ప్రధాని మోడీ వంటి సీనియర్ ప్రభుత్వ అధికారులకు ఈ విజయం ఒక అరుదైన అవకాశాన్ని అందించింది. సామాజిక మాధ్యమాల్లో వీరు పోస్టు చేసిన సందేశాలు “అవివేకంగా”, “తీవ్రమైన అమర్యాద”గా ఉన్నాయని చాలామంది అన్నారు.
న్యూఢీల్లీ: సెప్టెంబరు 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించింది. దేశ ప్రధానితో సహా పలువురు క్రీడాకారులు, ప్రేక్షకుల మధ్య ఈ విజయం అసాధారణ రాజకీయ చర్చకు దారి తీసింది.
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను భారత్ ఓడించింది. ప్రదానోత్సవం వేళ, వేదికపై ట్రోఫీని తీసుకోవడాన్ని సూర్యకుమార్ యాదవ్ జట్టు నిరాకరించింది. దీనిని ఇప్పటికే చాలామంది గమనించి ఉంటారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షులు మొహ్సిన్ నఖ్వీ అక్కడ ఉండటమే ఇందుకు కారణం. అయితే, కేవలం 11 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టుకు వ్యతిరేకంగా ఆడటం, ఆ తర్వాత ట్రోఫీను నిరాకరించిన కారణం ప్రశ్నార్ధకంగా ఉంది.
ఇదిలా ఉండగా నిరాకరించిన ట్రోఫీని, మెడల్స్‌లను నఖ్వీ తిరిగి తన హొటల్కు తీసుకెళ్ళారని కూడా భారత్ ఆరోపించింది.
“ఆయన చేతులమీదుగా ట్రోఫీని తీసుకోవద్దని మేము నిర్ణయించుకున్నాం. కానీ ట్రోఫీని, మెడల్స్‌ను తన వెంట తీసుకెళ్ళమని దాని ఉద్దేశం కాదు. ఇది చాలా దురదృష్టకరం, వీలైనంత తొందరగా వాటిని భారత్‌కు అప్పగిస్తారని ఆశిస్తున్నాము” అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఎఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.
క్రికెట్‌కు ఆపరేషన్ సిందూర్ నేపథ్యం..
పహెల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పౌరులు చనిపోయారు. దీనికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ఎదురుదాడికి దిగింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రస్తుత క్రికెట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం– సామాజిక మాధ్యమాలలో పోస్టుల చేసే అరుదైన అవకాశాన్ని సీనియర్ ప్రభుత్వ అధికారులకు కల్పించింది. ఈ పోస్టులు అవివేకంగా, తీవ్రఅమర్యాదగా ఉన్నట్లు చాలామంది అభివర్ణించారు.
ఈ సామాజిక మాధ్యమ సందేశాలకు నేతృత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోడీ “క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్. ఒకేరకమైన ఫలితం- భారత్ విజయం! మన క్రికెటర్లకు శుభాకాంక్షలు” అని అన్నారు.

“క్రికెట్ విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌తో పోల్చడం అంటే, యుద్ధంలో తమ ప్రాణాలను పోగొట్టుకున్న సైనికులను తీవ్రంగా అవమానించినట్టే అవుతుంది. ఇది ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. సైనికుల త్యాగాలను, రాజకీయ నినాదానికి దిగజార్చారు” అని ఎక్స్‌లో ఓ ఖాతాదారు తీవ్ర ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
“ఎక్కడైతే మన సైనికులు తమ జీవితాలను ఫణంగా పెట్టారో, ఆ ఆపరేషన్ సిందూర్ వంటి సైనిక చర్యను చిన్న చూపు చూడకూడదు. జాతీయ భద్రతకు క్రీడలు రూపకం కాదు. ఆ పేరుకు వెనకాల ఉన్న త్యాగాలను గౌరవించండి. అంతేతప్పా, అభినందనల కోసం ఉపయోగించడం కాదు” అని సనాతన ధర్మ పేరుతో ఉన్న సామాజిక మాధ్యమ ఖాతా నరేంద్ర మోడిని కోరింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ఈ వ్యవహారంపై స్పందిస్తూ మోసిన్నక్వీ– భారత్‌లో ఆయన అకౌంట్‌ను నిలిపివేశారు. “యుద్ధమే మీ గర్వానికి కొలమానమయితే– పాకిస్తాన్ చేతిలో ఎన్నిసార్లు అవమానకరమైన ఓటమని చవి చూశారో చరిత్రలో ఇప్పటికే లిఖించబడి ఉంది. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా ఆ వాస్తవాన్ని తిరిగి రాయలేదు. క్రీడల్లోకి యుద్ధాన్ని లాగడం నిరాశ, అవమానాన్ని బహిర్గతం చేస్తూ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడమే అవుతుంది” అని అన్నారు.

“ఇది అసాధారణమైన విజయం. మన పిల్లల శక్తి ముందు ప్రత్యర్ధులు మళ్ళీ గాలిలో ఎగిరిపోయారు. ఏ రంగమైనప్పటికీ గెలుపే భారత్ గమ్యం” అని కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు.

క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు సంబంధించిన మూడు ఫొటోలను స్టార్ బ్యాట్మింటన్ ఒలంపియన్ పీవీ సింధూ పంచుకున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతిబింబంగా బుమ్రా చేతి సంకేతాలు ఆ ఫొటోలలో ఉన్నాయి.
భారత ప్రభుత్వ పౌరులతో అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన MyGovIndia సామాజిక మాధ్యమ ఖాతా కూడా నమ్మశక్యంకాని విధంగా; బుమ్రాకు సంబంధించిన చేతి విమాన చిహ్న చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో “క్యాప్షన్ అవసరం లేదు” అని పోస్ట్ చేసింది.

ఇలాంటి శిక్షకు పాకిస్తాన్ అర్హతగల దేశమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

టోర్నమెంటు మొత్తంలో, తోటి పాకిస్తానీ ఆటగాళ్ళతో చేతులు కలపడాన్ని భారత క్రికెటర్లు నిరాకరించారు.
“పాకిస్తాన్ వ్యతిరేక యుద్ధం కోసం క్రికెట్‌ను ప్రచ్ఛనంగా మార్చుతున్నారు. ఇది సహచరత్వానికి, క్రీడా స్పూర్తికి కాకుండా వాణిజ్యపరంగా ఉపమోగపడుతుంది. ఒకప్పుడు ఎంతో సేవలందించినప్పటికీ, దౌత్యపరమైన అవసరాలకు క్రికెట్‌ను బీసీసీఐ పనికిరాకుండా చేస్తుంది” అని ఒక వారం క్రితం ది వైర్ విశ్లేషణలో సరయూ పాని తెలియజేశారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
