కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానమిస్తూ అందచేసిన డేటా ప్రకారం, కేవలం 95 ఇంటర్న్స్‌కు మాత్రమే వారి యజమానులు ఆఫర్ లేటర్లను అందచేశారు.
న్యూఢిల్లీ: లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ డిసెంబరు 1న ప్రవేశపెట్టిన డేటా ప్రకారం, వచ్చే ఐదు సంవత్సరాలలో కోటి మంది యువకులకు శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యంతో, నరేంద్ర మోడీ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని(పీఎంఐఎస్) ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభించిన సంవత్సరం తర్వాత తక్కువమంది ఆమోదం పొందడం, మధ్యలోనే వదిలివేయడంలాంటివి జరిగాయి.
తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు సయాని ఘోష్, జూన్ మలియా అడిగిన ప్రశ్నలకు కేంద్ర కార్పోరేట్ వ్యవహరాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లిఖిత పూర్వక సమాధానమిస్తూ డేటాను పంచుకున్నారు. ఆ డేటా ప్రకారం, మొదటి దఫాలో 60 వేలు, రెండవ దఫాలో 71 వేల మంది అభ్యర్ధులకు ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పించగా; మొదటి దఫాలో కేవలం సుమారు 16 వేలు- 8700, రెండవ దఫాలో7,300 మంది చేరారు. అయితే మానేసి మధ్యలోనే వదిలి వెళ్లిపోవడం అంతే ఆందోళనకరంగా ఉంది. చేరిన వారిలో 6,618 మంది అభ్యర్ధులు సుమారు 41% మంది; తమ 12 నెలల ప్లేస్‌మెంటు పూర్తి చేయక ముందే నవంబరు 26 నాటికి వెళ్లిపోయారు. మానేసిన వారిలో మొదటి దఫా నుంచి 4,565 మంది ఉండగా; రెండవ దఫాలో 2,053 మంది ఉన్నారు. యాజమాన్యాల నుంచి ఇంతవరకు 95 మంది ఇంటర్నర్లు మాత్రమే ఆఫర్ లెటర్లను అందుకున్నారు.
ఈ పథకానికి 2025- 26 ఆర్ధిక సంవత్సరంలో రూ 10,831 కోట్ల భారి కేటాయింపులు జరిగాయి. అయినప్పటికీ, 2025 సెప్టెంబరు 30నాటికి కార్పొరేట్ మంత్రిత్వ శాఖ కేవలం రూ 73.72 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. దీనికి మూడు ముఖ్యమైన కారణాలను మంత్రిత్వశాఖ ఆపాదించింది: ఐదు నుంచి పది కిలోమీటర్ల ప్రయాణానికి విముఖత, ప్రత్యేక నైపుణ్యత శిక్షణ కార్యక్రమాల కంటే ఎక్కువ సంవత్సరం కాలం గడువు, తమకు కేటాయించిన బాధ్యతల పట్ల అనాసక్తి.
గడిచిన అక్టోబరులో ఈ పథకాన్ని రెండు దశల్లో ప్రారంభించారు. ప్రారంభ దశలో సుమారు 1.27 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటించారు. దీనికి దాదాపు 1.81 లక్షల మంది అభ్యర్ధుల నుంచి 6.21 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 82 వేల ఇంటర్న్‌షిప్‌ల అవకాశాలను 60 వేల మంది అభ్యర్ధులకు పొడిగించగా– 8,700 మంది ఈ ఆఫర్లను అంగీకరించారు. రెండవ దశ 2025 జనవరిలో మొదలైంది. 1.18 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు(కొత్తవి, మొదటి దశలో భర్తీ కానివి)పోస్టు చేయగా; 2.14 లక్షల మంది అభ్యర్ధుల నుంచి సుమారు 4.55 లక్షల దరఖాస్తులను స్వీకరించారు. భాగస్వామ్య కంపెనీలు 83 వేల ఆఫర్లను 71 వేల దరఖాస్తుదారులకు ఇచ్చాయి. అందులోంచి 24,600 ఆఫర్లు అంగీకరించబడ్డాయి.
“పీఎంఐఎస్ పైలెట్ ప్రాజెక్టు కింద, ఏదైతే కంపెనీ ప్రత్యక్షంగా పాలుపంచుకుంటుందో; ఆ కంపెనీ వాస్తవిక పని అనుభవాన్ని నైపుణ్యం అందించిన వ్యక్తికి కల్పించాల్సి ఉంటుంది. వివిధ వ్యాపార సంస్థలు, సంఘాలలో వాస్తవిక జీవన వాతావరణానికి లోబడి యువతకు నైపుణ్యతలో అనుభవాన్ని సంపాదించడంలో శిక్షణ అవకాశాలను కల్పించి విద్యా విషయక అభ్యాసానికి, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలిగించడమే ప్రధాన ఉద్దేశ్యము”అని మల్హోత్రా పేర్కొన్నారు.
“రాష్ట్రాలలో నిర్దేశించిన వర్గాలకు అవకాశం కల్పించడానికి కావల్సిన ప్రచారం విషయంలో ఎంసీఏ రాష్ట్ర ప్రభుత్వాలతో చురుకైన సమన్వయాన్ని ఏర్పర్చుకుంటూ ; సదస్సులు, సమావేశాలు, సభలు వర్క్‌షాపుల క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ఆన్లైన్- ఆఫ్‌లైన్ ద్వారా విస్తృత సమాచారం, విద్య సమాచార మార్పిడి వంటివి చేపడుతుంది. పైలెట్ ప్రాజెక్టు అమలు సందర్భంగా వాటాదారులతో సంప్రదింపులు అమలుతో వస్తున్న అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగా పీఏం ఇంటర్న్‌షిప్ పథకాన్ని పూర్తి ప్థాయిలో అమలు చేయడం జరుగుతుంది”అని ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రాల వారిగా దరఖాస్తులు, చేరిక వివరాలు..
రెండు దశల్లో చూస్తే దరఖాస్తుల విషయంలో 51,225 అభ్యర్ధులతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా– 46,272తో ఉత్తర ప్రదేశ్; 43,851తో మధ్యప్రదేశ్ ఉన్నాయి.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండవ దశలో దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే; మిజోరాంలో 75%తో తక్కువ( మొదటి దశ 16, రెండవ దశలో 4), హర్యానా 74.6( 13,381-3389 ), అస్సాం 60.5(7,384-2.913), ఉత్తర్ ప్రదేశ్ 50.2(30,889-15.383), నాగాలాండ్ 49.5(109-55), మణిపూర్ 48.3(118-61), ఢిల్లీ 47.7(5682-2972), ఝార్ఖండ్ 45.3(4172-2283), హిమాచల్ ప్రదేశ్ 44.3(1210-674)గా ఉన్నాయి.
ఉపాధి పొందిన వారిలో ఉత్తరప్రదేశలో 1913(తొలిదశ 1241, రెండవదశ 672), అస్సాం– 1806, మధ్యప్రదేశ్– 1247, ఈ మూడు రాష్ట్రాల్లో మొదటి దశ కంటే రెండవ దశలో తక్కువ మంది చేరారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధుల స్థితిగతులు..
ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధుల దరఖాస్తులు మొదటి దశలో 1,24,258 నమోదై; రెండవ దశలో 1,01,152కు తగ్గిపోయాయి. అయితే మొత్తం ఎస్సీ, ఎస్టీ దరఖాస్తులు 37,165 నుంచి 47,975కు పెరిగాయి. భాగస్వామ్య కంపెనీలు 30,001(తొలి దశలో 13,222 రెండులో 16,779)మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించాయి.
ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తులు ఆఫర్లు పెంచినప్పటికీ; అసలు చేరిన ఇంటర్న్‌ల సంఖ్య మొదటి దశలో 1,802 నుంచి రెండవ దశలో 1,364కు తగ్గిపోయింది.
కంపెనీల భాగస్వామ్యం..
కేవలం 95 ఇంటర్న్స్ ఆఫర్ లెటర్స్‌ను దాదాపు 17 కంపెనీలు అందించాయి. అందులో ముత్తూట్ ఫైనాన్స్(32), టెక్ మహేంద్ర(20), మణప్పురం ఫైనాన్స్(14), ఐటీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్(7), డాక్టర్ రెడ్డి ల్యాబ్స్(5)తోపాటు ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ ఫుల్‌టైమ్ ఆఫర్‌ను ప్రకటించింది.
మరో జాబితాలో 93 సంస్థలు ఒక్కొకటి 50 చొప్పున ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పించాయి. ఇందులో ఇన్ఫోఎడ్జ్(ఇండియా) గరిష్టంగా 49 ఆఫర్లు ఇవ్వగా; డీసీబీ బ్యాంక్, మహనగర్ గ్యాస్, అట్లాస్కాప్కో(ఇండియా), ఘర్డా కెమికల్స్, మాక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్, విన్సోల్ సోలార్ ఫీల్డ్స్, యర్రో ఇంఫ్రాస్టక్చర్, యారోఇన్ఫ్రాస్ట్రక్చర్ & మహారాష్ట్ర తూర్పు గ్రిడ్ పవర్ ట్రాన్స్మిషన్ కో. లిమిటెడ్ రెండు దశలకు కలిపి ఒక్కో ఆఫర్‌ను ప్రకటించాయి.
ఈ పథకం యజమానులకు స్వచ్ఛందంగానే వ్యవహరిస్తుంది. ఏ కంపెనీ అయినా ఆఫర్లు ఇవ్వవచ్చు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
