కానీ సోషలిస్టు సమాజం విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. మనమున్నది పెట్టుబడిదారీ సమాజం కాక కమ్యూనిస్టు సమాజమని అనుకుంటే మొదటగా ఆక్కడ ధన రూపంలో మూలధనం ఏదీ ఉండదు. లేదా దాని కారణంగా ఉత్పన్నమయ్యే లావాదేవీలను ప్రచ్ఛన్నంగా దాచిపెట్టే అవసరమూ ఉండదు.
ఉదాహరణకు దీర్ఘ కాలం పాటు, ఒక సంవత్సరం అంతకన్నా ఎక్కువ సమయంలో, మొత్తం వార్షిక ఉత్పత్తి నుంచి అవి శ్రమను, ఉత్పత్తి సాధనాలను, జీవనాధార సాధనాలను అవి వినియోగించుకుంటూ, ఉత్పత్తి సాధనాలను గానీ, జీవనాధార సాధనాలను గానీ సమకూర్చని లేదా ఉపయోగకరమైన వాటిని ఉత్పత్తి చేయని రైల్వేల వంటి వ్యాపార సంస్థలలో నష్టమేమీ లేకుండా ఎంతశ్రమను, ఉత్పత్తి సాధనాలను, జీవనాధార సాధనాలను సమాజం పెట్టబడి పెట్టవచ్చుననే విషయాన్ని ముందుగానే లెక్కించాల్సిన అవసరం సమాజానికి ఉన్నదనే ప్రశ్నఅప్పుడు వస్తుంది.
ముగింపు వ్యాఖ్య..
ఈ అధ్యాయంలో మూలధనం పునరుత్పత్తి వ్విధ వ్యక్తిగత(విడి) లేదా పారిశ్రామిక మూలధన సర్క్యూట్, పంపిణీ ఖర్చులు, మూలధన టర్నోవర్ వంటి పాక్షిక అంశాలను పరిశీలించాము. కానీ, సామాజిక మూలధనం మొత్తం పునరుత్పత్తిని అధ్యయనం చెయ్యడంపై ఆర్ధిక సంక్షోభాలపై మార్క్స్ సిద్ధాంతం ఆధారపడి ఉంది. తరువాతి అధ్యాయంలో దీనిపైనే మనం మన దృష్టిని సారించవలసి ఉంది.
గమనికలు– ప్రస్తావనలు..
1 కారల్. మార్క్స్, కాపిటల్, వాల్యూమ్ II, ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1967, పేజీ 48..
2 ఇబిడ్., పేజీ 56.
3 ఇబిడ్., పేజీ 101.
4 మూలధన సర్క్యూట్ల ఈ చర్చలో మనం వదిలివేసిన అనేక ఇతర విషయాలను మార్క్స్ వివరించాడు. పెట్టుబడిదారీ, పెట్టుబడిదారీయేతర ఉత్పత్తి సంబంధాలపైనా, ‘సహజ’ ధనానికీ ఋణ ఆర్ధిక వ్యవస్థలకూ మధ్య ఉన్న సంబంధాలపైనా ఆయన చేసిన ప్రస్థావన కీలకంగా ఉపయోగపడతాయి; పెట్టుబడి, సంపుటి II, పేజీలు 109-11, పేజీ 116 చూడండి.
5 మార్క్స్, కాపిటల్, వాల్యూమ్. II, పేజీ 121.
6 ఇబిడ్., పేజీ 124.
7 ఒక చివర, పంపిణీ(సర్క్యులేషన్) సమయం సున్నాకు చేరడాన్ని ఎవరైనా ఊహించగలరు. మార్క్స్ ఒక ఉదాహరణను ఉదాహరించాడు: ‘ఉత్పత్తి చేసిన సరుకు అందిన తరువాత అతను చెల్లింపును అందుకునే నిబంధనపై ఒక పెట్టుబడిదారుడు తనకొచ్చిన ఆర్డర్‌ను పూర్తిచేస్తే, ఈ చెల్లింపు అతని స్వంత ఉత్పత్తి సాధనాల రూపంలోనే జరిగితే, పంపిణీ(సర్క్యులేషన్) సమయం సున్నాకు చేరుకుంటుంది.’ పెట్టుబడి సంపుటి II, పేజీ 128 ని చూడండి. మరొక చివర దాని పంపిణీ(సర్క్యులేషన్) సమయం మరీ ఎక్కువగా ఉంటే పాడైపోయే సరుకుకు ఏ విలువా ఉండదు.
8 ఇబిడ్., పేజీ 131.
9 ఇబిడ్., పేజీ 150.
10 ఇబిడ్. దీనికి విరుద్ధంగా, నిల్వ, అందులో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ ఉత్పత్తి చర్యా లేనందున అనుత్పాదకమైనది. సాధారణంగా చెప్పాలంటే పంపిణీ ఖర్చులన్నీ సరుకుల రూపంలోని మార్పుల నుంచి మాత్రమే వస్తున్నందున అవి వాటి విలువకు కలవవు.’
11 ఇబిడ్., పేజీ 155.
12 ఇబిడ్., పేజీ 158.
13 ఇబిడ్., పేజీ 167.
14 కానీ కొన్ని ఉత్పత్తి శాఖలలో అటువంటి తగ్గింపును ఎంతవరకు కొనసాగించవచ్చనే దానిపై పరిమితులు ప్రకృతి విధిస్తుంది. మార్క్స్ అటవీ సంరక్షణ ఉదాహరణను ఉదహరించారు: దీర్ఘ ఉత్పత్తి సమయం, టర్నోవర్ కాలాలు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా, అటవీ సంరక్షణ, ప్రైవేట్ పెట్టుబడిదారీ సంస్థకు తక్కువ ఆకర్షణ కలిగిన పరిశ్రమగా మారుస్తాయి. మూలధనం, వాల్యూమ్ II, పేజీ 244.
15 ఇబిడ్., పేజీ 252.
16 పై చర్చను అధికారికంగా మనం ఈ విధంగా వ్యక్తీకరించా వచ్చు.
s’= అదనపు విలువ వార్షిక రేటు అని, s = అదనపు విలువ రేటు అని, c = అదనపు శ్రమ/ ఒక పని దినంలో అవసరమైన శ్రమ, V = ముందుగా చెల్లించిన అస్థిర మూలధనం, n= ఒక సంవత్సరంలోని మొత్తం టర్నోవర్లు అని అనుకుందాము అప్పుడు; s’ = మొత్తం వార్షిక అదనపు విలువ/ ముందుగా చెల్లించిన అస్థిర మూలధనం = (టర్నోవర్ కు అదనపు విలువ) X (ఒక సంవత్సరం లోని మొత్తం టర్నోవర్లు) / ముందుగా చెల్లించిన అస్థిర మూలధనం = (s’’ x v) x n / V = s’n.
17 ఇబిడ్., పేజీ 314.
18 ఇబిడ్., పేజీ 315.
19 మూలం కేవల కుప్పకూలడం సంభావ్యతను మాత్రమె ఎత్తి చూపుతుండగా కారల్ మార్క్స్ ప్రక్రియ స్పష్టమైన చిత్రాన్ని అందిస్తున్నాడు. పెట్టుబడి సంపుటి II, పేజీలు 315-16– పేజీ 318లోని అద్భుతమైన ప్రకరనాన్ని చూడండి.
20 ఇబిడ్., పేజీ 315.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 53వ భాగం, 52వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
