
తాజా నివేదిక ప్రకారం, నిత్య అవసర వస్తువుల ధరల పెరుగుదల 84 శాతం మంది ప్రజల ఆహారభద్రతను తీవ్రప్రమాదంలోకి నెడుతోంది.
న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ఎంపికలో వినియోగదారుల ఆలోచన ఎలా ఉంటుందని పీడబ్ల్యూసీ(ప్రైస్, వాటర్, కూపర్) తన తాజా నివేదికలో తెలియజేసింది. అంతేకాకుండా వినియోగదారుని అభిరుచులు, ప్రవర్తనను ఎప్పటికప్పుడు జీవనవ్యయం మారుస్తూ ఉంటుంది.
‘పీడబ్ల్యూసీ వాయిస్ ఆఫ్ ది కన్స్యూమర్ 2025: ఇండియా పర్స్పెక్టివ్’ నివేదక ప్రకారం, దాదాపు 40 శాతం మంది వినియోగదారులు తమకు పూట గడవడానికి కష్టంగా ఉందని పేర్కొన్నారు. మరో “32% మంది తాము ‘ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్టు’గా, 7% మంది ఆర్థిక అభద్రతను ఎదుర్కొంటూ నిత్యవసర బిల్లులను చెల్లించడానికి కూడా సంఘర్షించాల్సి వస్తుంద”ని చెప్పారు.
జీవనవ్యయం(ఉదాహరణ: రోజువారి వస్తువుల ధరలు, బిల్లులు) విషయంపై జరిపిన సర్వేలో 57శాతం ప్రజలు ఆందోళనను వ్యక్తం చేశారు. సర్వేలో అడిగిన దానికి సమాధానమిస్తూ– నిత్యవసర వస్తువులపై అధిక ధరలు ఇలానే కొనసాగితే, రానున్న 12 నెలలో దాని ప్రభావం దేశంపై భారీగా పడుతుందని వినియోగదారులు విశ్వసించారు.
గత ఏడాది, వాతావరణ మార్పు ఆహారంపై ప్రభావాన్ని చూపించడంతో వినియోగదారులు ఎక్కువ ఆవేదనకు గురైయ్యారు. ప్రస్తుత కాలంలో జీవనవ్యయం వినియోగదారులకు తీవ్ర సమస్యగా ఉద్భవిస్తోంది.
ధరలు బాగా పెరిగిన కారణంగా “డబ్బు ఆదా ప్రవర్తన ”ను వినియోగదారులు అలవర్చుకుంటున్నారు. అంతేకాకుండా ఆహారపు అలవాట్లను మార్చకుంటున్నారు. ధరల పెరుగుదల ఫలితంగా ప్రజలు చౌకగా దొరికే ఆహార పదార్థాలు దొరికే దుకాణాలను వెతుకుతున్నారు.

2025 జనవరి- ఫిబ్రవరిలో గ్లోబల్ సర్వే జరిగింది. ఈ సర్వేలో 28 దేశాలు- భూభాగాలలో 21,075 మంది వినియోగదారులు స్పందించారు. భారతదేశం నుంచి 1,031 మంది సర్వేలో పాల్గొన్నారు. “వినియోగదారు తీసుకునే ఆహారం– ధోరణులు, కిరాణ షాపింగ్‌తో పాటు ఆహార పదార్థాల ఎంపిక, ఆరోగ్య భవిష్యత్తు, అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ, వాతావరణ– సుస్థిర సమస్యలు” అనే అంశం మీద 2025 మేలో పరిశ్రమ అధికారులు కూడా ఒక సర్వేను నిర్వహించారు.
రిటైల్ & కన్స్యూమర్ మార్కెట్ లీడ్(డైరెక్టర్), పీడబ్ల్యూసీ ఇండియా సభ్యులు హితాంశు గాంధీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు. “ప్రస్తుతం ఎక్కువగా పెరిగిన జీవనవ్యయం వల్ల నాలుగు సంవత్సరాల క్రితమున్న డబ్బు పొదుపుశాతం తగ్గిపోయింది. అప్పులు బాగా పెరిగిపోయాయ”ని తెలియజేశారు. నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వ్యాపారవేత్తల వర్గం వారిగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) గమనిస్తే, “పెద్ద ఎత్తున ఋణాలను తీసుకోవడం వల్ల గృహవసరాలపై ఒత్తిడి పెరుగుతంది” అని గాంధీ అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025- 26 మొదటి నాలుగు మాసాలలో మొత్తం యూపీఏ చెల్లింపులో నుంచి 3.5 లక్షల కోట్లు(సుమారు 13శాతం) చెల్లింపులు కేవలం “ఋణాలు వసూలు చేసే ఏజెన్సీల”కే చెల్లించారు.
ఆహారం కంటే భద్రతపై కూడా భారతీయ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. భద్రత విషయంలో 84% మంది తీవ్రంగా చింతిస్తున్నారు.

పౌష్టిక ఆహారం పట్ల వినియోగదారుల ఇష్టాలు, వాతావరణం, ఆహారభద్రతవంటి విషయాలపై కూడా వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక తెలియజేసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.