సహ ఎఫ్ ఐఆర్‌ను నమోదు చేయలేరు. వాస్తవంగా హింసను ప్రేరేపించడం,ద్వేశించడం లేదా ప్రజల అభద్రత పై సాక్షాధారాల ఆధారంగా ఎఫ్ఐఆర్ను నమోదు చేయవచ్చు. - రాజకీయ ప్రసంగం/ పోస్టుకు రక్షణ: ” విమర్శనాత్మక రాజకీయ ప్రసంగానికి, నేరానికి,కఠనంగా ఉన్నదానికి సంబంధించి పోలీసులు సాంకేతిక పరంగా కేసులను నమోదు చేయరాదు.హింసకు రెచ్చగొట్టడం లేదా ప్రజల భద్రతకు ప్రమాదం తెచ్చిపెట్టే ప్రసంగాలపై మాత్రమే నేరపూరిత చట్టాన్ని అముపర్చవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద స్వేచ్చా రాజకీయ విమర్శలకు కల్పించిన రాజ్యాంగ రక్షణను జాగ్రత్తగా అమలు పర్చాలి” .తెలంగాణ హైకోర్టు రూపోందించిన మార్గదర్శకాలు స్పస్టంగా సాంకేతికపరంగా ఎఫ్ ఐఆర్‌ల నమోదును నిషేద్ధించింది. ఓక రాజకీయ పోస్టు లేదా ప్రకటనతమకు అనుకూలంగా లేదని కించపర్చుతుంది,ప్రజల్లో చిన్న చూపు కల్గించడం లేదా ఒక రాజకీయ పార్టీ – ముఖ్యంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినంత మాత్రాన పోలీసులు తమకు తాము నేరపూరిత కేసుగా నమోదు చేయలేరని, అలాంటి ప్రసంగానికి భారత రాజ్యాంగం రక్షణ కల్పించబడింది. ప్రసంగం కఠనంగా, విమర్శనాత్మకంగా, నేరపూరితంగా లేదా రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పటికీ , నేరపూరిత చర్యలు చేపట్టడానికి అదోక్కటే సరిపోదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయక ముందు హింసను ప్రేరేపించడం,ధ్వేశం లేదా ప్రజల భద్రతకు హని కల్గించే విధంగా ప్రసంగం ఉందని చెప్పడానికి కావల్సిన ముందస్తు సాక్షం ఖచ్చితంగా ఉండాలి.
- కోర్టు అనుమతి వారెంట్ లేకుండా అరెస్టుగా పరువునష్టం : పరువునష్టం నాన్-కాగ్నిసబుల్ నేరంగా వర్గీకరించడంతో, అలాంటి అంశాల్లో పోలీసులు ప్రత్యేక్షంగా ఎఫ్ఐఆర్ను లేదా నేరాన్ని నమోదు చేయరాదు. ఫిర్యాదుదారుడు తన పరిధిలో ఉన్న మేజిస్ట్రేట్‌ను నేరుగా కలుసుకోవచ్చు. బిఎన్ఎస్ఎస్ 174(2) సెక్షన్ కింద మేజిస్ట్రేట్ ప్రత్యేక ఉత్తర్వుల మేరకు పోలీసుల చర్యలు మొదలు పెట్టవచ్చు. నాన్- కాగ్నిసబుల్ నేరంగా వర్గీకరించిన పరువునష్టం కేసుల్లో, పోలీసులు సొంతంగా చర్యలు తీసుకోలేరు. బాధిత వ్యక్తి లేదా ఫిర్యాదుదారుడు తమ పరిధిలో ఉన్న మేజిస్ట్రేట్‌ను సంప్రధించి ప్రైవేటు ఫిర్యాదును దాఖలు చేయాలి, ఆ ఫిర్యదును పరిక్షించిన తర్వాత పోలీసు చర్యకు ఆదేశిస్తూ మేజిస్ట్రేట్ ప్రత్యేక ఉత్తర్వును జారి చేయవచ్చు. అయితే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 174(2) ప్రకారం ఫిర్యాదు చెల్లుబాటు అవుతుందని కనుగొన్నప్పుడే. గతంలో ప్రస్తావించినట్లుగా నల్లబాలు పై పరువునస్టం నేరం మోపినా, భారతీయ నాగరిక్ సురక్షా సంహితా ప్రకారం బాధిత వ్యక్తి నుంచి ఫిర్యాదు రావాలి తప్పా ఎవరో మూడవ పార్టీల నుంచి కాదు.
- అరెస్టు మార్గదర్శకాలకు కట్టుబడి: అన్ని కేసుల్లో , పోలీసులు అర్నేశ్ కుమార్ వర్సెస్ బీహర్ రాష్ట్రం, 2014లో పొందుపర్చిన సూత్రాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. తమకుతాము లేదా “యాంత్రికబద్దంగా” అరెస్టులకు అనుమతించరాదు, నేర ప్రకృయ అమలులో నిష్పత్తి సూత్రాన్ని ఖచ్చితంగా చూడాలి.
- సున్నతమైన కేసుల్లోముందు న్యాయ పరిశీలన: రాజకీయ ప్రసంగం/ పోస్టు లేదా భావాన్నివ్యక్త పర్చే ఇతర సున్నితమైన పద్దతులు వంటి అంశాలు తలెత్తినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందు పోలీసులు తీసుకునే చర్య చట్టపరంగా నిలిచే విధంగా చూసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ముందుగా న్యాయ సలహ తీసుకోవాలి.
- పనికిమాలిన లేదా ప్రేరేపిత ఫర్యాదులు: ఫిర్యదు పనికిమాలినది, వెక్కిరించే విధంగా లేదా రాజకీయ ప్రేరేపితంగా ఉన్నట్లు కనుగొన్నట్లయితే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 176(1) కింద విచారణకు కావల్సిన తగినన్ని ఆధారాలు లేని కారణంగా పోలీసులు ఈ అంశాన్ని మూసివేయ వచ్చు.
ఈ కథనం ముందుగా ఆల్ట్ న్యూస్‌లో ప్రచురించబడింది వారి అనుమతితో తిరిగి ప్రచురిస్తున్నాము.
అంకిత మహలనోబిష్
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
