వికసిత్ భారత్-రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్(గ్రామీణ) బిల్లుకు హామీ.
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నుంచి మహాత్మా గాంధీని తొలగించనున్న మోడీ ప్రభుత్వం, ప్రతిపాదిత బిల్లును ‘వీబీ-జీ ఆర్ఏఎం జీ’ అని పిలుస్తారు.
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ ఉపాధి పథకమైన యూపీఏ హయాంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చుతున్నారనే ఊహాగానాలు వెలువడిన కొన్ని రోజుల తర్వాత, నరేంద్ర మోడీ ప్రభుత్వం దానిని వికసిత్ భారత్ – రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్(గ్రామీణ) బిల్లుగా పేరు మార్చనుందని తేలింది.
ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే, అది వీబీ- జీ ఆర్ఏఎం జీ యాక్ట్ అనే సంక్షిప్త పేరుతో చట్టంగా మారుతుంది.
ఊహాగానాల నేపథ్యంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ యోజన లేదా పీబీజీఆర్జీవైగా మారుస్తారని ది వైర్ నివేదించింది. ఒకవేళ ఇలా మార్చితే మహాత్మా గాంధీని ‘బాపు’అని కూడా పిలుస్తారు కాబట్టి, అసలు పేరులో నివాళి పాక్షికంగా అలాగే ఉండేది.
తిరిగి ప్యాక్ చేయబడిన ప్రతిపాదిత బిల్లు ‘మహాత్మా గాంధీ’ని పూర్తిగా తొలగిస్తుందని తేలింది.
పని దినాలు
“వికసిత్ భారత్ @2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని అందించడం ద్వారా, నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేపట్టడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వయోజన సభ్యులందరికీ గ్రామీణాభివృద్ధి చట్రాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు” ప్రభుత్వ ప్రతిపాదన పేర్కొన్నది. దేశంలోని చాలా ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఆధారంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ హామీ పనులు వంద రోజులు కొనసాగేవి.
కేంద్ర-రాష్ట్ర విభజన
ఈ పథకాన్ని “కేంద్ర ప్రాయోజిత పథకం”గా అమలు చేస్తుందని, దీని కింద ఆర్థిక బాధ్యతను కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని సెక్షన్ 22లోని సబ్ సెక్షన్(2) కింద అందించిన నిధుల భాగస్వామ్య నమూనా ప్రకారం పంచుకుంటాయని; ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటాను పెంచడం- దానికి కేటాయించిన వాటా కంటే ఎక్కువగా జరిగే ఏదైనా ఖర్చును భరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని ప్రతిపాదిత బిల్లు పేర్కొన్నది.
రాష్ట్ర ఖజానాపై ఇప్పటికే మోయలేని భారం ఉన్న సమయంలో ఏదైనా కేంద్ర ప్రాయోజిత పథకంలా రాష్ట్రాల వాటా 40%కి పెరుగుతుంది.
గతంలో కేంద్ర- రాష్ట్ర విభజన 90:10గా ఉండేది. ఈ విభజన ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది.
చెల్లింపులు
ప్రతిపాదిత బిల్లు ప్రకారం, రోజువారీ వేతనాల పంపిణీ వారానికోసారి లేదా “ఏ సందర్భంలోనైనా ఆ పని చేసిన తేదీ, పక్షం రోజుల తర్వాత” అందించబడుతుంది.
వేతనాలు
ఆసక్తికరంగా, “ఈ చట్టంలో లేదా దాని కింద రూపొందించిన నియమాలలో ఏమైనా ఉన్నప్పటికీ, వ్యవసాయ పీక్ సీజన్లలో వ్యవసాయ కార్మికుల తగినంత లభ్యతను సులభతరం చేయడానికి, సబ్-సెక్షన్(2) కింద తెలియజేయబడిన పీక్ సీజన్లలో ఈ చట్టం కింద ఎటువంటి పనిని ప్రారంభించకూడదు లేదా అమలు చేయకూడదు. ఒక ఆర్థిక సంవత్సరంలో అరవై రోజుల వరకు గరిష్ట వ్యవసాయ సీజన్లలో విత్తనాలు, కోతలను కవర్ చేస్తూ ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలి, ఈ చట్టం కింద పనులు చేపట్టకూడదు” ప్రతిపాదిత బిల్లు స్పష్టం చేసింది.
వ్యవసాయ కార్మికులు తమ శ్రమను పొందడంలో పోటీలో పాల్గొనే అవకాశం ఉన్నందున, వ్యవసాయ కార్మికులు ఉత్తమ పోల్చదగిన రేట్లు పొందగలిగే సీజన్లలో వేతనాలను తక్కువగా ఉంచడంలో ఇది ప్రభుత్వానికి సహాయపడుతుంది.
నిధుల నిలిపివేత
అతి ముఖ్యంగా, ప్రతిపాదిత బిల్లులో, “ఏదైనా పథకానికి సంబంధించి ఈ చట్టం కింద మంజూరు చేయబడిన నిధుల ఏదైనా సమస్య లేదా దుర్వినియోగం గురించి ఏదైనా ఫిర్యాదు అందిన తర్వాత– ప్రాథమికంగా కేసు ఉందని నిర్ధారించబడితే; కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏదైనా ఏజెన్సీ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపవచ్చు. అవసరమైతే, పథకానికి నిధుల విడుదలను నిలిపివేయాలని ఆదేశించవచ్చు. సహేతుకమైన వ్యవధిలో దాని సరైన అమలు కోసం తగిన పరిష్కార చర్యలను ఏర్పాటు చేయవచ్చు” అని కూడా పేర్కొన్నది.
దీని వల్ల రాజకీయ ఉద్యమాలకు ఈ పథకం కేంద్ర బిందువయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో చూసినట్టుగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం టీఎంసీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం కింద చెల్లింపులను స్తంభింపజేసింది.
కేటాయింపులు
మరో వివాదాస్పద నిబంధన ఏమిటంటే, “కేంద్ర ప్రభుత్వం సూచించిన లక్ష్య పారామితుల ఆధారంగా, ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా నియమావళి కేటాయింపును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.”
ముఖ్యంగా బహుమితీయ పేదరిక సూచికను ‘పరామితి’గా నిర్ణయించినట్లయితే– ఇది కేరళ, తమిళనాడు వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఎక్స్‌లోని రోడ్ స్కాలర్జ్ ఖాతా ఎత్తి నొక్కిచెప్పినట్టుగా, “మరొక విధంగా అందించినట్లయితే తప్ప, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన విధంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో, నైపుణ్యం లేని మాన్యువల్ పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వయోజన సభ్యుల ప్రతి ఇంటికి, ఈ చట్టం కింద రూపొందించిన పథకం ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం నూట ఇరవై ఐదు రోజుల హామీతో కూడిన ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం అందించాలి”అని బిల్లులోని ఆర్టికల్ 5(1) తెలియజేసింది.
“సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ బిల్లు పని చేసే చట్టపరమైన హక్కును కేంద్ర ప్రభుత్వం అందించే ఒక గుర్తుగా తగ్గిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలను కలిగి ఉంటుంది కానీ, దేనికీ జవాబుదారీగా ఉండదు. దీనిని పూర్తిగా వ్యతిరేకించాలి!” అని వ్యాఖ్యానం చెబుతోంది.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఈ ప్రతిపాదిత చట్టాన్ని “సంస్కరణతో కాకుండా, దొంగతనంగా ఖర్చును మార్చడం” అని అభివర్ణించారు .
ఎక్స్ వేదికగా ఎంపీ జాన్ బ్రిట్టాస్ పోస్ట్
ఎంజీఎన్ఆర్ఈజీఏ డిమాండ్ ఆధారితమైనది: ఒక కార్మికుడు పనిని ఆశిస్తే, కేంద్రం చెల్లించాల్సి వచ్చింది– జీ ఆర్ఏఎం జీ దీనిని కేంద్రం ముందుగా నిర్ణయించిన నియమావళి కేటాయింపులు– పరిమితులతో భర్తీ చేస్తుంది. నిధులయిపోతే– హక్కులు అయిపోతాయి. చట్టబద్ధమైన ఉపాధి హామీ రాష్ట్రాల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించబడే ప్రచార పథకానికి తగ్గించబడుతుంది.
పంచాయతీలను పక్కన పెట్టారు, డాష్‌బోర్డ్‌లను సాధికారపరిచారు- స్థానిక అవసరాల ఆధారంగా పనులను ప్లాన్ చేయడానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ గ్రామసభలు & పంచాయతీలను విశ్వసించింది- జీ ఆర్ఏఎం జీ జీఐఎస్ సాధనాలు, పీఎం గతి శక్తి తెరలు & కేంద్ర డిజిటల్ స్టాక్లను తప్పనిసరి చేస్తుంది. స్థానిక ప్రాధాన్యతలు వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా ఫిల్టర్ చేయబడతాయి. ఇది బయోమెట్రిక్స్, జియో-ట్యాగింగ్, డాష్‌బోర్డ్‌లు & ఏఐ ఆడిట్లను చట్టబద్ధం చేస్తుంది. లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు, సాంకేతిక వైఫల్యాలు అంటే అప్పీల్ లేకుండా బహిష్కరిస్తుంది.
కేంద్రీకృత టెంప్లేట్ల ద్వారా వికేంద్రీకరణ స్థానంలో; ప్రజలు డేటా పాయింట్లుగా మారతారు.
ఇంకా దారుణంగా, వ్యవసాయ కాలాల పేరుతో ప్రతి సంవత్సరం 60 రోజుల వరకు పనిని నిలిపివేయాలని జీ ఆర్ఏఎం జీ ఆదేశించింది. అసలు ఇది ఉపాధి హామీనా లేకా కార్మిక నియంత్రణనా? “పని చేయవద్దు. సంపాదించవద్దు. వేచి ఉండండి. ప్రైవేట్ పొలాల్లోకి శ్రమను నెట్టడానికి ప్రజా పనులను ఆపడం సంక్షేమం కాదు” అని కార్మికులకు చట్టబద్ధంగా పథకం దిశానిర్దేశం చేస్తుంది. ఇది రాష్ట్ర నిర్వహణ కార్మిక సరఫరా, కార్మికుల వేతనాలు, ఎంపిక, గౌరవాన్ని తొలగించడమవుతుంది.
జీ ఆర్ఏఎం జీ అంటే రాష్ట్ర నిధులు– షరతులతో కూడిన హక్కులను కేంద్రం నియంత్రిస్తుంది. కార్మికులు వాళ్లే కానీ తక్కువ హక్కులు ఎక్కువ భారం ఉంటుంది. ఈ బిల్లు ఎంజీఎన్ఆర్ఈజీఏని సంస్కరించదు- ఇది ఆర్థికంగా, సంస్థాగతంగా ఇంకా నైతికంగా విచ్ఛిన్నం చేస్తుంది.
ఆర్ఏఎం పేరుతో, రాష్ట్రాలు- పేదలు శిక్షించబడుతున్నారు, స్వల్పకాలిక మార్పుకు గురవుతున్నారు. ఆర్థికంగా త్యాగం చేయబడుతున్నారు.
రిజర్వేషన్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం– 2005లోని సెక్షన్ 10 ప్రకారం, కేంద్ర ఉపాధి హామీ మండలి(సీఈజీసీ)చట్టబద్ధంగా సామాజిక ప్రాతినిధ్యాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత ఉందని; దాని అనధికార సభ్యులలో మూడింట ఒక వంతు కంటే తక్కువ కాకుండా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందినవారు ఉన్నారని బ్రిట్టాస్ వైర్‌తో అన్నారు. అయితే, జీ ఆర్ఏఎం జీలోని క్లాజ్ 12 కింద సంబంధితంగా పేరు మార్చబడిన సెంట్రల్ గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కౌన్సిల్ ఈ రిజర్వేషన్ ప్రమాణాలను స్పష్టంగా విస్మరించింది.
దీనికి విరుద్ధంగా, రాష్ట్ర గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కౌన్సిల్‌లను నియంత్రించే జీ ఆర్ఏఎం జీ బిల్లులోని క్లాజ్ 13, రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ కోసం ఎంజీఎన్ఆర్ఈజీఏ సెక్షన్ 12లో సూచించిన విధంగానే- మహిళలకు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలకు అదే ప్రాతినిధ్య ప్రమాణాలను స్పష్టంగా నిలుపుకుంది.
“ఈ ఎంపిక చేసిన నిలుపుదల కేంద్ర స్థాయిలోని లోపాన్ని పర్యవేక్షణ లేదా ముసాయిదా లోపంగా తోసిపుచ్చలేమని; కానీ అత్యున్నత స్థాయిలో చట్టబద్ధమైన సామాజిక చేరికను కావాలని పలుచన చేయడమేనని నిర్ధారిస్తుంది” అని ఆయన అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
