తెలంగాణలో ఈ నెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన గెటుపుబాటను కొనసాగిస్తుంది. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఈ ఎన్నికల్లో అత్యధిక పురపాలక సంఘాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. దాదాపు 81 శాసనసభ నియోజికవర్గాల పరిధిలో ఎన్నికలు జరిగితే 68 నియోజికవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అనుకున్నంతగా ఈ ఎన్నికల్లో తన సత్తా చూపలేకపోయింది, బిజెపి మాత్రం ఆ పార్టీకి ఇద్దరు ఎంపిలున్న కరీంనగర్, నిజామాబాద్లో కొంత వరకు తన పట్టును నిలబెట్టుకుంది తప్పా మిగితా అనేక చోట్ల ఆ పార్టీ స్థానాల గెలుపు విషయంలో మూడవ స్థానికి పరిమితమైంది. ముస్లీం ఓటర్లు ఎక్కవగా ఉన్న చోట అక్కడక్కడ మజ్లిస్ అభ్యర్ధులు కూడా గెలిచిన వారిలో ఉన్నారు.
ఎవరెన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నరో సంఖ్యాపరంగా ఇంకా స్పష్టత రావల్సి ఉండగా బిజెపి మాత్రం అక్కడక్కడ క్యాంపు రాజకీయాలను మొదలు పెట్టింది, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో గెలిచిన తమ వార్డు సభ్యులను తీసుకెళ్లి క్యాంపును ఏర్పటు చేసింది.
కాంగ్రెస్ విషయానికి వస్తే డిసెంబర్ 2023లో అధికారం చేపట్టన తర్వాత జరిగిన ఈ మూడవ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని హ్యట్రిక్ విజయాన్ని సాధించింది. శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలు, డిసెంబర్లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచకుంది. ఏడు కార్పొరేషన్లలో 414 వార్డులకు, 116 మున్సిపాలిటీలలో 2582 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
గంట రాజు,సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
