ప్రస్తుత ప్రపంచాన్ని కృత్రిమమేధ(ఏఐ) శాసిస్తోంది. విద్య, వైద్యంతో పాటు ప్రతీరంగంలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ వాడకం ఇంకా పెరిగే అవకాశాలున్నాని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్(ఏఐ) గురించి చాలా తక్కువమంది భారతీయులకు మాత్రమే తెలుసంటే ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు.
పీఈడబ్ల్యూ నివేదిక ప్రకారం, భారతదేశంలో కేవలం 14% మంది మాత్రమే ఏఐ గురించి విన్నవారు, తెలిసిన వారున్నారు. వీరు కాకుండా మరో 32% ప్రజలకు ఏఐ గురించి కొంత అవగాహన ఉంది. ఈ మొత్తం కలిపితే 46%మందికి ఏఐ గురించి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారతదేశం తర్వాత ఏఐ గురించి తెలిసిన 12% ప్రజలు కెన్యా దేశంలో ఉన్నారు.
“ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏఐని ఎలా చూస్తున్నారు?” అనే అంశం మీద 2025 జనవరి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు పీఈడబ్ల్యూ సర్వేను నిర్వహించింది. సర్వే నివేదికను 2025 అక్టోబరు నెలలో విడుదల చేసింది. తలసరి, స్థూల జాతీయ ఆదాయాన్ని కొలమానంగా తీసుకొని 25 దేశాలను మూడు కేటగిరీలుగా విభజించించి సర్వే చేశారు.
నిరాశాజనకంగా ప్రజా స్పందన..
సంపన్న, అభివృద్ధి, వెనుకబడిన దేశాలుగా విభజించి నిర్వహించిన సర్వేలో కొత్త సాంకేతికత ఏఐ గురించి యువత ఎక్కుగా తెలుసుకుంటారని భావించారు. కానీ దీనికి భిన్నంగా భారతదేశంలో 18- 34 ఏళ్ల యువకుల్లో 19% మంది ఏఐ గురించి విన్నట్లు, చదివినట్టుగా తెలియజేశారని నివేదిక పేర్కొంది.
అంతేకాకుండా ఏఐ వాడకంపై అంతలా ఆసక్తిని కనబర్చటంలేదని, రోజువారి జీవితంలో ఏఐ వాడకం ఉత్సాహం కంటే ఆందోళనను ఎక్కుగా కలిగిస్తోందని 19% భారతీయులు అభిప్రాయపడ్డారు.
ఏఐ గురించి ఎక్కుగా తెలుసుకొని, చదివినవారు జర్మనీలో 96% మంది ప్రజలున్నారు. అలాగే అమెరికాలో 95, యూకే 90, అర్జెంటీనా 72, మేక్సికో 72, తుర్కియే 69, బ్రెజిల్ 69, దక్షిణాఫ్రికా 61, నైజీరియా 61, ఇండోనేషియా 54, కెన్యా 48, భారత్ 46% ప్రజలున్నారు.
ఇక ఏఐ గురించి తెలుసుకొని, చదివిన 18 నుంచి 34 మధ్య వయసున్నవారు; జర్మనీలో 72%, యూఎస్ 60, యూకే 56, బ్రెజిల్ 34, అర్జెంటీనా 34, తుర్కియే 33, మెక్సికో 32, ఇండోనేషియా 28, నైజీరియా 20, భారత్ 19, కెన్యాలో 14% మంది ఉన్నట్లు సర్వే నివేదిక వివరించింది.
అంతేకాకుండా, రోజువారి జీవితంలో ఏఐ వాడకం ఉత్సాహం కంటే ఆందోళనను ఎక్కువగా కలిగిస్తుందని చెప్పిన వారిలో అమెరికాలో 50%, బ్రెజిల్ 48, యూకే 39, అర్జెంటీనా 39, మెక్సికో 35, ఇండొనేషియా 32, కెన్యా 31, దక్షిణాఫ్రికా 30, జర్మనీ 29, తుర్కియే 26, నైజీరియా 24, భారత్ 19% మంది ప్రజలున్నారు.
ఏఐ వాడకాన్ని తమ ప్రభుత్వాలు సమర్ధవంతంగా నియంత్రించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ప్రజలు భారత్లో 90% మంది ఉండగా, ఇండోనేషియా 74, జర్మనీ 70, దక్షిణాఫ్రికా 64, తుర్కియే 60, యూకే 57, కెన్యా 54, మెక్సికో 50, నైజీరియా 46, యూఎస్ 44, బ్రెజిల్ 36, అర్జెంటీనాలో 33% మంది ఉన్నారు.
సర్వే చేసిన 25 దేశాలతో పోలిస్తే ఏఐ గురించి విన్నవారు, కొంత చదివినవారు, బాగా చదివిన వారి జాబితాలో భారతదేశం వాటా తక్కువగా 81% ఉందని పీఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
