
ది వైర్‌తో సహా న్యూస్ లాండ్రీ, రవీష్ కుమార్, అజిత్ అంజుమ్, ధ్రువ్ రథీ, ఆకాష్ బెనర్జీ అకా దేశ్‌భక్త్ మరికొందరికి పేర్లు ఉత్తర్వులలో చేర్చబడ్డాయి.
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 16న రెండు మీడియా సంస్ధలకు, పలు యూట్యూబ్ ఛానళ్లకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులను జారిచేసింది. అందులో అదానీ గ్రూపుకు సంబంధించిన 138 వీడియోలు, 83 ఇంస్టాగ్రామ్ పోస్టులను తొలగించాలని ఆదేశించింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై ఉత్తర పశ్చమ ఢిల్లీ జిల్లా కోర్టు సెప్టెంబరు 6న ఎక్స్‌పార్టీ ఆర్డర్‌ను జారీ చేసింది. దీని ఆధారంగా మంగళవారం నాడు ఈ ఆదేశాలను మంత్రిత్వ శాఖ జారిచేసింది.
అదానీ గ్రూపు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న కథనాలు, పోస్టులను తొలిగించాలని పరంజోయ్ గుహ ఠాకుర్త, రవి నాయర్, అభిర్ దాస్ గుప్త, ఆయస్కాంత్ దాస్, ఆయూష్ జోషితో పాటు అనేకమంది జర్నలిస్టులు, కార్యకర్తలకు కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో భాగస్వాములైన జర్నలిస్టులు, కార్యకర్తల వాదనలను వినలేదు. అయినా, కేసులో కొన్ని పార్టీల సమక్షంలో ఎక్స్ పార్టీ ఉత్తర్వులను జారీ చేశారు.
ఎవరైతే మంగళవారం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు అందుకున్నారో, వారికి ఈ కేసుతో సంబంధం లేదు.
అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా యూఎస్ సెక్యూరిటీసీ అండ్ ఎక్సేజ్ కమిషన్ చేసిన పలు ఆరోపణలను ప్రస్తావిస్తూ ది వైర్ ఇంస్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది. దీంతో వైర్‌కు కూడా మంగళవారం నోటీసులు అందజేయబడ్డాయి.
ఉత్తర్వులు అందినవారిలో న్యూస్ లాండ్రీ, రవీష్ కుమార్, అజిత్ అంజుమ్, ధ్రువ్ రథీ, ఆకాష్ బెనర్జీ అకా దేశ్‌భక్త్ ఇతరులు ఉన్నారు.
ప్రసారం చేసిన అనేక వీడియోలలో కొత్తగా రిపోర్ట్ చేయడం లేదా అభిప్రాయం చెప్పే అవసరమనేది కూడా ఏదీ లేదని, ఉదాహరణకు న్యూస్ లాండ్రీ వీడియోలకు చందాదారుల కోసం విజ్ఙప్తి చేస్తూ, అదానీ గ్రూపు గురించి చిన్న వ్యాసాన్ని ఆ వీడియోలో పొందుపరిచారు.
కోర్టు విధించిన గడువులోగా చర్యలు తీసుకోవడంలో ప్రచురణ సంస్థలు విఫలమైనట్టు సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తన లేఖలో చెప్పారు.
“దీని ప్రకారం, నోటీసులపై సమాధానం ఇవ్వకుండా అలసత్వాన్ని ప్రదర్శించడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకున్నారో 36 గంటల్లోపు మంత్రిత్వశాఖకు తెలియజేయాలి” అని పేర్కొనబడింది.
నోటీసు ప్రతులను మేటా, గూగుల్ వేదికలలో పొందుపరిచారు.
అన్ని పక్షాల వాదనను వినకపోవడం వల్ల, సెప్టెంబరు 6న జారీ చేసిన ఉత్వర్వులను ప్రశ్నిస్తున్నట్టుగా పరంజోయ్ గుహ ఠాకుర్త అన్నారు.
దీనిపై సీనియర్ సివిల్ జడ్జ్ అనుజ్ కుమార్ సింగ్ మాట్లాడారు. ఈ కేసు మూడవ వంతు పరీక్ష ముగిసిన తర్వాత ఎక్స్ పార్టీ తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేయడమైందని అన్నారు. “న్యాయమైన, ధృవీకరించబడిన, నిరూపితమైన నివేదిక” నిలుపుదల చేయడానికి తానేమీ బ్లాకెట్ ఆర్డర్‌ను జారీ చేయలేదని సింగ్ అన్నారు.
ఈ నిర్ణయంపై ఠాకూర్ స్పందిస్తూ, అదాని గ్రూప్ తనకు వ్యతిరేరకంగా కోర్టులో దాఖలు చేసిన ఏడు పరువునష్టం దావా కేసులపై తాను పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు.
భారత న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందని ఠాకూర్ అన్నారు. తాను రచించిన లేదా సహ రచయితగా రాసిన కథనాలు, చేసిన ప్రకటనలు పూర్తిగా వాస్తవాలేనని, ఖచ్చితమైనవేనని, అవి ఎప్పటికీ ప్రజాప్రయోజనాల కోసమే ఉన్నాయని ఠాకూర్ పేర్కొన్నారు. పరువు నష్టమని పేరుకొంటూ అదానీ గ్రూపు తనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసులన్నింటిని గట్టిగా వ్యతిరేకిస్తూ, అవకాశం దొరికితే వీలైనంత త్వరగా తన వాదనలను కోర్టు ముందు పెడతానని ఆయన ఒక ప్రకటనలో చెప్పుకొచ్చారు.
అనువాదం: గంట రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.