
సిద్ధాంత- సంగ్రహణ సమస్యలపై నిజంగా లోతైన చర్చ ఇక్కడ సాధ్యం కాదు. కానీ, కొన్ని పరిశీలనలు చేయవచ్చు. ఒక నిర్దిష్ట సమాజాన్ని విశ్లేషించే సమయంలో దాని నిర్దిష్ట- వెంటనే స్పష్టంగా కనిపిస్తున్న జనాభా వంటి లక్షణాలతో ప్రారంభించడం సహజంగా అనిపించవచ్చు. ఏమైనప్పటికీ ఇది తప్పుదోవ పట్టించేది.
ఉదాహరణకు, ఎవరైనా ఉత్పత్తి సంబంధాలను వర్గీకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు జనాభా అనే భావన సహాయకారి కాదు. ఆవిధంగా వివిధ సామాజిక వర్గాలను గుర్తించడం ఎవరికైనా అవసరం. ఈ ఆలోచనను మరింత కొనసాగిస్తే ఒక నిర్దిష్ట- చూపుకు కనిపిస్తున్న దానిని అనేక ప్రాథమిక విశ్లేషణాత్మక ఉప-విభజనకు పదేపదే ఉద్దేశ్యపూర్వకంగా పాల్పడుతున్నారని దీనిని అనుసరిస్తుంది.
‘సాధారణ నిర్ణయాలు’ అని మార్క్స్ పిలుస్తున్న నిర్ణయాలకు చేరుకుంటారు. అటువంటి విశ్లేషణ ద్వారా శ్రమ విభజన, మారకం వంటి భావనలకు వచ్చారు. సాధారణ విశ్లేషణాత్మక నిర్ణయాలతో సాయుధులై, ఎవరైనా నిర్దిష్ట మొతాన్ని ఒక క్రమమైన, శాస్త్రీయ పద్దతిలో సందర్భానుసారం పునర్నిర్మించగలరు. సైద్ధాంతికంగా ‘సంగ్రహణ’వర్గాలుగా చూపుకు కనపడుతున్న వాటితో ప్రారంభించి నిర్దిష్ట స్థితికి ఎవరైనా చేరుకుంటారు.
మార్క్స్ దీనిని ఇలా చెప్పారు: “సంగ్రహణ నుండి నిర్దిష్టత వరకు పైకి వెళ్ళే పద్ధతే, దేనిలోనైతే ఆలోచన నిర్దిష్టతను సముచితం చేస్తున్నదో, మనస్సులో దానిని నిర్దిష్టతగా పునరుత్పత్తి చేస్తున్నదో అదే ఏకైక మార్గం.”
వాస్తవికత అనేది మానవ మేధస్సు ఉత్పత్తి కాదని చెప్పవలసిన పనిలేదు. మళ్లీ మార్క్స్ సూత్రీకరణ సహాయకారిగా ఉంటుంది: ‘ఇంతకు ముందు లానే, అసలు విషయం దాని స్వయంప్రతిపత్తి ఉనికిని తల వెలుపల కలిగి ఉండడాన్ని; అంటే తల ప్రవర్తన కేవలం లాభాపేక్షే, కేవలం సైద్ధాంతికమే అయినప్పుడు నిలుపుకొంటున్నది.’
ఈ స్థితి ప్రాముఖ్యత ఎలా ఉందంటే..
ఒక నిర్దిష్ట సామాజిక వాస్తవికతను విశ్లేషించడంలో ఎవరైనా సైద్ధాంతిక భావనల ద్వారా వాస్తవికతను ఉపయోగించుకోవాలి. అనేక ప్రాథమిక సమూహాల(సాధారణ లేదా సంగ్రహణ వర్గాలుగా లేదా నిర్ణయాలుగా పిలువబడే) నుంచి దానిని నిర్మించడం ద్వారా, మనస్సు నిర్దిష్ట వాస్తవికతను గ్రహించగలిగిన ఏకైక మార్గం ఇదే.
ఏమైనప్పటికీ, వాస్తవికతను సైద్ధాంతిక ప్రక్రియ ద్వారా అర్ధం చేసుకోవడం ఏవిధంగానూ వాస్తవాన్ని మార్చదు. సైద్ధాంతీకరించే ప్రక్రియకు ముందు సంభవించినట్లే ఆ తరువాతిది ఉనికిలోఉంటుంది. సిద్ధాంతం ద్వారా సాధించిన గ్రహణశక్తి ఆధారంగా ఆచరణాత్మకంగా పనిచేయడంతోనే వాస్తవికత కూడా మార్చబడుతుంది. సిద్ధాంతం, ఆచరణల ఐక్యతకు మార్క్సిజాన్ని నిర్వచించే ప్రాథమిక అర్ధం ఇదే.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంపై మార్క్స్ విశ్లేషణ విషయానికి వస్తే, పై అంశాలను, ప్రత్యేకించి నిర్దిష్ట వాస్తవికతని సంగ్రహణతోను, సైద్ధాంతిక వర్గీకరణలనూ విశ్లేషించవలసిన అవసరం మనస్సులో ఉంచుకోవాలి.
ప్రస్తుత సమయంలో, మార్క్స్ విశ్లేషణకు పైన వివరించిన పద్ధతి స్థితి పరిణామాలను, మార్క్స్ స్వంత పని ప్రణాళికపై ఈ క్రింది సారాంశం ద్వారా చాలా గొప్పగా బయటకు తీసుకురావచ్చు: (అధ్యయనం) క్రమం స్పష్టంగా ఉండాలి
(1) సమాజ అన్ని రూపాలలోనూ కొంచెం అటూ ఇటూగా(ఎక్కువ లేదా తక్కువగా) పొందుతున్న సాధారణ సంగ్రహణ(నైరూప్య)నిర్ణయాలు.
(2) పెట్టుబడిదారీ సమాజ లోపలి నిర్మాణాన్ని చేస్తున్న- వేటిమీదైతే మూలధనం, వేతన కార్మికుడు, భూమి రూపంలో ఆస్తి వంటి ప్రాథమిక వర్గాలు ఆధారపడ్డ వర్గాలు, వాటి అంతస్సంబంధాలు, పట్టణం- గ్రామం, మూడు గొప్ప సామాజిక వర్గాలు,(సర్క్యులేషన్) చలామణి (ప్రైవేటు) ఋణ వ్యవస్థలను వాటి మధ్య మారకం చేసుకుంటాయి.
(3) రాజ్యం రూపంలో పెట్టుబడిదారీ సమాజ కేంద్రీకరణ – దాంతో సంబంధంలోనే చూసినప్పుడు అనుత్పాదక వర్గాలు, పన్నులు. రాజ్య అప్పులు, ప్రజల ఋణాలు. జనాభా, వలస దేశాలు, వలసపోవడం.
(4) అంతర్జాతీయ ఉత్పత్తి సంబంధాలు, అంతర్జాతీయ శ్రమ విభజన, అంతర్జాతీయ మారకం, ఎగుమతి దిగుమతులు, మారకపు నిష్పత్తి.
(5) ప్రపంచ మార్కెట్- సంక్షోభం.
ప్రణాళిక అసంపూర్ణంగా ఉండగా, దానిని పూర్తి చేయడానికి మార్క్స్ జీవించి లేకపోవడంతో, మార్క్స్ పద్దతిలోని చిక్కులను అది చూపుతుంది. ఆవిధంగా అతను పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన తన విశ్లేషణను పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన సాధారణ, ప్రాథమిక విశ్లేషణాత్మక శ్రేణులతో/వర్గాలతో ప్రారంభించాడు.
రాజ్యం, ప్రజాఋణం, పెట్టుబడిదారీ సంబంధాల అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ మార్కెట్ వంటి మరింత నిర్దిష్ట వర్గాలను పొందడం ద్వారా సరళమైన వర్గాల ఐక్యత నుంచి సంక్లిష్టమైన నిర్దిష్ట వాస్తవికతను పునరుత్పత్తి చేయడానికి అతను ముందుకుసాగాడు. మార్క్స్ విధానం కొన్ని సార్లు వరుస ఒప్పందాలుగా వర్గీకరించబడుతుంది.
సరళమైన వాటి నుంచి పూర్తిగా వర్గాలను ‘నిర్మించే’ ప్రక్రియ ద్వారా మార్క్స్ ఆలోచనలో స్వతంత్రంగా ఉన్న నిర్దిష్ట వాస్తవికతను పునరుత్పత్తి చేశాడని దీనివల్ల అర్ధం చేసుకుంటే అది సరైనదే.
ఏమైనప్పటికీ, తరచుగా ఈ పదాన్ని మార్క్స్ సరళమైన అనేక ఊహలను చేస్తాడని, ఆపై వాటిని ‘సడలించడం’ చేస్తాడనే అర్ధంలో తీసుకోబడింది. ఉదాహరణకు, ఉత్పత్తి అన్ని శాఖలలోనూ మూలధన సమాన సజీవ(ఆర్గానిక్) కూర్పు ఉన్నట్లు లేదా అక్కడ సమాజంలో రెండు వర్గాలే ఉన్నట్లు ఊహించాడని, పెట్టుబడి సంపుటి ఒకటిలో వాదించబడింది. ఈ భావనలు చాలా తప్పని తరువాత చూస్తాము.
సారాంశం..
సమాజ అధ్యయనానికి, మార్క్సిస్టు విధాన సాధారణ ప్రతిపాదనను అందించడానికి ఈ ప్రతిపాదన సంగ్రహణ(నైరూప్య)లక్షణాన్ని నివేదించడం కొంత మేరకు అనివార్యమైనది. ఏదేమైనా కొన్ని ఫలితాలు ఉద్భవించాయి.
సమాజ అధ్యయనానికి మార్క్సిస్టు విధానంలో వక్కాణింపు సామాజిక ఉత్పత్తిపైన, ఇక్కడ రెండు ముఖ్యమైన విశ్లేషణాత్మక అంశాలు ఉన్నాయి: ఉత్పత్తి సాధనాలు, వాటి అర్ధం సులభంగా సాంకేతికత అని కాదు కానీ సామాజిక శ్రమ విభజనా, నిర్దిష్ట పారిశ్రామిక దశలో భాగస్వామ్యంతో నిలవ ఉన్న సైద్ధాంతిక, ఆచరణాత్మక జ్ఞాన సహకార రూపాలు, ప్రకృతి శక్తులపై అపారమైన జ్ఞానం; సమాజంలోని సభ్యుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలను(వేరు వేరు వర్గాల మధ్య సంబంధాలను)సూచించే, సమాజంలోని ఆస్తి సంబంధాలలో న్యాయపరంగా వ్యక్తీకరించబడుతున్న, ఉత్పత్తి సంబంధాలు.
సామాజిక మార్పులో క్రియాశీలమైనది, ఉత్పత్తి శక్తులకూ, ఉత్పత్తి సంబంధాలకూ మధ్య ఉన్న సామాజిక ఉత్పత్తి పథకంలో వివిధ స్థానాలను ఆక్రమిస్తున్న, సామాజిక వర్గాల మధ్య పోరాటంలో వ్యక్తీకరించబడుతున్న అనూహ్యమైన వైరుధ్యం. ఈ వైరుధ్యం క్రమానుగతంగా నూతన ఉత్పత్తి విధానం ఉన్న సమాజంలోని ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల కొత్త కూటమి ఆధిపత్యంలో వస్తున్నా సామాజిక విప్లవాల ద్వారా పరిష్కరించబడుతున్నది.
ప్రతి సమాజం దానిలో, ఒక నిర్దిష్ట ఉత్పత్తి విధాన ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. ఆవిధంగా, సమాజాన్ని విశ్లేషించేటపుడు దానికి ప్రత్యేకమైన వర్గాలను ఉపయోగించుకోవాలి. అదేసమయంలో ఉత్పత్తి శక్తులకూ ఉత్పత్తి సంబంధాలకూ మధ్య ఉన్న అనూహ్యమైన వైరుధ్యం వలన ప్రతి సమాజం తాత్కాలికమైనది. సామాజిక ఆర్ధిక వ్యవస్థల చారిత్రాత్మక- సాపేక్ష పాత్రను మార్క్సిస్టు విధానం నొక్కి చెపుతుంది. సమాజాన్ని అధ్యయనం చేయడంలో చారిత్రక నిర్దిష్ట విశ్లేషణాత్మక వర్గాల ఉపయోగాన్ని తెలియజేస్తుంది.
కొన్ని మార్క్సిస్టు వ్యాఖ్యానాలలో, ‘ఆర్ధిక పునాది’(ఉత్పత్తి సంబంధాల- ఉత్పత్తి శక్తుల సమూహాన్ని ఉదాహరిస్తూ) ‘ఉపరితలాన్ని’(రాజకీయాలను లేదా సిద్ధాంతాన్ని ఉదాహరిస్తూ) నిర్ణయిస్తుందని అంటారు.
ఆర్ధిక, రాజకీయ, సైద్ధాంతిక పరిధులలో యాంత్రికమైన సంబంధం ఏదీ లేదని నొక్కి చెపాల్సిన అవసరం ఉంది. తరువాతి రెండూ కూడా నిర్దిష్ట సాపేక్ష స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఈ మూడు పరిధుల అసమాన అభివృద్దే సామాజిక వైరుధ్యాలను సృష్టిస్తుంది. ఆవిధంగా సమాజంపై మార్క్సిస్టు దృక్పథ సాధారణ సంపూర్ణత కాదు. కానీ, సంక్లిష్టమైన ఐక్యతగా ఉంటుంది. దాంట్లో ఒకే ఒక్క, సాధారణ సార్వత్రిక వైరుధ్యం లేదు. కానీ, వైరుధ్యాల సముదాయాన్ని అంతిమంగా నిర్ణయించేది‘ఆర్ధికాంశమే’. భావజాల మార్క్సిస్టు భావన కేవలం ఆలోచనా వ్యవస్థ కాదన్నది కూడా గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. (ఫాసిజం భావనలు‘సిద్ధాంతమని’ తరచుగా తప్పుగా అర్ధం చేసుకున్న విధంగా)కానీ, భావజాలం ఎల్లప్పుడూ, దానిలో కొన్ని ఆలోచనలు ఆధిపత్య పాత్ర పోషించే, భౌతిక ఆచరణల సమూహం.
ఈ పధ్ధతి విశదీకరణ ఏవిధంగానూ చారిత్రక సంయోగం గురించిన నిర్దిష్ట ప్రశ్నలకు జవాబు చెప్పడానికి మనకు సహాయపడదు. అది చేయడానికి జాగ్రత్తగా చేసిన అనుభవ ఆధారమైన అధ్యయనం అవసరం. పద్దతి, ఆలోచించే మనసు సమాచారాన్ని సరైన పద్ధతిలో ప్రత్యేకంగా వినియోగించుకునే దానికి మార్గదర్శి మాత్రమే, నిర్దిష్టతను(మిశ్రితాన్ని) అనేక సాధారణ విశ్లేషణాత్మక వర్గాల కేంద్రీకరణగా అర్ధం చేసుకోవచ్చు.
ఆవిధంగా ఆలోచనలోని నిజమైన నిర్దిష్టతను పునర్నిర్మాణం చేయడం ద్వారా ఎవరైనా నిర్దిష్ట వాస్తవికత తక్షణ అవగాహనను అందించే అస్తవ్యస్తమైన సమూహాన్ని తొలగించవచ్చు.
ఏమైనప్పటికీ, ఆ వాస్తవాన్ని మార్చడానికి ఇటువంటి సైద్ధాంతిక గ్రహణ శక్తి అవసరమైన షరతు మాత్రమే కానీ అది సరిపోదు. సిద్ధాంతం ఆధారంగా ఆచరణాత్మక చర్య ద్వారానే వాస్తవికతను ఉద్దేశపూర్వకంగా మార్చవచ్చు. ఉద్దేశపూర్వక సామాజిక మార్పుకు సిద్ధాంతం, ఆచరణల ఐక్యత అవసరమైన, తగినంత షరతు అన్నది మార్క్సిజం అవసరమైన నిర్వచనం. అంతేకాకుండా సిద్ధాంత(శాస్త్ర సంబంధమైన వాదం), వ్యవహారికసత్తావాదం(ప్రాగ్మాటిజం)జంట లోపాలను నివారించే ఏకైక మార్గం.
చివరగా, మార్క్స్ పెట్టుబడిదారీ విధాన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ ప్రత్యేకతలలోకి మనం మరింత లోతుగా వెళ్ళినప్పుడు వ్యాఖ్యానం తక్కువ సంగ్రహణను(నైరూప్యతను) పొందుతుంది, తక్కువ కష్టం.
వివరణలు- సూచనలు..
1. సమకాలీన పెట్టుబడిదారీ అర్ధశాస్త్రంలోని ఆధిపత్య ధోరణులు ఆర్ధశాస్త్ర రంగానికీ- రాజకీయాలూ, సమాజానికీ మధ్య పదునైన వ్యత్యాసాన్ని కల్పిస్తాయి. ఏమైనప్పటికీ అక్కడ అర్ధశాస్త్ర అధ్యయనంలో తప్పనిసరిగా రాజకీయాలూ, సమాజం కలిసి ఉండాలని గుర్తించడంలో, స్మిత్, రికార్డో వంటి బ్రిటిష్ సాంప్రదాయ అర్ధశాస్త్రవేత్తల సాంప్రదాయాలను అనుసరించే ఇతర ధోరణులు ఉన్నాయి. ఈ ధోరణులు అర్ధశాస్త్రంలో కాక రాజకీయ ఆర్ధికవ్యవస్థలో పనిచేస్తాయని చెప్పవచ్చు. మార్క్స్ కేసు విషయంలో పెట్టుబడిదారీ ఆర్ధికవ్యవస్థపై మార్క్సిస్టు విమర్శనాత్మక ధోరణి గురించి మాట్లాడడం మరింత సరైనది.
2. కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ‘జర్మన్ ఐడియాలజీ’ పునర్ముద్రణ ఆర్సీ టక్కర్(ఈడీ.), ది మార్క్స్-ఎంగెల్స్ రీడర్, WW నార్టన్- 1972, పేజీ 114.
3. Ibid., p. 120.
4. Ibid., p. 114.
5. Ibid., p. 121.
6. Ibid.
7. పరిమాణాత్మక మార్పు ఒక నిర్దిష్ట దశలో గుణాత్మక మార్పుగా మారుతుందనే భావన తర్కశాస్త్రంలో అవసరం. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని తరచుగా ‘గతి తార్కిక భౌతికవాదం’ అని పిలవడం జరుగుతున్నది. ఈ పదాన్ని ఉపయోగించే చాలా మందిలో మార్క్స్ ఈ భావనను హెగెల్ నుంచి అరువు తెచ్చుకున్నాడనీ, కానీ హెగెల్ ఆదర్శవాదానికి భిన్నంగా దానిని భౌతికవాద తర్కశాస్త్రంలో పొందుపరిచాడనే భావన ఉంది. ఏమైనప్పటికీ హెగెల్ తర్కశాస్త్రానికీ, మార్క్స్ తర్కశాస్త్రానికీ మధ్య పదునైన వ్యత్యాసం ఉంది. ‘గతి తార్కిక భౌతికవాదం’ అనే భావనే అత్యంత వివాదాస్పదమైనది. అంతేకాకుండా మనం దానిని ఉపయోగించకుండా ఉండడాన్ని ఇష్టపడ్డాము.
8. ఉదాహరణకు, జే రాబిన్సన్ ‘యాన్ ఎస్సే ఆన్ మార్క్సియాన్ ఎకనామిక్స్(1942)ను, ఆమె ఎకనామిక్ ఫిలాసఫీ (1962)కూడా చూడండి.
9. ఉత్పత్తి సంబంధాలను న్యాయపరమైన ఆస్తి సంబంధాలతో సమానంగా చూడడం ఈ సందర్భంలో ప్రత్యేకంగా హానికరం.
10. ఫ్రెడరిక్ ఎంగెల్స్: ‘చరిత్రపై భౌతికవాద భావన ప్రకారం చరిత్రలో అంతిమంగా నిర్ణయించే అంశం నిజ జీవితంలోని ఉత్పత్తీ, పునరుత్పత్తీనూ. ఇంతకూ మించి మార్క్స్ గానీ నేను గానీ నొక్కి చెప్పలేదు. ఆర్ధిక పరిస్థితి ఆధారం కానీ ఉపరితలంలోని వివిధ అంశాలు: వర్గ పోరాట రాజకీయ రూపాలు, వాటి ఫలితాలు. న్యాయ వ్యవస్థ రూపం. కూడా చారిత్రిక పోరాటాల సమయంలో వాటి ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా, చాలా సందర్భాలలో వాటి రూపాన్ని నిర్ణయించడంలో ఆధిపత్యం వహిస్తాయి.’ జే బ్లాచ్కు రాసిన లేఖ, 21-22 సెప్టెంబరు 1890, పునర్ముద్రణ టక్కర్లో, మార్క్స్–ఎంగెల్స్ రీడర్, పేజీ 640.
11. కారల్ మార్క్స్ గ్రుండ్ రైజ్ అనువాదం: నికోలస్ పెలికాన్ 1973; పేజీ 85.
12. Ibid., p. 94.
13. Ibid., p. 96.
14. Ibid., p. 96.
15. Ibid., p. 95.
16. Ibid,. p. 99.
17. Ibid., pp. 99–100.
18. Ibid., p. 101.
19. Ibid., pp. 101–02.
20. Ibid., p. 108
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఆరవ భాగం, ఐదవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.