బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఢాకా నుంచి శనివారం రాత్రి భారతదేశానికి ఆహ్వానం వచ్చింది.
ముందుగానే ఖరారయిన షెడ్యూల్డ్ ప్రకారం, మంగళవారంనాడు ముంబైలో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ఏఐ ప్రభావంపై శిఖరాగ్ర సమావేశానికి మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రహ్మాన్ మంగళవారం(ఫిబ్రవరి 17)న ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో ప్రాతినిధ్యం వహించడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను భారత్ నియమించింది.
ముంబైలో ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలకు ఆతిథ్యం ఇస్తున్న కారణంగా, ప్రధాని మోదీ అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్లోబల్ సౌత్‌లోనే అతిపెద్ద వేడుకగా చెప్పబడుతున్న ఏఐ ప్రభావం శిఖరాగ్ర సమావేశం సహనిర్వాహకుడిగా మాక్రాన్ ఈ వారం భారత్‌ను సందర్శించనున్నారు.
ఉభయ దేశాల ప్రజల మధ్య ఉన్న “లోతైన, శాశ్వతమైన స్నేహానికి” బిర్లా పాల్గొనడం నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
“రెండు దేశాలను కట్టుబడి ఉంచే ప్రజాస్వామ్య విలువల పట్ల భారత్ దృఢమైన నిబద్ధతతో ఉందని” పునరుద్ఘాటించింది.
రహ్మాన్ నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వంతో బంగ్లాదేశ్ పరివర్తనను ఆహ్వానిస్తూ “ఆయన దూరదృష్టికి, విలువలకు ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఆమోదం లభించిందని” ఆ ప్రకటన పేర్కొంది.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) నేతృత్వంలోని ప్రభుత్వంతో సరైన సంబంధాల కోసం భారత్ ప్రయత్నిస్తోంది.
ఆసక్తి కనబర్చినా చివరికి ఓం బిర్లా ఎంపిక
ముఖ్యంగా ముహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వ హయాంలో ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తత ఏర్పడి, అధిక భాగం బంగ్లాదేశీ యువకుల్లో భారత్ పట్ల వ్యతిరేక భావం ఏర్పడింది.
దాంతో సీనియర్ స్థాయి అధికారులతో గౌరవప్రదమైన ప్రతినిధి వర్గాన్ని ఢాకాలో ఉంచి, కొత్త ప్రభుత్వంతో సానుకూల మార్పిడి పట్ల న్యూఢిల్లీ తీవ్రంగా పరిశీలిస్తోంది.
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చారు.
అయితే, చివరికి న్యూఢిల్లీ ఓం బిర్లాను ఎంపిక చేసింది.
బిర్లా వెంట విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెళ్లనున్నారు. బీఎన్పీ అధ్యక్షురాలు ఖలీదా జియా అంతిమ యాత్ర కోసం డిసెంబర్ 31న జైశంకర్ ఢాకాను సందర్శించారు.
2024 తర్వాత మొదటి ఎన్నిక..
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తన బీఎన్పీ కోసం రహ్మాన్ భారీ మెజారిటీని దక్కించుకున్నారు. దేశానికి సుదీర్ఘ కాలం పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన షేక్ హసీనా, 2024 జూలైలో విద్యార్థుల తిరుగుబాటుతో వైదొలిగిన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక ఇది.
హసీనా ప్రస్తుతం భారత్‌లో ప్రవాసంలో ఉన్నారు. మోదీ ‘ఎక్స్’ ఖాతా ద్వారా రహ్మాన్‌కు శుభాకాంక్షలు తెలియజేసి ఫోన్లో మాట్లాడారు.
“మన బహుముఖ సంబంధాలను పటిష్టవంతం చేయడానికి, మన సాధారణ అభివృద్ధి లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని” మోదీ అన్నారు.
వివిధ దేశాలకు ఆహ్వానం..
బంగ్లాదేశ్ పార్లమెంటు కొత్త సభ్యులు, రహ్మాన్ మంత్రివర్గం ఢాకాలో ప్రమాణం చేస్తారు, సాయంత్రం మంత్రులుగా బాధ్యతలు చేపడతారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాలకు తాత్కాలిక ప్రభుత్వం శనివారం రాత్రి ఆహ్వానాలను పంపించింది.
భారత్, చైనాతో సహా సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్వంటి దేశాలను బంగ్లాదేశ్ ఆహ్వానించింది.
ఢాకాలో యూనుస్ నేతృత్వంలో పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ పరిపాలనల మధ్య కొంత వ్యతిరేకత ఏర్పడింది.
నియంతృత్వ పాలనకు అండగా ఉండడమే వ్యతిరేకతకు కారణం..!
తాత్కాలిక ప్రభుత్వం కింద హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలను అగౌరవంగా చూస్తున్నారని న్యూఢిల్లీ తరచూ ఆరోపిస్తూ వచ్చింది. ఈ ఆరోపణలన్నీ అతిశయోక్తి అని పేర్కొంటూ ఆ దేశం త్రోసిపుచ్చింది. ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన కారణంగా తమ రాయబారులను ఇరు దేశాలు వెనక్కు రప్పించుకున్నాయి.
ఇదిలా ఉండగా, హసీనా నియంతృత్వ పాలనకు అండగా ఉంటుందని నిందిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా అనేకమంది బంగ్లాదేశీయులు కోపంగా ఉన్నారు.
2024 జూలైలో విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమానికి నాయకుడిగా ఉన్న ఉస్మాన్ హదీని కాల్చి చంపడంతో వారు వీధుల్లోకి వచ్చారు. హంతకులు సరిహద్దు దాటి భారత్‌కు పారిపోయారన్న అవగాహనతో వారు ఉన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
