
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన ఆవిర్భావం
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం(CMP) మార్క్స్ విశ్లేషణ సరుకులతో ప్రారంభమౌతుంది. ఏమైనప్పటికీ సరుకుల ఉత్పత్తి పెట్టుబడిదారీ ఉత్పత్తి కన్నా మరింత సాధారణ వర్గానికి చెందినది. వాస్తవానికి తరువాతిది సరుకుల ఉత్పత్తి చారిత్రిక పరిణామం. సాధారణ సరుకుల ఉత్పత్తికీ, పెట్టుబడిదారీ (సరకుల) ఉత్పత్తికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం ద్వారా ఎవరైనా స్పష్టంగా ఈ విషయాన్ని బయటకు తీసుకురావచ్చు.
సాధారణ సరకుల ఉత్పత్తి అంటే, (i)వ్యక్తిగత ఉత్పత్తిదారులు వారి స్వంత ఉత్పత్తి సాధనాలను కలిగి ఉండే (ii) వారు తమ ఉత్పత్తులను మారకం కొరకు మార్కెట్‌కు తెచ్చే (iii) వ్యక్తి ‘శ్రమ సామర్ధ్యాన్ని’ లేదా శ్రమ శక్తిని కొనుగోలు లేదా అమ్మకం లేని ఒక సామాజిక ఉత్పత్తి వ్యవస్థ. ఆవిధంగా శ్రమ శక్తి ఇప్పటికీ తానే సరుకుగా మారనందున సరుకుల ఉత్పత్తిలో మనకు సంపూర్ణ, సాధారణీకరించిన అభివృద్ధి లేదు.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని సాధారణ సరకుల ఉత్తి విధానం నుంచి వేరుగా గుర్తించే కీలకమైన లక్షణం ఖచ్చితంగా శ్రమ శక్తి కొనుగోలు అమ్మకమే. సాధారణ సరుకుల ఉత్పత్తిలో ఈ లక్షణం స్పష్టంగా లేదు.
చారిత్రకంగా, భూస్వామ్య సమాజ గర్భంలో సాధారణ వస్తూత్పత్తి అభివృద్ధిని అనుసరించి సీఎంపీ ఆధిపత్యానికి ఎదిగింది. సాధారణ సరుకుల ఉత్పత్తి ప్రధాన కార్యకలాపం వస్తువుల ఉత్పత్తి, సరుకులుగా వాటి మారకం. ఆ విధంగా సాధారణ సరుకుల ఉత్పత్తి, శ్రమ శక్తిని మినహాయించి ఉత్పత్తుల స్థిరమైన అమ్మకాన్ని, కొనుగోలును సూచిస్తుంది. సరుకుల నిరంతర మార్పిడిని ప్రభావితం చేయడానికి(సర్క్యులేషన్) పంపిణీ సాధారణ మాధ్యమ జోక్యం స్పష్టంగా అవసరం. అందువలన సాధారణ వస్తువుల ఉత్పత్తి డబ్బు, డబ్బు సంబంధాల గణనీయమైన అభివృద్ధి పుట్టుకొస్తుంది.
అంతేకాకుండా క్రమంగా, సాధారణ సరుకుల ఉత్పత్తిలో ఉత్పత్తిదారుల సాధారణ లావాదేవీలను ఎవరైనా పరిగణనలోకి తీసుకుంటే (i) ఉత్పత్తిదారుడి చేత సరకుల అమ్మకం (ii)- (i) ఆదాయాన్ని ఉపయోగించి మరొక సరుకు కొనుగోలును ఎవరైనా గమనిస్తారు. C అమ్మిన సరుకు, M ఆ విధంగా పొందిన డబ్బులు కాగా, మొదటి దశను C – Mగా సూచించవచ్చు. మొదటి దశలో సంపాదించిన డబ్బులు Mతో కొన్న కొత్త సరుకు C కాగా రెండవ దశను M – C గా సూచించవచ్చు. ఆవిధంగా ఒక రైతు ధాన్యాన్ని అమ్మగా వచ్చిన డబ్బులను బట్టలు కొనడానికి ఉపయోగించవచ్చు. సాధారణ వస్తువుల ఉత్పత్తి సాధారణ లావాదేవీలను ఆవిధంగా C– M – Cగా సూచించవచ్చు.
సాధారణ సరకుల ఉత్పత్తి- పెట్టుబడిదారీ ఉత్పత్తి..
ఈ సరుకుల సర్క్యూట్ C– M– Cకు, మనకు ఆసక్తి కలిగించే కొన్ని స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంది. సర్క్యూట్ లక్ష్యం, సరుకు Cకు చెందిన ఒక రకమైన వినియోగ విలువను సరుకు C మరొక వినిమయ విలువతో మార్పిడి చేయడం అన్నది స్పష్టంగా ఉన్నది. డబ్బు ఇక్కడ పూర్తిగా మధ్యవర్తిత్వ పాత్ర నిర్వహిస్తుంది. సర్క్యూట్ C – M – C లక్ష్యం వినియోగ విలువలను మార్చడం. ఆవిధంగా వినియోగం లక్ష్యం, తుది ఫలితం వినియోగ విలువలోని గుణాత్మక మార్పులో మార్పు. ఒక విడి సర్క్యూట్ C – M – C జీవితం కార్యాచరణ ప్రయోజనంచే పరిమితం చేయబడింది. అంటే మనం ప్రారంభించిన దాని నుండి భిన్నమైన వినియోగం కోసం, వినియోగ విలువను లేదా వినియోగ విలువల సమూహంను పొందడం.
పెట్టుబడిదారీ ఉత్పత్తి, సాధారణ సరుకుల ఉత్పత్తి నుండి దాని లక్షణ సర్క్యూట్లో చాలా తీవ్రంగా వేరు చేయబడింది. సాధారణ సరుకుల ఉత్పత్తి సాధారణ సర్క్యూట్ C– అయితే CMP సాధారణ సర్క్యూట్ M – C – M. పెట్టుబడిదారుడు డబ్బు Mతో ప్రారంభిస్తాడు. మరలా దానిని తిరిగి డబ్బులు M మార్చడానికే దానిని సరుకు Cగా మారుస్తాడు. ఈ చర్య డబ్బుతో ప్రారంభమై డబ్బుతో ముగుస్తుంది. ఆ విధంగా ఈ సర్క్యూట్ ఫలితంగా వినియోగ విలువల స్వభావంలో గుణాత్మక మార్పు ఏమీ లేదు. దీంతో ఈ సర్క్యూట్ లక్ష్యం వినిమయం కాదు. వాస్తవానికి ప్రారంభ కొనుగోలుదారుడు చివరకు అందుకున్న డబ్బు M కొనుగోలుదారుడు ప్రారంభించిన డబ్బు M కన్నా ఎక్కువ కాకపొతే ఈ సర్క్యూట్‌కు ఎటువంటి అర్ధం లేదు.
గుణాత్మక మార్పు లేనప్పుడు సర్క్యూట్ M – C – Mకు ప్రేరణ శక్తి M కంటే M పరిమాణాత్మక పెరుగుదలకు గల అవకాశం నుండి మాత్రమే వస్తుంది. ద్రవ్య లాభ నిరీక్షణే M – C – Mకు అంతర్లీనమైన ప్రేరణను(డైనమిక్)అందిస్తుంది. డబ్బు M, డబ్బు Mను అధిగమించడాన్ని తప్పకుండా ఎదురు చూడాలి.
C – M – Cకు M – C – Mమధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం మొదటిది వినిమయం లేదా వినిమయ విలువ కాగా తరువాతిది ప్రారంభ M విలువ Mకు పెరగడం. మొదటి సర్క్యూట్ C– M – C వినియోగ లక్ష్యం ద్వారా పరిమితం చేయబడగా తరువాతి సర్క్యూట్ పరిణామాత్మక పెరుగుదలపైనే ఆధారపడి ఉంటుంది. కావున దానికి ఏ తార్కిక పరిమితులూ లేవు. తుదకు ప్రారంభ 100 రూపాయలపైన 10 రూపాయల లాభం పొందగలిగితే ఎవరైనా ఈ కొత్త మొత్తం 110 రూపాయలను అదే పద్దతిలో 121 రూపాయలుగా చేయడానికి, అలాగే ఎందుకు ఉపయోగించ కూడదు ఆ విధంగా ప్రారంభ విలువ స్వీయ విస్తరణ ఆధాపడిన సర్క్యూట్ M – C – M ‘తార్కికంగా పరిమితులు లేనిది’.
మరొక విధంగా చెబితే, సామాజిక ఉత్పత్తి లక్ష్యం వినిమయ విలువలు(వినిమయం) అనే వాస్తవం సాధారణ సరుకుల ఉత్పత్తికి క్రియాశీలక పరిమితులకు లోబడితే విలువ స్వీయ విస్తరణ అధారంగా ఉన్న CMP అంతర్లీనంగా చలనశీలమైనదీ. స్వీయ విస్తరణ పద్దతి.
CMP కింద, M– C– M నిర్ణయాత్మక సర్క్యూట్ కాగా, C– M– C సర్క్యూట్ ఏవిధంగానూ అంతర్ధానం కాదు. ముఖ్యంగా, జనాభాలో అత్యధికులు బ్రతకటం కోసం తమ శ్రమ శక్తిని అమ్ముకోవడానికి C– M– C సర్క్యూట్లో ఖచ్చితంగా నిమగ్నమై ఉంటుంది. వారు తమ శ్రమ శక్తి Cని అమ్ముతారు. ఆ విధంగా సంపాదించిన డబ్బు Mతో జీవితావసరాలు C’ని కొంటారు. పెట్టుబడిదారీ వర్గానికీ, CMP చలనశీలతకూ సందర్భోచితమైన సర్క్యూట్ M– C– M’. C– M– C’ని సరకుల సర్క్యూట్ అనీ, M– C– M’ మూలధన సర్క్యూట్ అనీ మనం పిలవవచ్చు.
మూలధనం వలయాలు(సర్క్యూట్స్)..
M– C– M’లేదా ప్రారంభ విలువ విస్తరణ అభివృద్ధి చెందడం మూలధన సర్క్యూట్ సారంలో ఏర్పడి ఉంది. ఈ సారాన్ని ప్రభావితం చేసే తార్కిక, చారిత్రక విధానాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు తార్కికంగా M నుండి M’ వరకు లాభాన్ని సరుకుని చౌకగా కొని హెచ్చు ధరకు అమ్మడం ద్వారా పొందవచ్చు. చారిత్రకంగా ఇది వ్యాపారానికి లేదా వ్యాపార మూలధనానికి చెంది ఉంటుంది. వడ్డీతో పాటు(అప్పుఇవ్వడం) వాస్తవానికి ఇది చారిత్రకంగా మూలధనం మొదటగా కనిపించే రూపం. వడ్డీ మూలధనంలో, కొనుగోలు అమ్మకాల భారం కూడా వదిలివేయబడుతుంది, M– C– M’ బదులు M– M’ మనకు ఉంది.
వడ్డీ– వ్యాపార మూలధనాలు, చరిత్రలో మూలధనం అగబడడం ప్రారంభ రూపాలు కాగా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో అవి ఏవిధంగానూ చాలా ముఖ్యమైనవి కావు. CMPకి చాలా ముఖ్యమైనది(పారిశ్రామిక) ఉత్పాదక మూలధన సర్క్యూట్. ఈ సర్క్యూట్ ఈ క్రింది దశలను కలిగి ఉంటుంది.
పెట్టుబడిదారుడు డబ్బుతో సరుకులను కొంటాడు. దీనిని M– C ద్వారా సూచించవచ్చు.
మొదటి దశలో కొనుగోలు చేసిన సరకులతో పెట్టుబడిదారుడు ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తాడు. తుది ఫలితం వేరే సరుకు C’. ఉత్పత్తి ప్రక్రియకు P ప్రాతినిధ్యం వహించగా ఈ దశను C– P– C’గా సూచించవచ్చు.
చివరగా, C’ను M’కు సమానమైన విలువ డబ్బును తిరిగి పొందడం కోసం పెట్టుబడిదారుడు మార్కెట్లో అమ్ముతాడు.
రెండవ దశ నిర్వహించడానికి కేవలం మొదటి దశలోని ఏ సరుకుల సమూహాన్నైనా కొనడు. వాస్తవానికి ఉత్పత్తి సాధనాలు MP, శ్రమ శక్తి LPలను అతను కొంటాడు. పనిలోకి తీసుకున్న కార్మికుల చేత తాను కొన్న ఉత్పత్తి సాధనాలతో పనిచేయించి కొత్త సరకు C’ను ఉత్పత్తి చేస్తాడు. ఆ విధంగా ఉత్పాదక మూలధన సర్క్యూట్‌ను ఈ విధంగా మనం వ్రాయచ్చు– LPM –C –P –C’ – M MP’
దాని సర్క్యూట్ సమయంలో, ఒక సమయంలో ఉత్పాదక మూలధనం డబ్బుగానూ మరొక సమయంలో సరకులుగానూ కనపడంలో దీనిని చూడవచ్చు. ఈ విషయం సాధారణమైనది, ఇది మూలధన సర్క్యూట్ M– C– M’కు వర్తిస్తుంది. మార్క్స్ వివరించిన విధంగా సర్క్యులేషన్ M– C– M’లో సరకులు, డబ్బులు రెండూ కూడా విలువ ఉనికి భిన్న రీతులను, డబ్బు దాని సాధారణ రీతిని, సరుకులు వాటి ప్రత్యేకమైన రీతిలో లేదా మారువేషంను మాత్రమే సూచిస్తాయి. లేదా మరలా ‘మూలధనం డబ్బు’ మూలధనం సరుకులు. నిజానికి ఇక్కడ విలువ క్రియాశీల కారకం(అంశం). అసలు విలువ ఆకస్మికంగా విస్తరిస్తుంది.’
M–C–M’ వలయంలోని వైరుధ్యం..
అధికారికంగా చెప్పాలంటే, సర్క్యూట్ M– C– Mను C– M– C క్రమాన్ని తిరగేసి వ్రాయడం ద్వారా పొందవచ్చు. తరువాతిది అమ్మకం C– Mతో ప్రారంభమై కొనుగోలు M– Cతో ముగియగా మొదటిది కొనుగోలు M– Cతో ప్రారంభమై అమ్మకం C– Mతో ముగుస్తుంది. ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఈ విధమైన పూర్తిగా అధికారిక మార్పు M– C– M పదునైన గుణాత్మక వ్యత్యాసానికి అనగా అదనపు విలువలోని కదలిక నుండి వచ్చిన ఫలితం అంటే M పైన M పెరుగుదలకు ఎలా దారితీస్తుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది పదకొండవ భాగం, పదవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.