ఓ మామూలు మనిషి. ఓ సగటు మానవుడు.
నిజమైన జనం నచ్చిన శ్రీకృష్ణుడు.
జనం ముందే నిలబడే శ్రీకృష్ణుడు.
రీమేక్ లేదు. రీటేక్ లేదు. సినిమా కాదు— రంగస్థలం.
అడిగినవాడు గెలుస్తాడు. లేదా పడిపోతాడు.
కళాకారుడు పాడతాడు. మాట్లాడతాడు. అరుస్తాడు.
ఒకసారి స్టేజీ దుస్తులు వేసుకున్నాక,
నాటకం పూర్తయ్యేదాకా కిరీటాలు దించడు.
నటుడు కాదు—నిజమైన కళాకారుడు.
అతను సినిమాల్లోనైనా, రాజకీయాల్లోనైనా నటించలేడు.
నటించడం అతనికి రాదు.
అందరూ ఆనందించగలిగిన శ్రీకృష్ణుడు.
నటుడు కాదు, సహజ నటుడు
వరంగల్ జిల్లా ముచ్చర్ల ఊరు నుంచి,
హైదరాబాద్లో మంత్రిగా నిలబడ్డ మనిషి—
సంగంరెడ్డి(ముచ్చర్ల) సత్యనారాయణ.
పదవుల కోసం దేబెరించలేదు. బెదిరించలేదు.
జేబులో రాజీనామా రాసుకుని, సంతకం చేసి సిద్ధంగా ఉన్నవాడు.
తెలంగాణకు జరిగిన అన్యాయాలను
సత్తెన్న ప్రశ్నించిన వాడు.
గుండెల్లో తుపాకుల్లాంటి ప్రశ్నలు.
“ముఖ్యమంత్రి సంజీవరెడ్డి మామా” అంటూ
సత్తెన్న పాడిన పాటలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తాయి.
సత్తెన్నకు విగ్రహం ఎక్కడ?
రవీంద్రభారతి పరిసరాల్లో జాగ ఉంటుందా?
చనిపోయిన వెంటనే వందల విగ్రహాలు పెడతారు.
కానీ కళాకారుడు, పత్రికలు రాసినవాడి బొమ్మకు
ఎక్కడన్న జాగ దొరుకుతుందా?
సత్తెన్నా సొంత తెలంగాణలో కూడా?
నిప్పులు చెరిగే స్వరం- జన కవన కాగడా, మాజీ మంత్రి ముచ్చర్ల సత్తన్న 93వ జయంతి సదర్భంగా ప్రచురితం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
