ఒడిశాలోని సంబల్పూర్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన జుయెల్ షేక్ అనే కార్మికుడిని దారుణంగా కొట్టి చంపారు. తనను, తన సహచరులను బంగ్లాదేశ్ “చొరబాటుదారులు”గా ఆరోపిస్తూ దుండగులు దాడికి దిగారు. ఈ సంఘటన మీద స్పందించిన పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్- బీజేపీ ద్వేషపూరిత రాజకీయాల వల్లనే ఈ ఉదంతం జరిగిందని పేర్కొన్నది.
న్యూఢిల్లీ: ఒడిశాలోని సంబల్పూర్లో డిసెంబర్ 24న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక కార్మికుడిని దారుణంగా కొట్టి చంపారు. వివిధ వార్తా కథనాల ప్రకారం, బాధితున్ని- తన సహచరులను “బంగ్లాదేశ్ చొరబాటుదారులు”అని దాడి చేసిన మూక ఆరోపించింది.
వార్తా కథనాల ప్రకారం, 30 ఏళ్ల జుయెల్ షేక్, తన ముగ్గురు సహచరులు టీ తాగుదామని ఒక టీ స్టాల్ వద్ద ఆగారు. అక్కడ “అక్రమ బంగ్లాదేశీయులు”గా వారిని భావించి, వారి గుర్తింపు కార్డును కొంతమంది అడిగారు. తమ చెల్లుబాటయ్యే పత్రాలను వారు చూపించినప్పటికీ, ఆ గుంపు జుయెల్ షేక్‌ను తీవ్రంగా కొట్టి చంపింది, తను మరణించాడు. మిగిలిన ముగ్గురు కార్మికులు ప్రాణాలతో తప్పించుకోగలిగారు.
ఇంతలో, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ) హిమాన్షు లాల్ మాట్లాడుతూ, ఈ కేసు ఒక నిర్దిష్ట లక్ష్యం కాదు, “ఆకస్మికంగా రెచ్చగొట్టడం” వల్ల జరిగిందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు.
షేక్‌ను పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ నివాసిగా వార్తాపత్రిక తెలియజేసింది. గురువారం మధ్యాహ్నం నాటికి ఈ హత్యతో సంబంధమున్న ఆరుగురిని అరెస్టు చేసినట్టుగా పోలీసులు తెలియజేశారు.
కార్మికుల ఐడీ కార్డులను చూపించాలని దాడి చేసిన వ్యక్తులు ఎందుకు డిమాండ్ చేశారనే దానిపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదని కూడా ఆ వార్తాపత్రిక కథనం తెలియజేసింది. స్థానిక మీడియా ప్రకారం, ఈ సంఘటనకు సంబంధించి “బీడీ దొంగతనం” ఆరోపణలు కూడా వెలువడ్డాయి.
అయితే ఈ సంఘటనకు బీజేపీ “బెంగాలీ భాషా వ్యతిరేక ప్రచారం” కారణమని పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. బెంగాలీ మాట్లాడే ప్రజలను “చొరబాటుదారులు”గా ముద్రవేసే బీజేపీ ద్వేషపూరిత ప్రసంగాల వల్లే ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయని పార్టీ పేర్కొన్నది.
“చాలా ఏళ్లుగా బెంగాలీ మాట్లాడే భారతీయులను చొరబాటుదారులు, బయటి వ్యక్తులు, అనుమానితులుగా బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ముద్ర వేస్తున్నారు. ఈ విషమిప్పుడు వీధుల్లోకి చేరుకుంది, దారిన వెళ్లేవారెవరైనా తమను తాము ఇమ్మిగ్రేషన్ అధికారి, ఉరిశిక్షకుడిగా భావిస్తున్నారు” అని పార్టీ పేర్కొన్నది.
గత వారం, కేరళలోని పాలక్కాడ్‌లో దొంగతనం అనుమానంతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాంనారాయణ్ బాఘేల్ అనే కార్మికుడిని కొట్టి చంపారు. అక్కడ కూడా దాడి చేసిన వ్యక్తులు “మీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చారా”అని అడిగారు. ఈ కేసుకు సంబంధించి కేరళ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
ఇటీవలి కాలంలో, “అక్రమ బంగ్లాదేశీయులు” అని అనుమానిత వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపే సంఘటనలు భారతదేశంలో పెరుగుతున్నాయి. సంబల్పూర్ ఘటన ఈ పెరుగుతున్న ఉద్రిక్తతలో భాగమని పలువురు సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
