
“ఒకప్పుడు” దేశంలోని పేదవారికి పాఠశాలలు- ఆసుపత్రులు చౌకగా అందుబాటులో ఉండేవని భగవత్ అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదని పేర్కొన్నారు.(ప్రస్తుత ప్రధాన మంత్రి దయచేసి గమనించచ్చు)
ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని మితవాదులు రాజ్యాంగ పీఠికలోని సోషలిజం పదాన్ని తొలగించాలని గతకొన్ని సంవత్సరాలుగా వాదిస్తున్నారు.
ఉత్పత్తి శక్తుల ప్రైవేటు యాజమాన్యంతో ఈ శక్తులు అనుసంధానమై ఉన్నాయి. ఉత్పత్తి- పంపిణి వ్యవస్థలపై ప్రభుత్వ నియంత్రణ కోరుతున్న శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. ఇది చారిత్రక రహస్యమేమీ కాదు.
మితవాదుల సైద్ధాంతిక అవగాహనలు అందరికి తెలిసిన విషయమే. దేశ తొలి ప్రధాన మంత్రి జవహార్‌లాల్ నెహ్రూ ఆర్ధిక ప్రగతి, పంపిణీ విషయంలో సోషలిస్టు పద్ధతిని ప్రవేశపెట్టడంపై వారి అధికార ప్రతినిధులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ నిర్ణయం వల్ల భారతదేశం వెనకడుగు వేయాల్సివచ్చిందని వాదిస్తుంటారు. జంతు ప్రవర్తనను స్పూర్తిగా తీసుకొని ప్రైవేటు కార్పొరేట్లు తమ ఖజానాను నింపుకునే గొప్ప అవకాశాన్ని ఉపమోగించుకోవడానికి ఈ పద్దతి అవరోధంగా మారిందని అంటారు.
సామాన్య ప్రజలకు చౌకగా అందుబాటులో ఉన్న ఇండోర్‌లోని ఒక క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడారు. విద్యా- వైద్యాన్ని “సేవలు”గా పరిగణిస్తూ, “వాణిజ్యపరం కాని” కార్యకలాపాలుగా ఉన్నటువంటి కాలం గడిచిపోవడంపై ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
ఒక మంత్రితో జరిపిన చర్చను మాటల మధ్య ఉదహరిస్తూ, విద్య ఏవిధంగా ట్రిలియన్ డాలర్ వ్యాపారంగా మారిందో తెలియజేశానని భగవత్ గుర్తు చేశారు.
ఒకప్పుడు దేశంలోని పేదలకు పాఠశాలలు, ఆసుపత్రులు చౌకగా అందుబాటులో ఉండేవని భగవత్ అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదని ఆయన వాపోయారు.
ఎలా “కార్పొరేట్ కేంద్రీకరణ” విద్యా, ఆరోగ్య రంగాలను ప్రభావం చేస్తుందో భగవత్ తెలియజేశారు. అంతేకాకుండా దీని వల్ల ఈ రంగాలు, పేదలకు అందుబాటులో లేకుండా పోయాయని పేర్కొన్నారు.
కేవలం విద్యావంతులు, ఆరోగ్యవంతమై శరీరాలు గల వారే తమ యావత్తు శక్తినీ జాతి ప్రగతి, సంక్షేమానికి విరాళంగా ఇస్తారని ఎలా భావిస్తామని భగవత్ నొక్కి చెప్పారు.
మితవాదానికి నాయకత్వం వహిస్తున్న ఆర్ఎస్ఎస్ మానసిక ఆలోచన విధానంలో మార్పు వస్తుందని ఇంత తొందరగా నిర్దారించలేము.
నాయకత్వ సంఘర్షణ..
బూర్జూవ శక్తుల పట్ల తమ అంకితభావాన్ని యధాతధంగా వాటి వలన ఇబ్బందిపడుతున్న చిన్న మధ్యతరహా పెట్టుబడిదారీ తరఫున నిలబడే సంఘ్ పరివారం ప్రయత్నాన్ని గమనించాలి.
ఇలాంటి అసంతృప్తి శక్తులకు మితవాదుల ప్రతీకార సంస్కృతి ప్రాజెక్టుకు అత్యంత ముఖ్యమైన తరగతి అని చరిత్ర నేర్పుతుంది. ఆర్థికం అనేది పెత్తందార్ల ఆధిపత్యంలో ఇటువంటి సబ్ ఆల్ట్రాన్ తరగతులు వీధుల పాలైతే తమ సాంస్కృతిక ప్రాజెక్టు పూర్తిగా సంక్షోభంలో పడిపోతుంది అని ఆయన హెచ్చరిస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి మాత్రం భగవత్ మాటలు స్వాతంత్ర్యానంతరం నెహ్రూ ప్రారంభించిన నవ భారత నిర్మాణం ప్రాజెక్ట్ సరైనదే అన్న అంచనాకు వచ్చినట్టు కనిపిస్తోంది.
అనేక మంది వామపక్షవాదులు నెహ్రూ విజన్‌ను ఎలా నమ్ముతున్నారంటే, ఆయన పూర్తి స్థాయి సోషలిజం కాకుండా కేవల సోషలిస్టు ఆధారిత సమాజం వైపు మొగ్గు చూపారని, దాని వల్ల సైద్ధాంతిక వ్యతిరేకతను కాపాడుకుంటూనే దేశ ఐక్యతకు పాటుపడ్డారనీ విశ్వసిస్తున్నారు.
కాషాయ క్యాంపులో జరుగుతున్న అంతర్గత అధికార కుమ్ములాటలను భగవత్ మాటలు సూచిస్తున్నాయి.
సెప్టెంబర్ 17న డైబ్భై ఏడు సంవత్సరాల వయసును పూర్తి చేసుకుంటున్న కారణంగా పదవి నుంచి తప్పుకోవాలని మోడీపై ఒత్తిడి పెంచాలని, సెప్టెంబర్ 11 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మోహన్ భగవత్ తన తర్వాత హోంమంత్రి అమిత్‌షాను తన వారసుడిగా చూడాలని కోరుకుంటున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ ఆలోచనలో ఇతర అభ్యర్థులు ఉన్నారు.
విద్యా- ఆరోగ్య రంగాలపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భగవత్ పరోక్షంగా విమర్శించడాన్ని చూస్తే, నాయకత్వ సంఘర్షణ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
ఢిల్లీ యూనివర్సిటీలో వ్యాస రచయిత బద్రీ రైనా అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.
ఈ వ్యాసం మొదట ఇండియా కేబుల్‌లో ప్రచురితమైంది. ది వైర్& గెలిలీయో ఐడియాస్ నవీకరించి ఇక్కడ ప్రచురించాయి. ఇండియా కేబుల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అనువాదం: జీ రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.