
భారతదేశంలో వారసత్వ రాజకీయాల తీరుతెన్నుల మీద అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ విశ్లేషించి ఒక నివేదికను విడుదల చేసింది. అందులో దేశ రాజకీయ ముఖచిత్రానికి సంబంధించిన కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారత దేశంలో దాదాపు 21% ప్రజాప్రతినిధులు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారున్నారు. అత్యధికంగా తరతరాలుగా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ఏడీఆర్ తన విశ్లేషణ నివేదికలో పొందుపరిచింది. వీరు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్కు చెందినవారని పేర్కొన్నది.
నివేదక ప్రకారం ప్రతి ఐదుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ఒక్కరు ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు లేదా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. వీరందరూ కొన్ని తరాల నుంచి రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు.
“లోక్సభలో ప్రస్తుతం 31% ప్రజాప్రతినిధులు వారసత్వ రాజకీయాలు లేదా రాజకీయకుటుంబాలకు చెందినవారే. రాష్ట్ర శాసనసభల్లో అలాంటివారు 20% మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని శాసనసభలు, శాసనమండలాలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులను కల్పితే మొత్తం 5,204 మంది సభ్యులుండగా వారిలోంచి 1,107 మంది వారసత్వ రాజకీయాల నాయకులేన”ని ఏడీఆర్ విశ్లేషణ ద్వారా తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితి..
“అత్యధికంగా 23శాతంగా ఉండి ఉత్తర భారతదేశ వారసత్వ రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 18శాతంతో రాజస్తాన్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది” అని నివేదికలో వెల్లడించింది.
34% మంది ప్రజాప్రతినిధులు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారు ఉండడంతో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కాగా కర్నాటకలో 29% మంది వారసత్వ రాజకీయ ప్రతినిధులో రెండవ స్థానంలో ఉంది.
ఈశాన్య- వాయువ్య భారతాన్ని పరిశీలిస్తే బీహార్లో 27% ఉండగా, అస్సాంలో 9% వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 604 మంది ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉండగా వారిలో 141 మంది అంటే- 23% ప్రజాప్రతినిధులు వారసత్వ రాజకీయ నాయకులుగా ఉన్నారు.
అలానే మహారాష్ట్రలో ప్రస్తుతం 403 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండగా వారిలో నుంచి 129 మంది అంటే- 32% వారసత్వ రాజకీయాలలో చలామణి అవుతున్నారు. బీహార్లో 360 మంది ప్రజాప్రతినిధులలో 96 మంది వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్నట్టుగా ఏడీఆర్ విశ్లేషణ పేర్కొన్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.