లాభాల రేటు పడిపోయే ధోరణికి వ్యతిరేకంగా పనిచేసే అనేక శక్తులు ఉన్నాయని మార్క్స్ గుర్తించాడు. ప్రత్యేకించి ఈ వ్యతిరేక శక్తులే సాధారణ సూత్ర ప్రభావాన్ని అధిగమించి, రద్దు చేస్తాయి. అంతేకాకుండా, ఇది కేవలం ధోరణి లక్షణాన్ని తెలియజేస్తుంది.
శ్రమ శక్తి విలువ కన్నా తక్కువగా వేతనాలు ఉండేటట్లు అవి ప్రయత్నిస్తాయి(ఇందులో వాటికీ నిరుద్యోగ సైన్యం సహాయపడుతుంది). ఇంకా, ఈ కూడబెట్టడం (సంచితం) తీసుకువచ్చిన కార్మికుల ఉత్పాదక శక్తి పెరుగుదల నిరుద్యోగ శ్రేణులను అందువలన నిరుద్యోగ సైన్యాన్ని పెంచుతుంది. ఇది మరింత అస్థిర మూలధనాన్ని, తక్కువగా స్థిర మూలధనాన్ని ఉపయోగించే ఉత్పత్తి పద్ధతులు నిలకడగా ఉండడానికి అనుమతిస్తుంది.
అక్కడ ప్రత్యేకించి రెండు ముఖ్యమైన(ఎదుర్కొనే), అదనపు వ్యతిరేక శక్తులు ఉన్నాయి. పెట్టుబడిదారీ కూడబెట్టడంలో(సంచితంలో) అంతర్లీనంగా ఇమిడిఉన్న యాంత్రీకరణ స్థిర మూలధన పెరుగుదలను సూచిస్తుంది. కార్మికుల ఉత్పాదక శక్తి కూడా ఉత్పత్తి సాధనాల ఉత్పత్తిని పెంచుతుంది. అస్థిర పెట్టుబడి ఒక యూనిట్‌కు యంత్రాలనూ, ఇతర ఉత్పత్తి సాధనాలనూ చాలా ఎక్కువగా ఉపయోగించినప్పటికీ, స్థిర పెట్టుబడిలోని ఇతర అంశాల విలువ దామాషా ప్రకారం పెరగదు. అందుచేత, C/Vలో వాస్తవ పెరుగుదల మొదటి చూపులో కనుపించిన దానికన్నా చాలా తక్కువగా ఉంటుంది.
కార్మికులు తమ ఉత్పత్తిలో తెచ్చిన ఉత్పాదక శక్తి పెరుగుదల వలన స్థిర పెట్టుబడి అంశాలు చౌక కావడం, ఆవిధంగా లాభాల రేటు పతనానికి చిగురులు వేస్తుంది.
చివరగా, అక్కడ విదేశీ వాణిజ్యం ఉంది. ముఖ్యమైన ముడి సరుకులను(యంత్రాలను కూడా) మరింత చౌకగా పొందడానికి విదేశీ వాణిజ్యం పెట్టుబడిదారులకు తోడ్పడుతుంది. ఆ విధంగా స్థిర పెట్టుబడిని చౌకగా మార్చుతుంది. ఏమైనప్పటికీ పతనమౌతున్న లాభాల రేటు, శ్రామిక శక్తి పునరుత్పత్తిలోకి చేరుతున్న సరుకులను దిగుమతి చేసుకోవడానికి తరచుగా తోడ్పడుతుంది. ఆ విధంగా అస్థిర పెట్టుబడిని చౌకంగా మార్చడం ద్వారా విదేశీ వాణిజ్యం విరుద్ధమైన రీతిలో పనిచేస్తుంది.
శ్రమ శక్తి విలువ తగ్గిపోవడం అదనపు విలువ రేటులో పెరుగుదలను సూచిస్తూ ఉండగా, C/V విలువ పెరగడాన్ని కూడా ఇది సూచిస్తున్నది. దీంతో, విదేశీ వాణిజ్యం లాభాల రేటు పతనావస్థ ధోరణికి వ్యతిరేకంగా పనిచేసినా, లాభాల రేటుపై దాని ప్రభావాన్నిగురించి స్పష్టంగా ఉండడం(వర్గీకరించడం) కష్టం.
లాభాల రేటు పతనం- ఆర్ధిక సంక్షోభాలు..
లాభాల రేటు పతనం ధోరణిని పెట్టుబడిదారీ సంక్షోభాలకు ఒక ముఖ్యమైన వనరుగా మార్క్స్ పరిగణించాడు. ఇక్కడ ఉన్న ఖచ్చితమైన సంబంధాన్ని చూడడానికి, ఈ ధోరణి పనిచేయవలసిన విధానాన్ని అర్ధం చేసుకోవాలి. ముఖ్యంగా, నిర్దిష్ట పరిస్థితులలో లాభాల రేటు క్షీణతకు దారి తీసే ఇతర శక్తుల నుంచి పైన చర్చించిన ధోరణిని వేరు చేయాలి.
మార్క్స్ సుదీర్ఘంగా ఉదాహరించిన అటువంటి పరిస్థితుల సమితి(సెట్), నిరుద్యోగ సైన్యం తరుగుదల లేదా క్షీణత తీసుకువచ్చిన, వేతనాల పెరుగుదల వలన పెట్టుబడిదారీ విస్తరణ సందర్భంలో లాభదాయకత క్షీణించడం. దీంతో మార్క్స్ ఆర్ధిక విశ్లేషణను వివరణను మనం ముగించే తరువాయి అధ్యాయంలో వీటిని వివరంగా చర్చిద్దాం.
గమనికలు- ప్రస్తావనలు..
దీనిని చేయడంలో విఫలం అవడం ద్వారా, ప్రతి కొనుగోలూ కూడా అమ్మకమే అనే తప్పుడు అవగాహన ద్వారా సామాజిక సరఫరా మొత్తం, సామాజిక డిమాండుకు సమానం కావాలని మార్క్స్ కాలం నాటి బూర్జువా అర్ధశాస్త్రవేత్తలు తప్పుగా వాదిస్తూ , అధికోత్పత్తి సంక్షోభాల అవకాశాన్ని నిరాకరిస్తున్నారు.
పెట్టుబడిదారీ అభివృద్ధి సిద్ధాంతం, మంత్లీ రివ్యూ ప్రెస్- 1956, అధ్యాయం VIIIలోని స్వీజీ వివరణాత్మక చర్చను చదవండి. ఇంకా VI లెనిన్ ‘ఆన్ ద సో కాల్డ్ మార్కెట్ క్వశ్చన్ ?’ సంకలిత రచనలు, సంపుటి 1, ప్రోగ్రెసివ్ ప్రెస్ పబ్లిషర్లు, 1968 కూడా చూడండి.’
పెట్టుబడిదారీ విధానం నిర్దిష్ట చలన సూత్రాలకు లోబడి ఉండాలని మార్క్సిజం గుర్తిస్తున్నందున, అరాచత్వం అంటే ఏ క్రమపద్దతీ లేకపోవడం లేదా గందరగోళమని మనం అనుకోవడం లేదు. ఈ షరతుల వివరణ కోసం స్వీజీ పెట్టుబడిదారీ అభివృద్ధి సిద్ధాంతం, అధ్యాయం Xలో చూడండి. షరతుల మూలాలను తెలుసుకునే పద్దతి చాలా సులభం. ప్రతి విభాగంలోని అదనపు విలువను మూడు భాగాలుగా విభజించండి. పెట్టుబడిదారులచే అనుత్పాదకంగా వినియోగించినది(Scl- Scll), మరొక భాగం స్థిర పెట్టుబడిలో వెచ్చించినది(Scal, Scall); మూడవది అస్థిర పెట్టుబడిలో వెచ్చించినది(Savl- Savll). ఇప్పుడు 1, 2 విభాగాల మొత్తం ఉత్పతతులు
YI = CI + VI + SI
YII = CII + VII + SII
స్థిర పెట్టుబడి మొత్తం డిమాండు = CI + CII + SacI + SacII
స్పష్టంగా, సమతుల్యత కోసం ఇది YIతో సమానంగా ఉండాలి. అందువలన ఇప్పుడు మనకు
CI + VI + SI = CI + CII + SacI + SacII
SI = ScI + SacI + SavIని గుర్తుంచుకొని CIని రెండువైపులా రద్దు చేస్తే, మనకు VI + ScI + SacI + SavI = CII + SacI + SacII మిగిలింది.
ఇది సులభతరం చేయబడి: VI + ScI + SavI = CII + SacII
పెట్టుబడిదారీ అభివృద్ధి సిద్ధాంతంలో శిథిలమౌతున్న పెట్టుబడిదారీ వినియోగాన్ని మరింత మెరుగుదల చేసి రెండు భాగాలుగా ఒక అసలు భాగం, తదుపరి పెరుగుదలగా స్వీజీ చేర్చాడు.
ఉదాహరణకు కొన్ని ప్రధాన పరిశ్రమలు, స్టీలు అనుకుందాం; లాభదాయక ధరకు ఆమ్ముకోగలిగిన దానికన్నా ఎక్కువ ఉత్పత్తి చేసినప్పుడు ఒక అసమానత సంక్షోభం తలెత్తవచ్చు. ఒక పరిశ్రమలోని అధికోత్పత్తి వలన కలిగిన పాక్షిక సంక్షోభం, సాధారణ పారిశ్రామిక సంక్షోభంగా చుట్టుముట్టవచ్చు. స్టీలు అమ్మకం సరిగా లేకపోవడంతో, ఉత్పత్తిదారులు ఉత్పత్తికి కోత పెడతారు. ఆవిధంగా బొగ్గుకు, ఇనుప ఖనిజానికీ తమ డిమాండును తగ్గిస్తారు.
బొగ్గు ఉత్పత్తిదారులు ఉత్పత్తికి కోతబెట్టి కార్మికులను తొలగిస్తారు(లే ఆఫ్ చేస్తారు). అదే విధంగా ఇనుప ఖనిజ పరిశ్రమలో కూడా జరుగుతుంది.
ఈ ప్రధాన పరిశ్రమలలోని కార్మికులు పని నుంచి తొలగించబడడంతో, వినిమయ వస్తువుల డిమాండు కూడా తగ్గుతుంది, ఇది ఇలా కొనసాగుతుంది. ఈ విధంగా ఆర్ధిక వ్యవస్థలోని ఒక ముఖ్యమైన విభాగంలో వచ్చిన ఒక పెద్ద ఆటంకం సాధారణ అధికోత్పత్తి సంక్షోభానికి లేదా ఆర్ధిక వ్యవస్థలో అసమతుల్యతకు దారితీయవచ్చు. అసమానత సాధారణ దృగ్విషయం కాగా మార్క్స్ రెండు విభాగాల పథకం ఈ వ్యాసంలో తరువాత చర్చించిన ప్రాథమిక కారణాలవల్ల రావచ్చని ప్రత్యేకించి ఊహించే, వ్యూహాత్మకమైన అసమానతపై దృష్టి పెడుతుంది.
లెనిన్ రచన(‘ఆన్ ద సో కాల్డ్ మార్కెట్ క్వశ్చన్’) ‘మార్కెట్ సమస్య అనే పిలువబడే దానిపై’ చూడండి. అలాగే లెనిన్ రచన ‘రష్యాలో పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి’ సంకలిత రచనలు సంపుటి 3, ప్రోగ్రెసివ్ పబ్లిషర్స్, 1972, ప్రత్యేకించి అధ్యాయం 1 చూడండి.
ఇక్కడ సమర్పించిన వాదనను స్వీజీ ‘పెట్టుబడిదారీ అభివృద్ధి సిద్ధాంతం’ నుంచి స్వీకరించడం అయ్యింది. గుర్తించిన లోపాలు ఉన్నప్పటికీ రోజా లగ్జెంబర్గ్ రచన(‘ద అక్యుమిలేషన్ ఆఫ్ కేపిటల్’) పెట్టుబడి సంచితం చాలా విలువైనది చాలా ఉన్నది. మంత్లీ రివ్యూ ప్రెస్, 1968. ఆమె విప్లవ ప్రామాణికతపై ఎటువంటి అనుమానం లేదు.
పూర్తి చర్చ కోసం స్వీజీ రచన ‘పెట్టుబడిదారీ అభివృద్ధి సిద్ధాంతం’లోని అధ్యాయాలు X, XIలు చూడండి.
Ibid, footnote on p.168
కార్ల్ మార్క్స్, పెట్టుబడి, సంపుటి II పేజీ 411
K. Marx, Capital, Vol. III, pp. 304–05, వక్కాణింపు చేర్చడమైనది.
Ibid., p. 244.
Ibid., p. 484.
లెనిన్ సంకలిత రచనలు, సంపుటి 3, మాస్కో, 1972, పేజీ 56.
ఫ్రెడరిక్ ఎంగెల్స్ యాంటీ డ్యూరింగ్, ప్రోగ్రెస్ పబ్లిషర్స్, 1969, పేజీ 315.
లెనిన్ సంకలిత రచనలు, సంపుటి 3, మాస్కో, 1972, పేజీ 58 చూడండి: ‘పెట్టుబడిదారీ విధాన వైరుధ్యాల నుంచి రెండోది అసాధ్యమనే నిర్ధారణకు రావడం కన్నా అసంబద్ధమైనది ఏమీ లేదు. ఉత్పత్తి అపరిమిత విస్తరణ వైపు ప్రయాణానికీ, సాధారణ వైరుధ్యాలు లేకుండా ఉనికిలో ఉండలేని అభివృద్ధి చెందలేని, పరిమితమైన వినియోగానికీ మధ్య ఉన్న వైరుధ్యం పెట్టుబడిదారీ విధాన వైరుధ్యం మాత్రమే కాదు.’
‘పెట్టుబడిదారీ అభివృద్ధి సిద్ధాంతం’లో ఖచ్చితంగా దీన్ని చేయడానికే స్వీజీ ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలో తన అంచనాలోకి తన నిర్ధారణలను నిర్మిస్తున్నాడు.
మార్క్స్ ఈ సమస్యను చర్చించిన ఇది పెట్టుబడి సంపుటి 3లోని 3వ భాగం శీర్షిక.
మార్క్స్, పెట్టుబడి, సంపుటి 3, పేజీలు 212 – 13
Ibid., p. 213.
Ibid., p. 232.
తగినంత అదనపు కార్మికులు అందుబాటులో ఉండడం, చౌక కార్మికులను వినియోగించి సాపేక్షంగా ముమ్మర శ్రమతో కూడుకున్న ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది సామాజిక పెట్టుబడిలోని సహజ సగటు కూర్పును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆవిధంగా లాభాల రేటు పడిపోవడానికి చిగురులు వేస్తుంది. మార్క్స్ పెట్టుబడి సంపుటి 3, పేజీలు 236– 37.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం విస్తరించడంతోనూ ప్రపంచీకరణతోనూ విదేశీ వాణిజ్య ప్రభావం ఇంకేమాత్రమూ స్థిర, అస్థిర పెట్టుబడులు చౌక అవడానికి మాత్రమే పరిమితం కాదు. లాభాల రేటుపై, పెట్టుబడిదారీ జాతీయ రాజ్యం నుంచి పెట్టుబడి ఎగుమతి పాత్ర ప్రాముఖ్యత పొందుతున్నది. ఈ అంశంపై చర్చ ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ విషయం మార్క్స్‌కు స్పష్టంగా తెలుసు. మార్క్ పెట్టుబడి సంపుటి 3, పేజీలు 237 –39 చూడండి.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 58వ భాగం, 57వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
