సరైన– తక్షణ జోక్యం లేకపోతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) సిబ్బంది కొరత పెద్ద సవాలుగా మారి- భద్రతాపరమైన విషయంలో తీవ్ర పరిణామాలకు దారితీయగలదని విమానయాన పరిశ్రమ వాటాదారులు హెచ్చరించారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్త ఏటీసీ కేంద్రాలలో సిబ్బంది కొరత విమానయాన రంగ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం విమానయానరంగంలో ఈ కొరత చాలా వేగంగా పెరుగుతోంది.
ఇటీవల నవీ ముంబాయిలో ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయం, నోయిడాలో ప్రారంభించనున్న జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఈ సవాల్ మరింత తీవ్రం కాగలదని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
“దేశంలో కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి. ప్రతిరోజు మరిన్ని విమానాలను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో 5,337 ఏటీసీ పోస్టులు మంజూరు కాగా 1,613 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కనీసం 8,000 మంది ఏటీసీ అధికారుల అవసరం ఉంది. ఈ తీవ్రమైన కొరత ప్రయాణికుల భద్రతకే కాకుండ ప్రస్తుతమున్న అధికారుల క్షేమానికి కూడా సమస్యగా మారే అవకాశాలున్నాయి” అని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) వర్గాలు చెప్పినట్టుగా న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక పేర్కొన్నది.
అయితే, 2019లో ఏటీసీ సిబ్బందికి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్(ఎఫ్డీటీఎల్) అమలు పరచడం వల్ల ఏటీసీ ఆపరేషన్లు 24/7 పనిచేశాయి.
“ఏ కొద్ది పాటి అశ్రద్ధ వహించినా పెద్ద దుర్ఘటనకు దారితీసే అవకాశాలు ఉంటాయో, అటువంటి విభాగంలో కీలకమైన భూమికను పోషిస్తున్న ఏటీసీఓలు అంతకుముందు ఎక్కువ గంటలు పని చేయిస్తుండేవారని” ఆ వర్గాలు అదనంగా జతచేశాయి.
శిక్షణా మౌలిక సదుపాయాల తీవ్రమైన కొరత కూడా సమస్యకు కారణం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు ఏటీసీ శిక్షణా కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి.
అందులో ఏటీసీల సేవలను అందించే ప్రధానమైన రెండు విభాగాలు– ఏయిర్ నావిగేషన్ సర్వీసులు, కమ్యూనికేషన్ నావిగేషన్ సర్వీసులు. కీలకమైన విషయమేంటంటే, ఈ రెండు రెక్కలు– విమానాల రాకపోకలు, కమ్యూనికేషన్, నావిగేషన్, సర్వీలియన్స్ వ్యవస్థలతో చాలా దగ్గరగా సమన్వయంతో పని చేస్తాయి.
“ప్రభుత్వ ఉద్యోగమే అయినప్పటికీ షిఫ్ట్ విధానం, తక్కువ వేతనాల కారణంగా ఈ విభాగం ఉద్యోగవేటలోని వారికి ఎక్కువగా ఆకర్షించలేకపోతుంది. ఒక ఏటీసీఓ రోజుకు 15 నుంచి 20 విమానాల రాకపోకలను ఏకకాలంలో చూసుకోవాలి. అదే పైలెట్ అయితే ఒకే విమానం చూసుకోవాలి. అయినా ఒక కొత్త ఏటీసీఓ నెలకు 60,000 వేల వేతనం పొందుతుండగా, పైలెట్ మాత్రం ఉద్యోగంలో చేరిన వెంటనే 2.5 లక్షల రూపాయిల వేతనాన్ని నెలకు పొందుతున్నారని” సంబంధిత వ్యక్తులు న్యూస్ పేపర్‌కు తెలియజేశాయి.
అయితే, ఈ సమస్యపై అధికారికంగా స్పందించడానికి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిరాకరించింది. ఈ రంగం నిరంతరంగా వృద్ధి చెందుతున్న దృష్ట్య తక్షణమే సుస్థిరమైన జోక్యం చేసుకోవాలి. ఒకవేళ పట్టించుకోకపోతే ఏటీసీ సిబ్బంది కొరత కొత్త సవాళ్లకు దారితీసి భద్రత విషయంలో తీవ్ర సమస్యకు కాగలదని, భారతీయ విమానయాన పరిశ్రమ వాటాదారులు హెచ్చరిస్తున్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
