పైన పేర్కొన్న సమస్యల సంక్లిష్టత – స్వదేశం విషయంలో చూస్తే(closer home), వెనుకబడిన పెట్టుబడిదారీ దేశాలలో ఆర్ధిక, సామాజిక అభివృద్ధి సమస్యలు; అవకాశాలను మార్క్సిస్టు పద్ధతి, దృక్కోణంపరంగా మాత్రమే అర్ధం చేసుకోగలం. ఈ పద్దతి, దృక్కోణాలను కేవలం మార్క్సిస్టు ఆర్ధిక సిద్ధాంతంలా అర్ధం చేసుకోకూడదు.
ముఖ్యంగా సామాజిక విశ్లేషణ సైద్ధాంతిక, రాజకీయ స్థాయిలు, ఎంగెల్స్ చెప్పినట్లు రెండోది అంతిమంగా నిర్ణయించే అంశం. అయినప్పటికీ, ప్రత్యేకంగా ఈ స్థాయిలు ఆర్ధిక స్థాయిల నుంచి గణనీయమైన స్వాతంత్రాన్ని పొందే సామ్రాజ్యవాద కాలంలో ముఖ్యమైనవి. మన వ్యాసాల సరళిలో మనం ఈ స్థాయిల చర్చకు మాత్రమే వెళ్ళలేదు. కానీ పెట్టుబడిదారీ ఆర్ధిక విధానంపై మార్క్స్ ఆర్ధిక విశ్లేషణ రూపురేఖలపై ప్రాథమిక వ్యాఖ్యానాన్ని కూడా అందించాము.
ప్రత్యేకించి మన నిర్దిష్ట రాజకీయ, చారిత్రక, సామాజిక సందర్భానికి ముఖ్యమైన సమస్యలపై, మరింత అధ్యయనం చేయడానికి నేపథ్యాన్ని ప్రస్తుత ఈ వ్యాసాలు అందించాయని ఆశిస్తున్నాము.
గమనికలు– ప్రస్తావనలు..
కారల్ మార్క్స్ కేపిటల్ వాల్. I, ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1967, పేజీ 575’ ibid., pp. 580-81
ఈ సంఘటనల మలుపు తరచుగా నెరవేర్చుకోవడంలో ఇబ్బందులతో పాటు తక్కువ వినియోగ ధోరణి వల్ల కూడా ఉంటుంది. అయినా సిద్ధాంతపరంగా ఈ ధోరణులలో ప్రతిదీ అలాగే అసమానత కూడా విడిగా సంక్షోభానికి దోహదం చేస్తాయి. వాస్తవ ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభం ఈ మూడు వైరుధ్యాల సంయుక్త కార్యాచరణ తిరుగులేని ఫలితం.
కారల్ మార్క్స్ కేపిటల్ వాల్. III, ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1967, పేజీ 253 Ibid., p. 255
‘వేగ వృద్ధి క్రమం సూత్రం’ సుమారు ఈవిధంగా వివరించవచ్చు. ఉదాహరణకు ఏటా ఒక రూపాయి విలువైన ఉత్పత్తిని పెంచడానికి 3 రూపాయల పెట్టుబడి అవుతుందని ఊహించుకుందాం. అప్పుడు తుది ఉత్పత్తికి డిమాండులో మూడురెట్ల పెరుగుదలకు సమానంగా పెట్టుబడిని పెంచుతుంది.
అయితే ఇది ఒక్కసారే జరిగే పెట్టుబడిలో పెరుగుదల, ఇంకా పెట్టుబడిలో పెట్టిన పరికరాలు మానికైన పాత్రగలవి. అందుచేత తుది ఉత్పత్తికి డిమాండు మరింత పెరగక పొతే, పెట్టుబడి స్థాయి తగ్గుతుంది. స్థిర పరికరాలలో పెట్టుబడికీ, తుది ఉత్పత్తికీ మధ్య సంబంధం(పాక్షికంగా సాంకేతికంగానూ, పాక్షికంగా ధరలు, వేతనాలు, తదితరాలపై పాక్షికంగానూ నిర్ణయించబడుతుంది), పరికరాల మన్నికతో కలిపి, పెట్టుబడిలో, తద్వారా మొత్తం ఆర్ధిక వ్యవస్థలో హెచ్చు తగ్గులకు కారణమౌతుంది.
మార్క్స్ కేపిటల్ వాల్. III, పేజీ 100
Ibid., p. 436.
Ibid.
Ibid., pp. 438–39, వక్కాణింపు అసలు ప్రతిలోనిది.
Ibid., p. 441.
ఉపయోగకరమైన సూచన A. స్తాడ్నిచెంకో పెట్టుబడిదారీ విధానంలో ద్రవ్య సంక్షోభం. ప్రోగ్రెసివ్ పబ్లిషర్స్, 1975. (A. Stadnichenko, The Monetary Crisis of Capitalism, Progress Publishers, 1975.)
13 V.I. లెనిన్ , సామ్రాజ్యవాదం , ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1933పేజీ. 81.
14 సమాచారం N. ఇనోజెంత్సేవ్ రచన ‘సమకాలీన పెట్టుబడిదారీ విధానం: నూతన పరిణామాలు, వైరుధ్యాలు’ ప్రోగ్రెస్ పబ్లిషర్స్, 1974 నుంచి. ఈ పుస్తకం ఉపయోగకరమైన మూలం. (The data is from N. Inozemtsev, Contemporary Capitalism: New Developments and Contradictions, Progress Publishers, 1974. The book is a useful reference.)
15 Ibid. 1970లలోని సమకాలీన పెట్టుబడిదారీ విధానం 161.(Contemporary Capitalism in the 1970s 161)
16 ఈ విషయాలపై సమాచారానికి, చర్చకు N. ఇనోజెంత్సేవ్ రచన ‘సమకాలీన పెట్టుబడిదారీ విధానం’ చదవండి. (For information and discussion of these points, see N. Inozemtsev, Contemporary Capitalism.)
17 అమెరికా అర్ధశాస్త్రవేత్త R. వెర్నాన్, సోవెరేజ్ఞ్తి ఎట్ బె, న్యూయార్క్, 1971 రచనని ఇక్కడ ఉదహరించవచ్చు. ఇంకా ఆసక్తిని కలిగించేవి E. మండేల్ యూరప్ వర్సెస్ అమెరికా, మంత్లీ రివ్యూ ప్రెస్, 1970– లేట్ పెట్టుబడిదారీ విధానం, న్యూ లెఫ్ట్ రివ్యూ, 1975. (The work of the American economist, R. Vernon, Sovereignty at Bay, New York, 1971, may be cited here. Also of interest are E. Mandel, Europe versus America, Monthly Review Press, 1970, and Late Capitalism, New Left Review, 1975.)
18 N. ఇనోజెంత్సేవ్ రచన ‘సమకాలీన పెట్టుబడిదారీ విధానం(Inozemtsev, Contemporary Capitalism.)
19 పెట్టుబడిదారీ దేశాలలో అధిక శాతం దేశాలైన వెనుకబడిన పెట్టుబడిదారీ దేశాలలో రాజకీయ, ఆర్ధిక, సైద్ధాంతిక సంక్షోభాలు ప్రత్యేకించి తీవ్రంగా ఉంటాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థలోకీ, దాని నిర్దిష్ట అంతర్జాతీయ కార్మిక విభజనలోకీ ఈ విధంగా అనుసంధానం చేయబడిన ఈ దేశాల ఆర్ధిక వ్యవస్థలపై ఆధునిక పెట్టుబడిదారీ దేశాలలో ఏమి జరిగినా వాటి ప్రభావం చాలా ఎక్కువ పడుతుంది. ఈ నిర్దిష్ట అర్ధంలో వాటిని ‘ఆధారిత పెట్టుబడిదారీ దేశాలు’ అని పిలవవచ్చు.
కేవలం ఆర్ధిక స్థాయిలోనే కాక సైద్ధాంతిక, రాజకీయ, ప్రత్యేకించి సాంస్కృతిక స్థాయిలలో ఈ ఆధారపడడం పనిచేస్తుంది. కానీ ఈ ఆధారపడడాన్ని సాపేక్ష అర్ధంలో అర్ధం చేసుకోవాలి కానీ సంపూర్ణ కోణంలో కాదు. ఈ సమాజాల గతిశీలతను నిర్ణయించడంలో ఈ సమాజాల అంతర్గత శక్తులకు ప్రాదాన్యత ఉన్నదని చెప్పాలి.
అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలపై వారి ఆధారపడడం నేరుగా ఆర్ధిక రంగంలో పనిచేస్తుంది, పరోక్షంగా అంతర్గత వర్గ పొందికలను, వర్గశక్తులను మార్చడానికి చేసే ప్రయత్నాల ద్వారా పనిచేస్తుంది. సామ్రాజ్యవాదం, వెనుకబాటుతనాల మధ్య సంబంధంపై కొన్ని(లేకపోతే) ఉపయోగకరమైన సూచనలు సంపూర్ణ అర్ధంలో ఆధారపడడాన్ని చూసే తప్పును చేస్తున్నాయి. ఉదాహరణకు సమీర్ అమీన్ రచన ప్రపంచ స్థాయిలో సంచితం (Accumulation on a World Scale) మంత్లీ రివ్యూ ప్రెస్, 1 & 2 సంపుటాలు, 1976 లను చూడండి.
20 (స్వాతంత్రం వచ్చే వరకు) భారత ఆర్ధిక వ్యవస్థపై ఒక ఉపయోగకరమైన పరిచయం, రజనీ పామి దత్, నేటి భారతం, మనీషా గ్రంధాలయం, 1948. స్వాతంత్య్రానంతర కాలం కొరకు C బెతెల్ హేమ్ రచన ఇండియా ఇండిపెండెంట్, మంత్లీ రివ్యూ ప్రెస్,1968 ఒక మంచి పరిచయం. (A useful introduction to the Indian economy (up to independence) is RP Dutt, India Today, Manisha Granthalaya,1948. For the post-independence period, the best introduction is C. Bettelheim, India Independent, Monthly Review Press, 1968.)
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 63వ భాగం, 62వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
