
ఆ విధంగా సీఎంపీ కొరకు, ఒక వైపున యజమాని డబ్బులు– ఉత్పత్తి సాధనాలు, మరొక వైపున తమ శ్రమ శక్తి తప్ప మరే ఆస్తులూ లేని జన బాహుళ్యం తప్పనిసరిగా ఉండాలి. ఇది ఏ విధంగానూ ప్రకృతిసిద్ధ వ్యవహారం కాదని కానీ, ఒక నిర్దిష్ట సామాజిక– చారిత్రకస్థితి అని మనం ఒక్క మారుగా చూడగలం.
మార్క్స్ వివరించినట్లు ‘ఒకవైపున డబ్బులు లేదా సరుకుల యజమానులను, మరొక వైపున తమ శ్రమ శక్తి తప్ప మరేమీ లేని మనుషులను ప్రకృతి సృష్టించలేదు, ఉత్పత్తి చేయలేదు. ఈ సంబంధాలకు సహజ మూలం పునాది ఏదీ లేదు, ఇది అన్ని చారిత్రక కాలాలకూ సాధారణమైన సామాజిక పునాదీ కూడా కాదు.’
ఎందుకంటే మన చైతన్యం రోజువారీ జీవిత అనుభవంతో మలచబడుతుంది. కావున ఈ వాస్తవ దృష్టిని కోల్పోవడం సులభం కనుక చారిత్రక విశిష్టతనూ, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన తాత్కాలిక స్వభావాన్నీ, ఆ విధంగా వేతన కార్మికుడు– మూలధనం వంటి దాని ఉత్పత్తి సంబంధాలను మనం నొక్కి చెప్పాము. సరుకుల పట్ల వ్యామోహం – సరుకుల ఉత్పత్తి కింద సామాజిక వాస్తవికత కనిపించే స్థాయి ఎలా తప్పు, తప్పుత్రోవ పట్టించేది, ఈ తప్పుడు ధృవీకరణకు వస్తుగత ఆధారం ఉత్పత్తి విధానంలో ఎలా ఉంది– మార్క్స్ గొప్ప ఆవిష్కరణ ఖచ్చితంగా ఈ విషయానికే గురిపెట్టబడింది.
కొందరు మార్క్సిస్టేతర అర్ధశాస్త్రవేత్తలు చారిత్రక పరిణామాలతో సంబంధంలేని దాని లక్షణానికి పెట్టుబడిదారీ అర్ధశాస్త్రాన్ని విమర్శించేటప్పుడు, చరిత్రను చొప్పించాలనుకున్నప్పుడు చరిత్రను గురించి వారి మనస్సులో ఉన్నది తరచుగా ఉదాహరణకు పెట్టుబడిదారీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నెరవేరని అంచనాల వంటి చాలా సంకుచితమైన భావన. ఏమైనప్పటికీ, మార్క్సిస్టు ఆలోచనలోని ‘చారిత్రిక విశిష్టత’ అనే భావనకు ప్రాథమికంగా విప్లవాత్మక విషయం ఉంది. ఉనికిలో ఉన్న సామాజిక నిర్మాణం, ప్రస్తుతం ఆధిపత్యంలో ఉన్న ఉత్పత్తి విధానం వాటి ముందు వాటి లాగానే తాత్కాలికమైనవని, గతించిపోతాయని అది సూచిస్తుంది.
సారాంశం..
ఈ వ్యాసంలో, సాధారణ సరకుల ఉత్పత్తికీ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సూత్రీకరించడం ద్వారా మనం ప్రారంభించాము. సాధారణ సరుకుల ఉత్పత్తిలో కాకుండా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో వ్యక్తుల శ్రమ శక్తి లేదా శ్రమ చేసే సామర్ధ్యమే సరుకుగా మారడంలోనే ఈ వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి వాణిజ్యీకరించబడుతున్న(ఉదాహరణకు, అంతర్జాతీయ మార్కెట్లలో సంఘటితం అవుతున్న) ఆర్ధిక వ్యవస్థలకు సంబంధించి, ఇంకా వాటి అంతర్గత ఉత్పత్తి సంబంధాలలో శ్రమ శక్తి స్వేచ్ఛగా సరుకుగా అమ్మబడడం, కొనబడడం, అంటే వేతన కార్మికుడు ఉనికిలో ఉండకపోవచ్చు.
సాధారణ ఉత్పత్తి విధానం, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాల స్వాభావిక సర్క్యూట్లను అంటే C– M– C’, M –C – M’లను వరుసగా మనం పరిశీలించాము. లక్ష్యం ఉపయోగ విలువ C – M – C’లో లాగా కాకుండా M –C – M’లో విలువ అదే రూపం, డబ్బు పరిణామాత్మక మార్పు లక్ష్యంగా ఉండడం మనం చూశాము.
M –C – M’ సర్క్యూట్ తదనుగుణంగా ‘తార్కికంగా పర్మితులు లేనిది’. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అంతర్గతంగా క్రియాశీలమైనదీ, స్వీయ విస్తరణ కలది. మూలధనం చారిత్రకంగా మొదట వ్యాపార, వడ్డీ వ్యాపార మూలధనంగా కనపడగా విలువ స్వీయ విస్తృతి సామాజిక స్థాయిలో జరగడానికి(M కంటే M’ పెరుగుదల ద్వారా సూచించబడింది) ఈ రూపాలు సరిపోవని కూడా మనం కనుగొన్నాము. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి మూలధనం సర్క్యూట్ ఆధిపత్య రూపం ఉత్పాదక మూలధనం LP M—C——P——C’—M’ MP.
ఇక్కడ పెట్టుబడిదారుడు శ్రమ శక్తినీ, ఉత్పత్తి సాధనాలనూ కొంటాడు. ఎక్కువ విలువ కలిగిన, దేనినైతే అమ్మటం ద్వారా విలువ స్వీయ విస్తృతి(M పై M’)ప్రభావితమయ్యిందో ఆ కొత్త సరుకును పొందుతాడు. సైద్ధాంతిక స్థాయిలో విలువ స్వీయ విస్తరణ ప్రక్రియను పరిశోధించడానికి, సరఫరా– డిమాండ్ల కలవర పెట్టే ప్రభావాలను, అలాగే చౌకగా కొని ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా సమానమైన మార్పిడి అవకాశాలను ప్రస్తుతానికి మనం పక్కన పెట్టాము.
ఈ ద్వితీయ దృగ్విషయం మొత్తం విలువను మాత్రమే పునఃపంపిణీ చేస్తుందని, కొత్త విలువను కలవడం కానీ లేదా సృష్టించడం కానీ చేయదని కూడా మనం ఎత్తిచూపాము. ఆ విధంగా సరుకులు వాటి విలువ వద్ద మారకం అవుతాయని ఊహించి, మనం అదనపు విలువ(M’ – M) మూలాన్ని పరిశీలించాము. దానిని సరుకు, విలువ మూలంగా అసాధారణ గుణాన్ని ‘దేని ఉపయోగ విలువ కలిగి ఉంటుందో, అందుచేత దేని నిజమైన వినియోగం తనంతట తానే శ్రమ స్వరూపమో, తత్ఫలితంగా విలువ సృష్టో’, ఆ శ్రమ శక్తిలో కనుగొనాలనే నిర్ణయానికి మనం వచ్చాము.
పది గంటల పనిదినం ఉదాహరణతో శ్రమ శక్తి విలువ 6 గంటలని మనం వాదనను వివరించాము. ఇతర సరుకుల విషయానికి భిన్నంగా శ్రమ శక్తి విలువ చారిత్రక, నైతిక మూలాలను కలిగి ఉంటుందని గుర్తించడం జరిగింది. ఏమైనప్పటికీ చాలా కనిష్టంగా అది కార్మికుడి శారీరక పునరుత్పత్తి కోసం సరిపోవాలి. మార్క్స్ అన్ని ఇతర భావనల లాగానే శ్రమ శక్తి విలువ సామాజిక సగటును సూచిస్తుందని స్పష్టంగా తప్పకుండా చెప్పాలి. కార్మికవర్గం అంటే కార్మికులు, వారి కుటుంబాల పునరుత్పత్తిని చేర్చడంగా దీనిని అర్ధం చేసుకోవాలి.
మూలధనం ఉనికికి కారణమైన చారిత్రక ముందస్తు పరిస్థితులను షరతులను పరిశీలించడం మనం కొనసాగించాము. మూలధనం – వేతన కార్మికుడి సంబంధాన్ని ప్రతి ఒక్కటీ తాత్కాలికమైనదీ. తద్వారా అధిగామించబడిన ఆర్ధిక రూపాల సుదీర్ఘ శ్రేణి చారిత్రక పరిణామని చూడడం జరిగింది. వారి శ్రమ శక్తి తప్ప మరేమీ లేని ప్రజల వర్గం అభివృద్ధి ఒక వైపునా, ఉత్పత్తి సాధనాలను, డబ్బులను(గుత్తాధిపత్యాన్ని) కలిగిఉన్న ప్రజల వర్గం మరొక వైపునా అభివృద్ధి చెందడం ముందస్తు షరతులుగా చూడబడ్డాయి.
ముగింపులో మిగులు విలువ ఉత్పత్తి ప్రక్రియను ఇంకా పరిశీలించ లేదని మనం తప్పకుండా ఎత్తిచూపాలి. మనం తరువాత దీనిని చెయ్యాలి. తార్కిక వాదన ద్వారా ఇక్కడ మనం అదనపు విలువ మూలాన్ని మాత్రమే ఎత్తిచూపాము. అదనపు విలువ ఉత్పత్తి ప్రక్రియను మనం పరిశీలించినప్పుడు, సామాజిక సంబంధంగా మూలధనం స్వభావం స్పష్టమౌతుంది.
వివరణలు– సూచనలు..
1. మార్క్స్ , పెట్టుబడి , సంపుటి 1, ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1962.
2. Ibid.
3. Ibid., p. 160.
4. Ibid., p. 163.
5. Ibid., p. 165.
6. Ibid.
సరుకులు వాటి విలువ వద్ద మార్పిడి అవుతాయనే ఊహ చేసింది ప్రతి రోజూ వాస్తవ ప్రపంచంలోని మార్కెట్లో పరిస్థితి(సుమారుగా అయినా) అది కావడం వలన కాదు. కానీ, విలువ సరుకుల మార్పిడి విలువ ప్రాథమిక నిర్ణయాధికారిగా పరిగణించడం వలన, ఈ విభాగం ప్రారంభంలో ఇచ్చిన ఇతర వాదనల కారణంగా అన్నది స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.
పెట్టుబడిదారీ అర్ధ శాస్త్రానికి చాలా ప్రియమైన సరఫరా– డిమాండు శక్తులు, వాస్తవ మారకపు నిష్పత్తులను అంటే ధరలను నిర్ణయించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. కానీ, వాటిది ద్వితేయ స్థానమే, సరుకుల మధ్య సంబంధాల ద్వారానే అదే నిర్ణయించబడుతుంది. (The forces of ‘supply and demand’, so dear to bourgeois economics, do play an important role in the determination of actual exchange ratios, that is, prices, but one that is secondary and itself determined by the value relations between commodities.) సరఫరా, డిమాండ్ల పాత్ర తరువాత స్పష్టం చేయబడుతుంది. ప్రత్యేకించి మార్క్స్ , పెట్టుబడి సంపుటి 1 పేజీ 160 ఫుట్ నోట్, సంపుటి 3 పేజీలు 177 – 200 చూడండి.
8. మార్క్స్ , పెట్టుబడి , సంపుటి 1,పేజీ 171.
9. Ibid.
10. అమెరికాలో, ఉదాహరణకు , బ్యూరో ఆఫ్ లేబర్ స్టేటిస్టిక్స్ నలుగురు ఉన్న కుటుంబానికి ‘తగుమాత్రమైన’ జీవన స్థాయి కోసం అవసరమైన వార్షిక ఆదాయాలను, అలాగే దారిద్య రేఖ ఆదాయ స్థాయిలను ప్రచురిస్తుంది.
11. మార్క్స్ , పెట్టుబడి , సంపుటి 1,పేజీ 170.
12. Ibid., p. 168.
13. Ibid., p. 169.
14. Ibid.
15. Ibid., p. 167.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది పడ్నాలుగవ భాగం, పదమూడవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.