
సరుకుల సాధారణ మార్పిడి స్థితి నుంచి మనం ప్రారంభిద్దాము. ఒక రైతు పట్టణానికి వెళతాడు, ఒక దర్జీ నుంచి కొన్ని దుస్తులకు బదులుగా తన ధాన్యాన్ని మార్పిడి చేసుకుంటాడు. వినియోగ విలువ కోణం నుంచి చూస్తే, విడిచిపెట్టిన దానికన్నా పొందిన సరుకు ఇరువురికీ ఎక్కువగా ఉపయోగపడుతున్నందున ఖచ్చితంగా రైతు, దర్జీ ఇద్దరూ లాభం పొందారు. రైతు ధాన్యం పండించడంలోనూ, దర్జీ బట్టలు కుట్టడంలోనూ మెరుగైనందున అక్కడ అదనపు లాభం ఉంది. కానీ, మార్పిడి విలువ దృక్కోణం నుంచి పరిస్థతి భిన్నంగా ఉంటుంది.
మనం సరుకు విశ్లేషణను జ్ఞాపకం చేసుకుందాము. సరుకుల మారకపు విలువలు ప్రాథమికంగా వాటి విలువ వద్ద నిర్ణయించబడతాయని మనం అక్కడ వాదించాము. మనం ఒక అడుగు ముందుకు వేసి సరుకులు వాటి విలువ వద్ద మార్పిడి అవుతాయని ఇప్పటికి ఊహించుకుందాము. (విశ్లేషణలోని తరువాతి దశలో సరుకుల మార్పిడి విలువలు వాటి విలువలకు సమానం కాదని మనం చూస్తాం)
మేము ఈ ఊహ చేస్తున్నది, తక్షణ వాస్తవానికి అది ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహిస్తుందని మేము అభిప్రాయపడినందువలన కాదు. ఆ విషయం పూర్తిగా భిన్నమైనది. ‘సమాన మార్పిడి పరిస్థితులలో’ కూడా సరుకులు వాటి విలువ, అదనపు విలువ వద్ద మారకమవడం సాధ్యమని, అది ఉత్పత్తిలో పుడుతుందని, చివరకు అది కొన్ని చారిత్రక నిర్దిష్ట ఉత్పత్తి సంబంధాల ఉత్పత్తి చూపడానికి చేశాము.
మారకపు విలువ ప్రాథమిక నిర్ణయాన్ని విలువ(ధర) అందిస్తూ ఉండగా మారకపు విలువ(లేదా ధర)నేరుగా విలువకు సమానం కాదనే విషయాన్ని మార్క్స్ తన దృష్టి నుంచి ఎప్పుడూ కోల్పోలేదు. ఇంకా సందర్భోచితమైనది ఏమిటంటే, మొత్తం ఆర్ధిక వ్యవస్థను పరిగనణలోకి తీసుకోవడం. కేవలం మార్పిడి ద్వారా పెంచడం సాధ్యం కాని విలువల కొంత మొత్తం అక్కడ ఉంది(ఖర్చు చేసిన కొంత శ్రమ సమయం).
ఇంకా చెప్పాలంటే, సరుకుల మార్పిడి విలువలను నిర్ణయించడం ఈ మొత్తం అవరోధాల పరిధిలోనే జరుగుతుంది. సరుకులు, వాటి విలువల వద్ద మారకం అవుతాయని ఊహించడం కేవలం అదనపు విలువ సమస్య సారాన్ని పొందడానికే.
పై తర్కం ప్రకారం, అదనపు విలువ మూలాలను సరుకుల సర్క్యులేషన్‌కు– మార్పిడి చర్యకే – ఆపాదించే ప్రయత్నం వినియోగ విలువ, మారకపు విలువ మధ్య గందరగోళంతో ఉత్పన్నమవడాన్ని చూడవచ్చు. అటువంటి ప్రయత్నం రూపాంతరం– అదనపు విలువను వినియోగ విలువలో లాభాల ద్వారా వివరించడం – అదనపు విలువ(దానిలో ఒక భాగం లాభం) వాణిజ్యం ద్వారా పుడుతుందని వాదించడం, ఆ విధంగా తరువాతిది ‘ఉత్పాదకత’గా పరిగణించబడుతుంది. వినిమయదారుని చేతిలోని అవే ఉత్పత్తులు ఉత్పత్తిదారుని చేతిలో ఉన్నప్పటికన్నా ఎక్కువ విలువ కలిగి ఉన్నందున వాణిజ్యం ఉత్పత్తులకు విలువ చేరుస్తుందనే వాదనను ఉదాహరిస్తూ మార్క్స్ చాలా సముచితంగా ఇలా చెప్పాడు.
‘కావున కొనుగోలుదారుడు ఉదాహరణకు మేజోళ్ళను డబ్బులుగా మార్చడం ద్వారా “ఖచ్చితంగా ఉత్పత్తి చర్యను” చేస్తాడని కూడా చెప్పవచ్చు’. అన్నిటికంటే డబ్బు అమ్మే వానికి అతని సరుకు, మేజోళ్ళ కన్నా ‘మరింత ఉపయోగకరం’గా ఉంటుంది.
ఎక్కువ విలువ గల దానిని అమ్మడం తక్కువ విలువ గల దానిని కొనడం, అదనపు విలువను( ఆవిధంగా లాభాన్ని) వివరించడానికి తెచ్చిన మరొక వాదన. ఇక్కడ మనకు రెండు అవకాశాలు ఉన్నాయి. దృగ్విషయం సాధారణం. సరుకులన్నీ వాటి విలువ కన్నా ఎక్కువ విలువకు అమ్మబడతాయి. ఈ సందర్భంలో అమ్మకందారుడు ఎంతైతే లాభం పొందుతాడో అంతే మొత్తం కొనుగోలుదారుడు నష్టపోతాడు.
ఆవిధంగా అన్ని లావాదేవీలనూ కలిపి తీసుకుంటే, నికరలాభం కానీ లేదా మష్టపోయేది కానీ ఉండదు. ఎవరైతే కొనడం, అమ్మడం చేస్తూ ఉంటారో అటువంటి సరుకుల యజమానులకు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. స్పష్టంగా, వ్యక్తిగత స్థాయిలో కానీ లేదా సామాజిక స్థాయిలో అదనపు విలువకు ఇక్కడ వివరణ లేదు.
రెండవ అవకాశం అమ్మకందారుడు A తన సామానులు కొనుగోలుదారుదు Bకి వాటి విలువకన్నా ఎక్కువ ధరకు అమ్మేటంత తెలివైన వాడు. కానీ, B తన సామానులను Aకి వాటి విలువ వద్ద అమ్ముతాడు. ఈ సందర్భంలో ఖచ్చితంగా A లాభ పడతాడు, B నష్ట పోతాడు.
A- Bలను కల్పిపి తీసుకుంటే నికర లాభం కానీ నష్టం కానీ ఉండదు. వ్యక్తిగత సరుకు యజమానికి వచ్చే అదనపు విలువను వివరించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయినప్పటికీ సమాజాన్ని మొత్తంగా తీసుకున్నప్పుడు ఆ స్థాయిలో అదనపు విలువను వివరించడంలో అది విఫలమౌతుంది. ఇక్కడ సంభవించినదంతా, చలామణిలో ఉన్న మొత్తం విలువల(Aకి ఎక్కువ, తదనుగుణంగా Bకి తక్కువ) పంపిణీలో మార్పు. మార్క్స్ వివరించినట్లు ‘వాటి పంపిణీలో ఏవైనా మార్పుల ద్వారా చలామణిలో ఉన్న విలువల మొతాన్ని స్పష్టంగా పెంచలేము.’
ఇప్పటి వరకూ జరిగిన మన చర్చ నుంచి వెలువడిన ప్రాథమిక అంశం, సరుకుల మార్పిడి వాటి విలువల వద్ద మార్పిడి జరిగిందా లేదా అనేదానితో సంబంధం లేకుండా సామాజిక వాస్తవంగా పరిగణించబడిన అదనపు విలువ (ఆవిధంగా లాభం) చలామణిలో తలెత్తదు. ప్రతికూల అభిప్రాయం మూలధనం ఉనికి వ్యాపార మూలధనం, వడ్డీ వ్యాపార మూలధనం వంటి కొన్ని రూపాల నుంచి చౌకగా కొని ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా ‘లాభం’ వస్తుందనే భావన పుడుతుంది.
ఈ రెండు రూపాల విషయంలో లాభం చలామణి నుంచి పుట్టుకొచ్చినట్లు కనపడుతుంది. వ్యాపార మూలధనం విషయంలో ఉత్పాదక మూలధన సర్క్యూట్లో మనకు కనుపించే ఉత్పత్తి మధ్యంతర దశ తొలగించబడుతుంది. సరళంగానూ ప్రత్యక్షంగానూ M– C – M’, లేదా చౌకగా కొనడం ఎక్కువ ధరకు అమ్మడం మనకు ఉంది.
వడ్డీ వ్యాపార మూలధనం విషయంలో కొనుగోలు, అమ్మకం మధ్యంతర దశలు కూడా తప్పించబడ్డాయి. మనకు M – M’ ఉంది. సాధారణంగా ‘లాభం’ చలామణి నుంచి ఉత్పన్నమవుతుందనే భ్రమను వ్యాపార మూలధనం పెంచుతుండగా వడ్డీ వ్యాపారంలోని మూలధనం అదనపు విలువ మోత్తాన్ని మరింతగా మార్మికం చేస్తుంది. ఈ సందర్భంలో అదనపు విలువను డబ్బే సృష్టించినట్లు, అంటే డబ్బుకు సహజసిద్ధంగానే పునఃసృష్టి చేసే మాయా శక్తి ఉన్నట్లు కనపడుతుంది.
సరిగ్గా, వ్యాపార– వడ్డీ వ్యాపార మూలధనాలు సృష్టించిన రహస్యాలను, భ్రమలను నివారించడానికే మూలధన సాధారణ సూత్రం కొరకు మార్క్స్ తనకు తానుగా ఆలోచించాడు. అసమాన మార్పిడి, విలువల నుంచి రోజువారీ ధరల ఉల్లంఘన వంటి అసాధారణ రూపాలను దాటి వెళ్లి అదనపు విలువకు సాధారణ, ప్రాథమిక వివరణల కోసం వెతికాడు.
సాధారణంగా అదనపు విలువ చలామణి నుంచి ఉద్భవించదని నిరూపించడానికి ఇప్పటివరకూ మనం ప్రయత్నించాము. కానీ, ఒక సమస్య తలెత్తింది. సరుకుల యజమానులుగా, సరుకుల యజమానుల మధ్య ఉన్న పరస్పర సంబంధాలు అన్నీ మొత్తంగా, చలామణిలో ఉన్నాయి. విషయం ఇదైనప్పుడు, అదనపు విలువ ఎక్కడ నుంచి రావచ్చు? మార్క్స్ వివరించినట్లుగా, అది చలామణి పరిధి వెలుపల ఒక సరుకుల ఉత్పత్తిదారుడు ఇతర సరుకుల యజమానులతో పరిచయం లేకుండా విలువను విస్తరించడం, తత్ఫలితంగా సరుకులను మూలధనంగా మార్చడం అసాధ్యం.’
మూలధన సాధారణ సూత్రంలోని వైరుధ్యాలు ఆవిధంగా తమకుతామే ‘ప్రతికూల’ (‘paradoxical’) సమస్యగా పరిష్కరించుకున్నాయి. సరుకులను వాటి విలువల వద్ద మారకం ఆధారంగా అదనపు విలువ మూలాన్ని తప్పకుండా కనుగొనాలి. అదనపు విలువ ‘తన మూలాన్ని తప్పకుండా చలామణిలోనూ, ఇంకా చలామణి కాని దానిలోనూ రెండింటిలోనూ కలిగిఉండాలి.’
అదనపు విలువ మూలం..
ఈ విపరీతాన్ని పరిశీలించడానికి, ఉత్పాదక మూలధన సర్క్యూట్‌కు తిరిగి వెళదాము. CMPలో ప్రబల రూపమైన ఉత్పాదక (పారిశ్రామిక) మూలధన సర్క్యూట్ ఇంతకు ముందే చెప్పినట్లు ఈ దిగువ విధంగా ఉంటుంది.
LP M—C——P——C’—M’: ఈ దశలు M – C, C’ – M’లు పూర్తిగా మార్పిడి దశలు. అందుచేత, మన సమస్య ఉన్న పరిస్థితులలో, విలువలో ఎటువంటి మార్పు ఈ రెండు కార్యకలాపాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్య ఉండదు.
ఆవిధంగా ఉత్పాదక మూలధనం సర్క్యూట్ LP M—C——P——C’—M’ భాగంలో అదనపు విలువ మూలాన్ని వెతకాలి.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది పన్నెండవ భాగం, పదకొండవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.