
ఈ ఉదాహరణ ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది: ఈ(mystification) వట్టి మాయ మూలాలను కనుగొనవలసింది అర్ధ శాస్త్రవేత్త ఆత్మాశ్రయ లోపాలలో కాదు. కానీ, సామాజిక వాస్తవికతలోనే కనుగొనాలి. చివరకు సరుకుల ఉత్పత్తిదారునుకి, సరుకులు ఒక వస్తుగత వాస్తవికత, పెట్టుబడిదారీ సమాజంలో మూలధనంలాగా ఉత్పత్తిసాధనాలు కార్మికుడిని ఎదుర్కొంటాయి. అంతేకాకుండా వస్తుగత వాస్తవికత ఈ స్థాయిలు నిరంతరం, పదే పదే అనుభవంలోకి రావడంతో ‘సామాజిక జీవిత రూపాలు సహజ స్వీయ- అవగాహన స్థిరత్వాన్ని’ పొందుతాయి.
వస్తు వ్యామోహం/సరుకులపై వ్యామోహం(mystificatory)వట్టి మాయ అంశంను అనుసరించి వస్తుంది. పెట్టుబడిదారీ సమాజ శాస్త్రీయ విశ్లేషణ సామాజిక వాస్తవికత ఉపరితల(అసాధారణ) స్థాయిని దాటిపోయి తప్పకుండా జరగాలి. ప్రత్యక్ష స్థాయికి లోతైన అంతర్లీన స్థాయిలలోని మారకపు విలువ వంటి వర్గాలు ప్రాతినిధ్యం వహించగా, వీటిలో ఉపరితల స్థాయి ఒక అభివ్యక్తీకరణ మాత్రమే అయినా, మార్క్స్ మారకపు విలువ వద్ద ఆగిపోలేదు. కానీ, దానిని విలువ అసాధారణ రూపంగా చూసి, విలువ సంబంధాలను విశ్లేషించడాన్ని కొనసాగించాడు. ఈ ప్రక్రియ ద్వారానే అతను సరుకుల వ్యామోహం(commodity fetishism) ఉనికిని కనుగొనగలిగాడు. మారకం విలువ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వాస్తవికత స్థాయి సంకల్పాన్ని అందించగలిగాడు. ఈ సంకల్పం విలువ సంబంధాలలో ఉంది.
సైద్ధాంతిక చిక్కుముడులు..
సరుకుల పట్ల వ్యామోహం వట్టి మాయ అంశం సైద్ధాంతిక చిక్కుముడులను పెట్టుబదిదారుడికీ కార్మికునికీ మధ్య గల సంబంధాలను పరిశీలించడం ద్వారా కూడా వివరించవచ్చు. ప్రత్యక్షంగా కనపడేదానికే పరిమితమైతే, ఎవరైనా ఈ సంబంధాన్ని సమానత్వంగా అర్ధం చేసుకుంటారు. చివరకు, పెట్టుబదిదారుడూ, కార్మికుడూ ఇరువురూ కూడా కార్మికుల మార్కెట్లో కొనేవాడు, అమ్మేవాడుగా కలుస్తున్న స్వతంత్ర వ్యక్తులు. కార్మికుడు తన శ్రమ శక్తినే సరుకుగా అమ్ముతున్నాడు. అంతేకాకుండా పెట్టుబడిదారుడు దానిని డబ్బు అనే సరుకుతో కొంటున్నాడు. ఆవిధంగా పెట్టుబడిదారీ చట్టం దృష్టిలో వారిరువురూ సమానం, వారి స్వంత ఇష్టానుసారం పరస్పర ఒప్పందం చేసుకుంటున్న సరుకుల స్వతంత్ర యజమానులు. సమానత్వ ఈ రూపం మోసపూరితమైనది. అతను తన శ్రమశక్తిని కలిగి ఉన్నాడు తప్ప ఉత్పత్తి సాధనాలను కలిగి లేనందున, కార్మికుడు జీవించాలంటే తన శ్రమ శక్తిని వేతనానికి అమ్ముకోవడం తప్ప అతనికి మరొక మార్గం లేదు.
పెట్టుబడిదారీ సమాజంలో ఆ తరువాతివి(ఉత్పత్తి సాధనాలు) పెట్టుబడిదారీ వర్గంచే వారి గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయాయి. (మారకం, చలామణి క్షేత్రాలలో) సమానత్వంగా కనిపించడం వెనుక(ఉత్పత్తి సంబంధాల క్షేత్రంలో)వాస్తవం ఉంటుంది. వేతన కార్మికుడూ, పెట్టుబదిదారుడూ వేరువేరు సామాజిక వర్గాలకు చెందినవారు: ఆ తరువాతి వారు యాజమాన్యం, ఉత్పత్తి సాధనాలపై గుత్తాధిపత్యం కలిగిన వర్గానికి చెందినవారు కాగా, మొదటి వారు అమ్ముకోవడానికి తమ శ్రమ శక్తి మాత్రమే కలిగి ఉన్న వర్గానికి చెందినవారు.

వట్టి మాయ(mystification) అంశం ఆధిపత్యానికి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. చివరకు, అర్ధం కాని సామాజిక దృగ్విషయం ఒక పరాయి శక్తిని కలిగి ఉంటుంది. సరుకుల ఉత్పత్తికి స్వతంత్రుడైన వ్యక్తిగత ఉత్పత్తిదారుడు కావాలి. అయితే, ఈ స్వాతంత్రం మరింత ప్రాథమిక వాస్తవికతయిన ఉత్పత్తిదారులు పరస్పరం అధారపడడం వట్టి మాయాస్వరూపం మాత్రమే. పరస్పరం ఆధారపడడం అన్నది వాస్తవం తరువాత గ్రహించబడిన విషయం. సరుకుల వ్యక్తిగత ఉత్పత్తిదారుడు ఇతరుల నుండి స్వతంత్రంగా పనిచేస్తాడు. కానీ, అతని ఉత్పత్తికి అతనికి లభించే ధర ఇతర ఉత్పత్తిదారులు, ముఖ్యంగా అవే ఉత్పత్తులు చేసేవారు ఏమి చేశారన్నదానిమీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది.
స్వతంత్ర వ్యక్తిగత ఉత్పత్తిలోని ఈ అరాచకంలో సరకుల మధ్య మారకపు నిష్పత్తి, ‘ఉత్పత్తిదారుని సంకల్పం, దూరదృష్టి చర్యల నుండి స్వతంత్రంగా నిరంతరం మారుతూ ఉంటుంది. వారికి వారి స్వంత సామాజిక చర్య, వారిచే శాసించబడడానికి బదులు ఉత్పత్తిదారులనే శాసిస్తున్న వారి ఆధీనంలోని వారి చర్య స్వరూపం తీసుకుంటుంది’.
మరింత సాధారణంగా, వస్తుగత సామాజిక దృగ్విషయం, ఏవైతే సరకు ఉత్పత్తి ప్రత్యేక సామాజిక సంబంధాల ఉత్పత్తులో(మరింత దాని పెట్టుబడిదారీ అభివృద్ధిలో) అవి పరాయి లేదా బాహ్య శక్తిని, ఆధిపత్యాన్ని సామాజిక సంబంధాలను(సరకుల ఉత్పత్తిదారులు తరువాత కార్మికవర్గం) మోసే వారిపైనే ప్రయోగించడం ప్రారంభించాయి. ప్రతి వ్యక్తిగత పెట్టుబడిదారుదిపై బాహ్య నిర్బంధ శక్తి రూపంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి స్వాభావిక చట్టాలను బయటకు తెచ్చే స్వేచ్ఛాయుత పోటీని గురించి పెట్టుబడిలో, మార్క్స్ మాట్లాడాడు.
సరుకుల వ్యామోహంపై(commodity fetishism) మార్క్స్ విశ్లేషణ ప్రాముఖ్యతను సూచించడానికి చాలా చెప్పారు. అటువంటి వ్యామోహంను(ఫెటిషిజంను) దృష్టిలో ఉంచుకొని, సారాంశ రూపం, వ్యక్తీకరణ స్థాయిని మించి, రూపాన్ని నిర్ణయించే వాస్తవికత అంతర్లీన స్థాయిపై ఒక శాస్త్రీయ విశ్లేషణను పెట్టుబడిదారీ సమాజంపై తప్పనిసరిగా కొనసాగాలని నొక్కి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ విధంగా సారం, వ్యక్తీకరణ రెండూ, వ్యామోహాన్ని కలిగించే వాటి మధ్య గల వైరుధ్యంను అర్ధం చేసుకోవడం అవుతుంది. విలువ గురించి మార్క్స్ భావన, విలువ సంబంధాలపై అతని విశ్లేషణలను(వాటిలోకి తరువాత మనం వివరంగా వెళ్ళాలి) అటువంటి అధ్యయనాలను సులభతరం చేసే(అవి ఒక నిర్దిష్ట సామాజిక వాస్తవికత సైద్ధాంతిక ప్రాతినిధ్యాలు)‘శాస్త్రీయ సాధనాలుగా’ చూడాలి.
వివరణలు- సూచనలు..
1. కారల్ మార్క్స్, సంపుటి. 1. ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1967, పేజీ 42.
2. Ibid., p. 35.
3. Ibid.
4. Ibid., p. 38.
5. Ibid.: ‘సరకుల మారకపు విలువలో స్వయంగా వ్యక్తమయ్యే సాధారణ విషయం విలువ.(వక్కాణింపు చేర్చబడింది)[‘the common substance that manifests itself in the exchange value of commodities . . . is value’ (emphasis added).]
6. Ibid., p. 39.
7. Ibid.
8. కారల్ మార్క్స్, సంపుటి. 3. ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1967, పేజీ 178.
9. Ibid., pp. 178– 99.
10. N.I. బుఖారిన్ “ది ఎకనామిక్ తీరీ ఆఫ్ లీజర్ క్లాస్”, మంత్లీ రివ్యూ ప్రెస్ 1973; MH డాబ్, పొలిటికల్ ఎకానమీ అండ్ కేపిటలిజం, రౌట్లేజ్ అండ్ కేగాన్ పాల్, 194౦. ఇంకా డాబ్ ఇన్ EK హింట్ అండ్ జెస్సీ స్చ్వార్త్జ్ (eds.), క్తిక్యూ ఆఫ్ ఎకనామిక్ తీరీ, పెంగ్విన్ 1974 చూడండి.
11. కారల్ మార్క్స్ గ్రుండ్ రైజ్. పెలికాన్, 1973, పేజీ,101
12. ‘మన పెట్టుబడిదారీ సమాజంలో మానవ శ్రమలో కొంత భాగం, మారుతున్న డిమాండుకు అనుగుణంగా, ఒకమారు దర్జీ పనిగా మరొకమారు నేత పనిగా సరఫరా చేయబడుతుంది.’ పెట్టుబడి. సంపుటి. 1, పేజీ 43.
13. గ్రుండ్ రైజ్.పేజీ. 105.
14. Ibid.
15. పెట్టుబడి, సంపుటి. 1, పేజీ 43, వక్కాణింపు చేర్చబడింది.
16. Ibid., p. 61.
17. Ibid., p. 47.
18. Ibid., p. 60.
19. ఆ విధంగా, ఎవరైనా మార్కెట్కు వెళితే, కొంత డబ్బుతో వివిధ వస్తువులను ఎంతెంత కొనగలననే ప్రశ్న వారికి ఎదురవుతుంది. అంతర్లీనంగా ఉన్న వ్యవస్థలోని వస్తువులను సరుకులుగా మారుస్తున్న ఆస్తి సంబంధాలు, సామాజిక సంబంధాలు ఉపరితల దృగ్విషయం స్థాయిలో ప్రతిబింబించడం ఉండదు.(One does not at the level of surface phenomena reflect on the underlying system of property relations and social division of labour that makes these things into commodities.)
20. పెట్టుబడి, సంపుటి. 1, పేజీ 72.
21. Ibid., p. 77.
22. N. గెరాస్ ‘మార్క్స్ అండ్ ది క్రితిక్యూ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ’, ఇన్ R బ్లాక్ బరన్ (ed.) ఇదియాలజీ ఇన్ సోషల్ సైన్స్, వింటేజ్ బుక్స్, 1973.
23. పెట్టుబడి, సంపుటి. 1, పేజీ. 75.
24. Ibid.
25. Ibid. పేజీ.27౦. ఇక్కడ చర్చించిన ఆధిపత్య భావన మార్క్స్ మరొక భావన పరాయీకరణతో దగ్గర సబంధం కలిగి ఉంది. మనం పరాయీకరణ భావనను కొంత వివరంగా తరువాత పరిశీలిద్దాము.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది పదవ భాగం, తొమ్మిదవ భాగం కోసం ఇక్కడ క్లిక్చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.