స్థిర- అస్థిర మూలధనాల మధ్య వ్యత్యాసాన్ని ఈ ప్రతివాదంతో గందరగోళానికి గురిచేసే ధోరణి, అన్నిటికంటే తప్పుదోవ పట్టించేది. ఉత్పత్తి విలువను బదిలీ చేసే వేగాల వ్యత్యాసంపై ఆధారపడినది. ప్రస్తుత ప్రతివాదం ఆధార పడగా, విలువను ఉత్పత్తి చేసే ప్రక్రియలో సజీవ, నిర్జీవ శ్రమల పాత్ర ఆధారంగా ఏర్పడినది.
స్థిర- అస్థిర మూలధనాల మధ్య వ్యత్యాసం. స్థిర చలనంలో ఉన్న(అస్థిర) మూలధనం మధ్య వ్యత్యాసం; ఆచరణాత్మక ప్రాముఖ్యత వాస్తవానికి ఒక్క మారు కొన్న స్థిర మూలధనాన్ని మరలా కొన్ని సంవత్సరాలపాటు కొనవలసిన అవసరం లేకపోవడంపై ఉన్నది. మరొక వైపున ఉత్పత్తి క్రమంలో స్వల్పకాలంలోనే ముడి పదార్ధాలూ, శ్రమ శక్తి మొత్తంగా వినియోగం అయిపోతాయి. అందుచేత మళ్లీ, మళ్లీ కొనవలసి వస్తుంది.
దీని అర్ధం ముడిసరుకులను కొనడానికీ, శ్రమ శక్తిని కిరాయికి తీసుకోవడానికి తగినంత ద్రవ్యాన్ని క్రమానుగతంగా సరుకుల అమ్మకం ద్వారా పెట్టుబడిదారుడు ఉత్పత్తి చేయగలగాలి. ఋణ వ్యవస్థ అభివృద్ధి, రోజువారీ ఖర్చులకు మూలధనం(వర్కింగ్ కేపిటల్) కొరుకు ఋణాన్నికేటాయించే వ్యవస్థా ఈ అవసరాన్ని పాక్షికంగా తీరుస్తుంది.
అమ్మకానికి సిద్ధంగా సరుకును అంటే బాయిలర్ లేదా రైల్వే లోకోమోటివ్ అనుకోండి ఉత్పత్తి చేయడానికి తీసుకున్న మొత్తం సమయానికి ‘పని కాలం’ అని మార్క్స్ పేరు పెట్టాడు.
పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందడంతో పరిశ్రమలు ఉత్పన్నమవుతాయి, వాటిలో పని కాలం గణనీయంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక పారిశ్రామిక బాయిలర్‌ను ఉత్పత్తి చేయడానికి దాని ప్రత్యేక లక్షణాలను బట్టి మూడునెలల నుంచి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు తీసుకుంటుంది. అటువంటి ఉత్పత్తి తగినంత మూలధన సేకరణ లేకుండా స్పష్టంగా సాధ్యం కాదు, ఇక్కడే, ఋణ వ్యవస్థ తగినంత మూలధన సేకరణలో సానుకూల పాత్ర వహిస్తుంది. ఈ ‘పని వ్యవధిని’ తగ్గించడానికి స్పష్టమైన మార్గం పెద్దమొత్తంలో ఉత్పాదక మూలధనాన్ని వినియోగించడం. ఈ విధంగా ఎక్కువ ఉత్పత్తి సాధనాలనూ, శ్రమ శక్తినీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి వినియోగపెట్టవచ్చు.
పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో పని వ్యవధిని తగ్గించే అనేక కొత్త పద్దతులు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇదేవిధంగా ఉత్పత్తి వ్యవధినీ, పంపిణీ వ్యవధినీ కూడా తగ్గించే పరిణామాలు సంభవిస్తాయి.
పంపిణీ సమయాన్ని తగ్గించడంలో ముఖ్యంగా ప్రముఖమైనవి రవాణా, సమాచార మార్పిడిలో చోటుచేసుకున్న వేగవంతమైన అభివృద్ధి. కానీ రవాణా, సమాచార మార్పిడిలోని మెరుగుదలలు పెట్టుబడిదారీ మార్కెట్ల విస్తరణ ప్రపంచమంతటా జరగడానికి దారితీస్తుంది. అంటే ప్రపంచ మార్కెట్ ఆవిర్భావానికి దారితీస్తుంది.
చాలా దూరంగా ఉన్న మార్కెట్ల కోసం పెట్టుబడిదారులు ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నందున, పారిశ్రామిక మూలధనం సరుకుల రూపంలోని మూలధనంగా ఎక్కువకాలం ఉంటుంది, అంటే పంపిణీ సమయం పెరుగుతుంది. అలాగే,రవాణా, సమాచార మార్పిడి రంగాలలో వెచ్చిస్తున్న మొత్తం సామాజిక మూలధన వాటా పెరుగుతుంది. ఈ పరిణామాలు సంచయానికి మూలంగా మారుతాయి. ఉదాహరణకు సరుకుల పంపిణీకి ఎక్కువ కాలం పడితే మార్కెట్లో ధరల మార్పు ప్రమాదం పెరుగుతుంది.
ఒక ప్రత్యేకమైన/నిర్దిష్టమైన విడిగా(వ్యక్తిగత) ఉన్న మూలధనం, సరుకుల రూపంలోని మూలధనంగా ఉన్న సమయంలో ఆర్ధికపరిస్థితులు మారవచ్చు. అంతేకాకుండా, ఆశించిన అదనపు విలువను అస్సలు పొందలేకపోవచ్చు.
అస్థిర పెట్టుబడి– టర్నోవర్..
అస్థిర పెట్టుబడిని తరచుగా పునరుద్ధరించవలసి ఉండగా, స్థిర పెట్టుబడి ఉత్పత్తి అనేక కాలాల వరకు ఉండడం మనం చూశాము. ఉత్పత్తి (వ్యవధిని) సమయాన్ని లేదా పంపిణీ (వ్యవధిని) సమయాన్ని తగ్గించి తద్వారా టర్నోవర్ (వ్యవధిని) సమయాన్ని కూడా తగ్గించే, అందువలన ఉత్పాదకతను పెంచే పరిణామాలను కూడా మనం చూశాము.
ఏది ఏమైనప్పటికీ, అస్థిర పెట్టుబడి మాత్రమే అదనపు విలువకు మూలమైనందున, అస్థిర పెట్టుబడి టర్నోవర్ ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది.
రెండు మూలధనాలను A- Bలను పరిగణనలోకి తీసుకుందాము. అస్థిర పెట్టుబడి భాగం రూ 10,000లను ముందుగా ఖర్చుపెట్టి నెలవారీ వ్యవధిలో పునరుద్ధరిస్తున్నామని అనుకుందాము. అంటే, నేను శ్రమ శక్తిని రూ 10,000లకు కొంటాను. కానీ దాని విలువను(ఉపయోగించిన స్థిర మూలధన భాగం, అదనపు విలువను కలిపి)ప్రతినెలా చివరలో ధన రూపంలో తిరిగి పొంది, దానిని మళ్లీ ఆ తరువాతి నెలకు శ్రమ శక్తిని కొనడానికి ఉపయోగిస్తాను. మరొకమాటలో అస్థిర పెట్టుబడి నెలకొకమారు టర్నోవర్ అవుతుంది.
మూలధనం Bతో రూ 1,20,000ల అస్థిర పెట్టుబడిని ప్రారంభం నుంచి ఒక సంవత్సరం వినియోగిస్తే(వెచ్చిస్తే) మరొక మాటలో ఈ అస్థిర పెట్టుబడి సంవత్సరానికి ఒక మారు టర్నోవర్ అవుతుంది. A, B రెంటిలోనూ అదే మొత్తం అస్థిర పెట్టుబడి ఒక నియమిత కాలంలో వినియోగించబడింది. అంటే నెలకు రూ 10,000. రెండు సందర్భాలలోనూ అదనపు విలువ రేటు 100 శాతం అనుకుందాము. ఇప్పుడు మూలధనం Aతో మొత్తం అదనపు విలువ = రూ. 10,000 X 12 = రూ. 1,20,000. మూలధనం B విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కానీ వ్యత్యాసం ఏమిటంటే B వ్యయం చేసిన అస్థిర మూలధనంలో 1/12వ వంతు మాత్రమే వ్యయం చేసి అదే వార్షిక అదనపు విలువను A పొందుతుంది.
మరొక మాటలో A వార్షిక అదనపు విలువ రేటు 1,20,000 / 10,000 ( =12,00 శాతం), అదే సందర్భంలో B వార్షిక అదనపు విలువ రేటు 1,20,000 / 1,20,000 (=100 శాతం). రెండు సందర్భాలలోనూ అదనపు విలువ రేటు(టర్నోవర్ కు అదనపు విలువ రేటు) ఒకటే అయినప్పటికీ, Bలో ఉన్నంత వేగంతో, అస్థిర పెట్టుబడి Aలో 12రెట్లు టర్నోవర్ అవుతున్నందున B అదనపు విలువ రేటుకన్నా 12రెట్లు అదనపు విలువ రేటును A పొందుతుంది. టర్నోవర్ వేగం ప్రాముఖ్యత ఇప్పుడు స్పష్టంగా ఉండాలి.
ఉత్పత్తి వివిధ శాఖలలో వేరియబుల్ క్యాపిటల్ టర్నోవర్ విభిన్న కాలాల వాస్తవం ‘ఒకే పరిమాణంలో ఉత్పాదక ప్రసరణ మూలధనాన్ని, అదే పరిమాణంలో శ్రమశక్తి దోపిడీతో ఒకే పరిమాణంలో శ్రమను ప్రారంభించేందుకు ద్రవ్య మూలధనాన్ని ముందుకు తీసుకెళ్లడం’ అవసరమవుతుంది.
చివరగా, మూలధన టర్నోవర్ భావన పెట్టుబడిదారీ– సోషలిస్టు ఉత్పత్తుల మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసాన్ని వెలికి తీయడంలో తోడ్పడుతుంది. దేని వ్యాప్తి చెందే(సర్క్యులేటింగ్) భాగం రెండు సంవత్సరాలకు ఒకమారు టర్నోవర్ అవుతుందో ఆ మూలధనం Cని మనం తీసుకుంటే( స్థిర మూలధనం టర్నోవర్ కావడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందన్నది స్పష్టమే) C వినియోగించే శ్రమ శక్తి, ఈ శ్రమ శక్తికి అవసరమైన జీవనోపాధి, అవసరమైన స్థిర మూలధనం, ఉత్పత్తికి అవసరమైన ఇతరపదార్ధాలు కనీసం రెండు సంవత్సరాలపాటు మిగిగిలిన ఆర్ధిక వ్యవస్థ నుంచి వేరుచేయబడుతాయి. కానీ ఈ ప్రక్రియ నుంచి ఉత్పత్తి మార్కెట్‌ను ఇప్పటి నుంచి రెండు సంవత్సరాల తరువాత మాత్రమే చేరుతుంది. తక్షణం భర్తీ చేయకుండానే, కేవలం డబ్బుల కోసమే సమాజ వనరులలో కొంత భాగాన్ని హక్కుగా డిమాండు చేస్తున్నారని దీని అర్థం.
పెట్టుబడిదారీ సమాజంలో, తానుగా సరఫరాకు ఎటువంటి సరుకులను అందించకుండానే ఆచరణలో డిమాండును పెంచుతున్నందున, ఇది సామాజిక వనరులపై వత్తిడిని సూచిస్తుంది. అందుచేత ఉత్పత్తి సాధనాల, జీవనోపాధికి అవసరమయ్యే సరుకుల ధరలు పెరుగుతాయి. పెట్టుబడిదారీ విధానంలో అంతర్లీనంగా ఉన్న స్పెక్యులేషన్ విషయాలను మరింత అస్థిరపరుస్తుంది. ఆర్ధిక పతనం దీనిని వెన్నంటి రావచ్చు.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 52వ భాగం, 51వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
