
ఛత్తీస్‌ఘడ్‌లో పిల్లలు, ప్రజలు అనామకంగానే ఖననం చేయబడ్డారు. అప్పుడప్పుడు చెల్లించే పరిహారపు ఆదేశంతో ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదులను గుట్టుచప్పుడు కాకుండా మూసేశారు.
అంతేకాకుండా చాలామట్టుకు కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
పౌరులు, భద్రతా దళాలు, మావోయిస్టులు/నక్సలైట్లను కలుపుకొని 2024 నుంచి దాదాపు 589 మంది చనిపోయారు. ఇంకా మనం 2025 సగంలోనే ఉన్నాము. 2019 నుంచి 2023 వరకు ఉన్న ఐదు సంవత్సరాలలొ కంటే చాలా ఎక్కువ మంది(534 మంది) ఈ 18 నెలలో చనిపోయారు.
2024 జనవరి నుంచి ఎన్హెచ్ఆర్సీ ద్వారా నమోదైన ఫిర్యాదులను నేను జూన్- జూలైలో చదివాను. ఏడు జిల్లాలను కలుపుకొని బస్తర్ డివిజన్‌గా పిలుస్తారు.
అందులో బస్తర్, బీజాపూర్, దంతెవాడ, కంకేర్, కొండగావ్, నారాయనపూర్, సుక్మా ఉన్నాయి. వీటి మీద దృష్టి సారించి నేను ఫిర్యాదులను పరిశీలించాను.
ఈ వ్యాసం గత ఏడాదిన్నర మీద దృష్టి సారిస్తుంది. అంటే, 2024 ఇంకా 2025 మొదటి సగ భాగం మీద కేంద్రీకృతమవుతుంది.
ఆకస్మాత్తుగా పెరిగిన మరణాలకు సంబంధిన కాలంగా ఇది గుర్తించబడింది. చంపబడ్డవారితో రాజ్యానికి ఉన్న సంబంధాన్ని ఈ రికార్డులు తెలియజేస్తుంది.
అంతేకాకుండా మానవ హక్కుల రక్షణకు పెద్దపీట వేసే ఒక సంస్థ వైఫల్యాన్ని వెలుగులోకి తెస్తుంది.
మరణాల లెక్కింపు..
ఇప్పటి వరకు, మనకు ఈ ప్రజలు ఎక్కువగా “సంఖ్య” పరంగానే తెలుసు. దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్(SATP) వివరణాత్మకంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది:
♦ భారత దేశవ్యాప్తంగా: 1,095
♦ మావోయిస్టు తిరుగుబాటుకు సంబంధించి: 736
♦ కేవలం ఛత్తీస్‌ఘడ్: 589
♦ బస్తర్ డివిజన్(7 జిల్లాలు): అందుబాటులో లేవు
కేవలం ఛత్తీస్‌ఘఢ్‌లో నమోదైన శాతం దేశమొత్తంలొ పోల్చుకుంటే సుమారు 54% ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలంలో 80% మావోయిస్టు తిరుగుబాటుకు సంబంధించిన మరణాలు ఉంటాయి.
ఈ గణంకాలు కేవలం ప్రాథకమైనవే కానీ కలవరపెట్టే “ఎవరు చనిపోయారు?” అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.
ఈ మరణాలకు సంబంధించిన ఎన్హెచ్ఆర్సీలోని అధికారిక రికార్డులను నేను తిరిగేశాను. ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదులు అందరికి అదుబాటులో ఉన్నాయి. లేదా అందులో ఎంతో కొంత సమాచారమైన ఉంది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పలువురు సమర్పించిన ఫిర్యాదులకు సంబంధించినవి. పోలీసుల, వైద్య, పరిపాలన ప్రమేయానికి సంబంధించిన ప్రక్రియ నివేదికలను కొనసాగిస్తుంది.
“ఎన్కౌంటర్” మరణాలలో, ఫిర్యాదులను సాధారణంగా ఎస్పీ నమోదు చేస్తారు. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) సుప్రింకోర్టు పిటిషన్ అనుసరించి, ఎన్హెచ్ఆర్సీకు ఎన్కౌంటర్లకు సంబంధించిన సమాచారాన్ని 48 గంటలలో తెలియజేయాలి.
ఇంకా సంబంధిత అని డాకిమెంట్స్ను మూడు నెలల లోపు పంపించాలి.
ఎప్పుడైతే నేను బాధితుల పేర్లను తనిఖీ చేశానో, అసలు పేర్లకంటే నాకు “తెలియనివారు” అనే పదమే తారసపడింది.
అందులో “తెలియని(unknown) నక్సలైట్స్, తెలియని మావోయిస్టు లేదా తెలియని పురుషుడు, తెలియని స్త్రీ‘‘ అనే ఉంది.
చిరునామా “తెలియదు”
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కర్రెగుట్ట ఆపరేషన్ ఎక్కడ అయితే జరిగిందో బిజాపూర్ జిల్లా నుంచి కొన్ని ఫిర్యాదులు అందాయి. ఆ సమాచారం కింద ఇవ్వబడింది.
అస్పష్టమైన జోడింపులతో(ఎంట్రీ) మొదటి పేజీ ఫలితం నింపబడింది. “తెలియని” వ్యక్తులు, సంఖ్యా ప్లేస్హోల్డర్లు అనే పదాలు పునరావృతమైయ్యాయి.

ఆంగ్ల అక్షరదోషాలతో(moists, moaists, moiasts)పాటు ఎక్కువ తెలియని, సంఖ్యలు రెండవ కమ్మలో ఎక్కువగా తారసపడతాయి.
అందులో కొందరి మీద నక్సలైట్, మరికొందరి మీద మావోయిస్టులు అనే ముద్ర ఉంటుంది. నిబంధనలు మారాయి, కానీ అస్పష్టతతో కూడిన సారాంశం మాత్రం ఒకేలా ఉంటుంది.

జాబితాను తీక్షణంగా పరిశీలిస్తే స్పష్టమైన అసమానతలు, వైరుధ్యాలు ఎక్కువగా కనబడతాయి.
2024 మార్చి 28వ తేదీ నాటి ఓ ఫిర్యాదులో “నలుగురు పురుషులు, ఇద్దరు మహిళల ” నుంచి ” ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు”గా లింగ లెక్కింపులో మార్పులు చేర్పులు చేశారు. (చిత్రం 3)
2025 ఫిబ్రవరి నాటి మరో ఫిర్యాదులో 20 మంది పురుషులు, 11 మంది మహిళలందరిని పురుషులుగా నమోదు చేశారు. (చిత్రం 4)


ఇవి చిన్న తప్పులు కాదు, కానీ పునరావృత సూచికలు. ఇవి సాంకేతిక డేటా లోపాలు కాదు, మనుషులకు సంబంధించినవి. గుర్తింపును, లింగాన్ని సైతం వారు చెరిపేశారు.
పునరావృతమైన “లోపాల నమూనాలు” అనుమానస్పదంగా, అస్పష్టతను కావాలని చేసిన్నట్లుగా కనబడుతున్నాయి.
2024 జనవరి 1న జరిగిన ఎదురు దాడులలో చనిపోయిన ఒక ఆరేళ్ల పాపకు సంబంధించి రికార్డు ఉంది. రూ 7 లక్షల(చిత్రం 5) పరిహారంతో 2024 సెప్టెంబర్ 9న ఈ కేసును మూసివేశారు.
ఈ కేసుకు సంబంధించిన ఎక్కువ సమాచారాన్ని తెలియజేయలేదు. ఒకవేళ దీని మీద విచారణ చేశారా? లేదా సంబంధించిన బాధిత కుటుంబానికి పరిహారం చేరిందా లేదానెదీ అస్పష్టంగా ఉంది.

ఒక ఫిర్యాదులో 2024 మార్చి 20న జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేయబడింది. పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో గుర్తుతెలియని చాలామంది “ప్రజలు” మరణించారు.
అంతేకాకుండా దీనికి సంబంధించిన ఎటువంటి చర్యను ఇప్పటి వరకు ఎన్హెచ్ఆర్సీ తీసుకోలేదు.(చిత్రం 6)

వారి గుర్తింపులు ఎప్పుడు, ఎప్పుడైన తెరమీదకు వస్తాయా? ఈలోగా ఏం అయిపోతుంది? మరింత సమాచారం ఎన్హెచ్ఆర్సీలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది.
చాలా అరుదుగా వైబ్సైట్లో నవీకరిస్తారు. ప్రజలు కేవలం ఫిర్యాదులలోని కొంతభాగాన్ని మాత్రమే చూస్తారు.
తెలియని మరణంగా నమోదు చేసిన తర్వాత, అది వెబ్సైట్లో అలాగే ఉంటుంది. మృతదేహాన్ని గుర్తించలేదా లేదా దానిని క్లెయిమ్ చేయలేదా అనే ప్రశ్నలకు సమాధానం ఉండదు.
ఎన్హెచ్ఆర్సీ పోలీసులు, పరిపాలన నుంచి అవసరమైన బహుళ పత్రాలను జాబితా చేశారు. అయినప్పటికీ – వైద్య రికార్డులు, పోలీసు నివేదికలు, పోస్ట్‌మార్టం ఫలితాలు వంటివి – ఇవన్నీ, తయారు చేయబడినప్పుడు కూడా, ఈ ఫిర్యాదుల వెనుక ఉన్న గుర్తింపులను, మనిషి ప్రాణాన్ని చాలా సులభంగా మరచిపోయే వ్యవస్థ గుండా వెళ్తాయి. (చిత్రం 7)

ఇది ఎందుకు ప్రాముఖ్యమైనది?
ఎన్హెచ్ఆర్సీ డేటాబేస్‌లో నమోదు చేయబడిన ఈ తెలియని వ్యక్తులు, మరణించినవారు, విభిన్న సంఖ్యలతో గుర్తించిన ప్రతీ ఒక్కరని వారి కుటుంబ సభ్యులు గుర్తించకుండానే వదిలేశారు .
అవసరమైన సరైన పత్రాలను అందజేయాలని గత ఏడాదిన్నర నుంచి ఎన్హెచ్ఆర్సీ నిరంతరాయంగా ఫిర్యాదుల ప్రక్రియను కొనసాగిస్తూ, రిమెండర్స్ను పోలీసులకు, పరిపాలనకు పంపిస్తునే ఉంది. ఎన్కౌంటర్లో ఎవరైతే చనిపోయారో వారు పౌరులని స్థానిక గ్రామస్తులు ఆరోపించారు. 2024 మే 12 నాటి ఒక సంఘటనలో మావోయిస్టులుగా చెప్పబడుతున్న వారు పౌరులేనని 12లో 10 మంది గ్రామస్తులు తెలియజేశారు.
దేశ అత్యున్నతమైన మానహక్కుల సంస్థగా ఎన్హెచ్ఆర్సీ పరిగణించబడుతుంది. ఈ సంస్థ యునైటెడ్ నేషన్స్(యూఎన్) సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పడింది. కానీ ఈ విషయంలో ప్రస్తుతం నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది. ఒకే సంఘటనలో పెద్ద ఎత్తున సంభవించిన మరణాలపై స్వయం ప్రతిపత్తితో నిజనిర్ధారణ లేదా విచారణ అవసరం లేదని భావించింది.
2002లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 19 ఎన్కౌంటర్లలో 16 బూటకమైనవని 2012లో ఎన్హెచ్ఆర్సీ నిర్ధారించింది. ప్రతి ఒక్క బాధితుడికి రూ 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదేశింది. ఒక దశాబ్దకాలపు అన్యాయం, ఒక మనిషి ప్రాణం విలువ రూ 5 లక్షలు.
ఛత్తీస్‌ఘఢ్‌లో అనామకంగానే ప్రజలు, పిల్లలను ఖననం చేశారు. నామమాత్రపు పరిహారపు ఆదేశంతో ఫిర్యాదులను గుట్టుచప్పుడు కాకుండా మూసివేశారు. అంతేకాకుండా, దాదాపు చాలా కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
గత 18 నెల కాలంలో బిజాపూర్ నుంచి నమోదైన సుమారు 40 ఫిర్యాదులను నేను సమీక్షించాను.
ఇవన్నీ సంబంధిత పోలీసు ఎన్కౌంటర్, దాడులు లేదా పేలుడు విస్ఫోటకాల(ఐఈడీ) వల్ల జరిగిన మరణాలు. వీటిలో, రెండు సందర్భాలలోనే ఎన్హెచ్ఆర్సీ పరిహారపు ఉత్తర్వులను జారీ చేసినట్టుగా గుర్తించాను.
ఏదిఏమైనప్పటికీ, బాధిత కుటుంబాలు పరిహారాన్ని అందుకున్నాయో లేదో అనేది అస్పష్టం. వెబ్సైట్లో దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేదు.
అంతేకాకుండా బాధితులకు పరిహారం అందజేయబడిందని ఎన్హెచ్ఆర్సీ ధృవీకరించిన ఎటువంటి సంకేతాలు లేవు.
బాధితులకు పరిహారం అందకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలా జరిగిన దాఖలాలు ఉన్నాయి.
ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు ఉన్నప్పటికీ, గ్రామస్తులు పరిహారం పొందని సందర్భాలను కూడా మనం చూశాము. ఉదాహరణకు, 2009లో సాల్వా జుడుం మృతులకు సంబంధించిన బంధువులు 2019 జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యమైన రెండు నెలల వరకు కూడా పరిహారాన్ని పొందలేదు.
ఎప్పుడైతే ఉత్తర్వు జారీచేయబడిందో, పరిహారం విషయంలో ప్రజలు ఆసక్తిని కోల్పోయారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు సంబంధిత నేరస్థులను శిక్షించకపోవడంతో పరిహారాన్ని తీసుకోకుండా తిరస్కరించారు.
2016లో ఓ కేసులో భాగంగా లాయర్లను బూటకపు అరెస్టులకు సంబంధించి తెలంగాణ నుంచి ఎవరైతే ఆరునెలలు జైలులో ఉన్నారో, ఆ ప్రతీ ఒక్కరికి లక్ష చొప్పున పరిహారం అందించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ఒకరుగా ఉన్నటువంటి లాయరు తనకు పరిహారం అందలేదని నిర్ధారించారు.
2015 అక్టోబర్‌లో వరుసగా బిజాపూర్‌లో కొన్ని ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఈ ఉదంతాలు ఏవైతే ఉన్నాయో ఆదివాసీ మహిళల విషయంలో ఏవైతే మానభంగాలు, సామూహిక మానభంగాలు, అత్యాచారాలలో భాగస్వాములుగా ఉన్నటువంటి పోలీసులు, భద్రతా బలగాలు ఐదు గ్రామాలలో చేసిన అరాచకత్వానికి సంబంధించి 2019లో ఎన్హెచ్ఆర్సీ పరిహారపు ఉత్తర్వులను జారీ చేసింది.
2020 ఫిబ్రవరిలో చివరి ఆదేశంలో కోర్టు వెల్లడిచింది కదా, నేరస్థులు శిక్షించబడకపోవడం వల్ల మహిళలు పరిహారం తీసుకోవడాన్ని తిరస్కరించినట్టుగా సూచించింది. ఆ తర్వాత ఎన్హెచ్ఆర్సీ కలెక్టర్‌కు ఈ విషయంలో మార్గనిర్దేశం చేసింది. బాధితుల ఖాతాల పేరు మీద డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందిగా తెలియజేసింది. ఒకవేళ రెండు సంవత్సరాలలో ఈ ప్రక్రియ జరగకపోతే, “సామాజిక అవసరాల”కు ఉపయోగించాల్సిందిగా కలెక్టర్‌కు నిర్దేశించింది.
అదే సమయంలో, నేర విచారణ ఇంకా కొనసాగుతుందని, నివేదిక నాలుగు వారాలలో అందజేయడం జరుగుతుందని ఆదేశంలో పేర్కొనబడింది. కానీ చివరికి కేసు మూసివేయబడింది. బాధితులకు న్యాయం జరిందనే దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. లేదా ఒకవేళ విచారణ ముగిసిందా లేదా అనే విషయాలు తెలియదు.(చిత్రం 8)

“తెలియని” అనేది దేనికి ఉపయోగపడుతుంది?
ప్రజలకు అసంపూర్ణ సమాచారన్ని, సంఖ్యలను వదిలేశారు. అంతేకాకుండా చాలా అరుదుగా ఇచ్చినప్పుడు కేవలం నగదు పరిహారం అందించబడుతుంది. ఇది క్లరికల్ తప్పుకాదు. మాయమైన దాని వెనుక కానీ మరిచిపోవడం వెనుక కానీ రాజకీయ చర్య దాగి ఉంది.
అధికారాన్ని జవాబుదారీగా ఉంచడానికి ఎన్హెచ్ఆర్సీ సృష్టించబడింది. కానీ పరిశీలిస్తే, అది రాజ్యానికి లేఖకుడిగా మారిందని తెలుస్తోంది, నిజమే లేకుండా హింసను నమోదు చేస్తుంది. అంతేకాకుండా, “తెలియనిది” అనే పదాన్ని దుర్వినియోగం చేస్తుంది.
హక్కులను రక్షించడానికి ఉద్దేశించిన సంస్థ వాటిని తొలగించడంలో భాగస్వామిగా మారినప్పుడు ఏం జరుగుతుంది? పేర్లు లేనప్పుడు న్యాయం ఎలా చేకూరుతుంది?
పేర్లు ముఖ్యమైనవి: జ్ఞాపకశక్తి, జవాబుదారీతనం, న్యాయం కోసం..
మానవ హక్కుల ఉల్లంఘన కేసులను ఎన్హెచ్ఆర్సీ ఎలా నిర్వహిస్తుందో అనే విషయాన్ని సంస్కరించాలి. చనిపోయిన వారిని సంఖ్యలు లేదా ట్యాగ్‌లుగా కాకుండా వ్యక్తులుగా గుర్తించాలి. కొత్త సమాచారం వచ్చినప్పుడు అది రికార్డులను నవీకరించాలి. పరిహారం ఆదేశిస్తే, అది కుటుంబాలకు లేదా బాధితులకు చేరుకుంటుందని ధృవీకరించాలి.
కానీ పరిహారం మాత్రమే న్యాయాన్ని చేకూర్చదు. దర్యాప్తులు పారదర్శకంగా, పూర్తిగా నిర్వహించాలి. వాస్తవాలలో వైరుధ్యాలను ప్రశ్నించాలి. పరిస్థితి డిమాండ్ చేసినప్పుడు, అది స్వతంత్ర విచారణలను ప్రారంభించడానికి దాని అధికారాలను ఉపయోగించాలి.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
(వ్యాస రచయిత సౌమ్య లాంబా ఒక స్వతంత్ర పరిశోధకురాలు.)
గమనిక: ఈ వ్యాసంలో ఉదహరించబడిన సంఖ్యలను ఎస్ఏటీపీ 2025 జూలై 27న నవీకరించింది. 2025 జూలై 29న యాక్సెస్ చేసింది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.