ఈ ఏడాది జనవరి 2025లో జరిగిన జేఈఈ మెయిన్-2025లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష తుది జవాబు పత్రంలో తప్పిదాల వల్ల 12 ప్రశ్నలను ఉపసంహరించుకున్నట్టుగా నివేదిక తెలియజేసింది.
న్యూఢిల్లీ: గత ఏడాది పని తీరు “ఎలాంటి ప్రేరణను, చెప్పుకోదగ్గ విశ్వాసాన్ని” పెంపొందించలేకపోయిందని విద్యా విషయంపై జాతీయ పరీక్షా ఏజేన్సీ(ఎన్టీఏ)ను అఖిల పక్ష పార్లమెంటు స్థాయి సంఘం మందలించింది.
జేఈఈ(మెయిన్)తో పాటు నీట్స్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కార్యక్రమాలు ఇతర ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ సంస్థలు జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(అండర్ గ్రాడ్యుయేట్)- అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కళాశాల అడ్మిషన్స్(నీట్- యూజీ)వంటి ప్రధాన పరీక్షలను నిర్వహించే బాధ్యత 2018లో ఏర్పాటు చేసిన ఎన్టీఏపై ఉంది.
“2024 సంవత్సరంలోనే మూడు 14 పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహించింది. వాటిలో కనీసం ఐదు ప్రధాన సమస్యలను ఎదుర్కొన్నాయి. దీని పర్యావసనంగా మూడు పరీక్షలు యూజీసీ- ఎన్ఈటీ, సీఎస్ఐఆర్- ఎన్ఈటీ, నీట్-పీజీ వాయిదా వేయడమైంది. ఒక్క పరీక్ష నీట్- యూజీ పేపర్ లీక్, మరో పరీక్ష సీయూఈటీ(యూజీ/పీజీ) ఫలితాలను వాయిదా వేసినట్టు మా దృష్టికి తీసుకొచ్చారు” అని కమిటీ తన నివేదికలో పేర్కొన్నది.
2025 జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ ఇంజీనీరింగ్ ప్రవేశ పరీక్ష తుది జవాబు పత్రంలో తప్పిదాల వల్ల కనీసం 12 ప్రశ్నలను ఉపసంహరించుకన్నారని నివేదిక తెలియజేసింది.
ఈ వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు పరీక్షలు రాసేవారిలో విశ్వాసాన్ని కలిగించలేవని స్థాయి సంఘం అభిప్రాయపడింది.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటం; లేదా పూర్తిగా నిరోధించడానికి తగిన చర్యలను తీసుకోవడానికి ఎన్టీఏ వ్యవహరించాలని కమిటీ సిఫార్సు చేసింది. అంతేకాకుండా పేపర్ సెట్టింగ్, పరిపాలన, జవాబు పత్రాలు దిద్దడంలో పాలుపంచుకున్న అనేక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం లేదా సంస్థ బ్లాక్‌లిస్టులో పెట్టినప్పటికీ; ఇతర రాష్ట్రాలు లేదా సంస్థలు కాంట్రాక్టులను పొందడాన్ని అడ్డుకోలేకపోతున్నారని నివేదిక తెలిపింది.
కమిటీ చైర్మన్ కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్‌సింగ్ తన Xఖాతాలో డిసెంబరు 8న సిఫార్సుల జాబితాను పంచుకున్నారు.
గడిచిన ఆరు సంవత్సరాలలో పరీక్షల నిర్వహణ కోసం ఎన్టీఏ సుమారు రూ 3,512,98 కోట్లు వసూలు చేయగా; అందులోంచి రూ 3,064,77 కోట్లను ఖర్చు చేసి రూ 448 కోట్లను మిగిల్చుకుంది. పరీక్షలు నిర్వహించే ఏజెన్సీ తనకు తాను సామర్ధ్యాన్ని పెంచడానికి మిగులు నిధులను ఉపయోగించాలని; లేదా తన విక్రేత కోసం నియంత్రణ, పర్యవేక్షణ సామర్ధ్యాన్ని పటిష్టం చేయాలని కూడా సిఫార్సు చేసినట్టు నివేదిక తెలియజేసింది.
సీబీఎస్సీ, యూపీఎస్సీతో సహా ఇలాంటి పరీక్షల అనేక మోడళ్లు ఎన్నోసంవత్సరాలుగా లీక్- ప్రూఫ్ పరీక్షలను పెన్ను-పేపర్‌తో నిర్వహిస్తున్నాయని ఎన్టీఏ కూడా పెన్ను-పేపర్ పరీక్షపై ప్రత్యేక దృష్టిని సారించాలని; కంప్యూటర్ ఆధారిత పరీక్షలైతే(సీబీటీ)వాటిని ప్రైవేటు కేంద్రాల్లో కాకుండా ప్రభుత్వం లేదా ప్రభుత్వ నియంత్రణ కేంద్రాల్లో నిర్వహించాలని కూడా పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
