అవి క్లిష్టమైనవీ, గందరగోళ పరిచేవి అయినందున; రికార్డో, స్మిత్ల భావనలలోకి లోతుగా వెళ్ళకుండా రికార్డో ఆధునిక ధరల సిద్ధాంతాన్ని సంగ్రహంగా పరిశీలిద్దాము.
శ్రమనూ, ఇతర సరుకులనూ వినియోగించి సరుకులను ఉత్పత్తి చేసేది పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ అని గుర్తించడంతో ఈ సిద్ధాంతం ప్రారంభమౌతుంది. ఒక నిర్దిష్ట విశ్లేషణాత్మక పథకాన్ని ఉపయోగించడం ద్వారా సరుకుల ధరలను నిరూపించడానికి ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు. సామాజిక పునరుత్పత్తిని నిర్ధారించడానికి వాటిని ఉత్పత్తి చేయడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అవసరమైన శ్రమ పరిమాణాలతో ఖచ్చితమైన సంబంధాలను కలిగి ఉండాలి.
ధరను నిర్ణయించడంలో సరఫరా, డిమాండుల పాత్రను ద్వితీయ స్థానానికి నెట్టి వేస్తూనే, శ్రమ శక్తి ధర (వేతన రేటు), లేదా మూలధన అవసరాలపై లాభాలరేటును ప్రాథమిక ధరలను నిర్ణయించడానికి ‘బాహ్యంగా’ పేర్కొనాలనే అర్ధంలో, ధరల నిర్ణయాన్ని అసంపూర్ణంగా వదిలివేస్తుంది ఈ సిద్ధాంతం. అప్పుడు ఈ పథకంలో లేనిదేమిటంటే లాభ సిద్ధాంతం. ఈ పథకం ఆధారంగా ఉన్న వివిధ వర్షన్లలో వాటి లాభాల సిద్ధాంతాల మధ్య తేడా ఉంది. ఈ పథకంలో లాభ సిద్ధాంతం లేకపోవడం, మనం ఇంతకు ముందు ప్రస్థావించినట్లు దాని ఆత్మాశ్రయ సంయమనం- తరహా సిద్ధాంతాలతో దొడ్డి దారిన మొరటు ఆర్ధశాస్త్ర ప్రవేశానికి అనుమతిస్తుంది.
అయినప్పటికీ, ఈ నయా రికార్డియన్ పథక అనుయాయులు సాధారణంగా సంయమన సిద్ధాంతాలను తిరస్కరిస్తారు. అందుకు బదులుగా వారు మరొక (పాక్షికంగా) ఆత్మాశ్రయ సిద్ధాంతాన్ని పెట్టుబడిదారుల తమ ‘జంతు స్వభావంతో’ మూలధన సంచితాన్ని నిర్ణయిస్తారు. ఇది క్రమంగా లాభాల రేటును(వేతన రేటును ఇంతకన్నా దిగువకు చేరలేని పరిమితికి లోబడి), ఆవిధంగా ధరలను నిర్ణయిస్తుంది.
సరఫరా డిమాండ్లపై మార్క్స్..
మొరటు ధర సిద్ధాంతం స్పష్టంగా ఆశాస్త్రీయమైనదికాగా ఆధునిక శాస్త్రీయ సిద్ధాంతం అసంపూర్ణమైనది. అంతేకాకుండా, ఆత్మాశ్రయ వక్రీకరణలకు తలుపులు తెరుస్తుందన్నది పైదాని నుంచి స్పష్టమౌతున్నది. మరింత శుద్ధీకరణకూ, నిర్దిష్టత కొరకు తెరిచి ఉన్నప్పటికీ, మార్క్స్ సిద్ధాంతం మాత్రమే స్థిరమైనదీ, వస్తుగతమైనదీను. స్థిరంగా లంగరు వేయబడినదీ, విలువ– అదనపు విలువల శ్రమ సిద్ధాంతం నుంచి తీసుకోబడిన లాభాల సిద్ధాంతం మార్క్స్కు ఉంది. అతని విలువల పథకమే ధర ప్రాథమిక నిర్ణయాన్ని అందిస్తున్నది.
అంతేకాకుండా, అతని లాభాల రేటు సిద్ధాంతమే ఉత్పత్తి ధరనే మరింత క్లిష్టమైన నిర్ణయానికి దారితీస్తున్నది. అప్పుడు సరఫరా, డిమాండులను తీసుకు రావడం ద్వారా ధరను నిర్ణయించే నిర్మాణం పూర్తవుతుంది. ఇది మనల్ని పెట్టుబడిదారీ సమాజ ఉపరితలం పైకి, మనం బజారు-ధర అని పిలిచే రోజువారీ అనుభవాల వర్గంలోకి తీసుకువస్తుంది.
సామాజిక ఉత్పత్తి ఒక చైతన్యయుత ప్రణాళిక ప్రకారంకాక లక్షలాది మంది పెట్టుబడిదారుల, ఇతర నిర్ణయాధికారుల సమన్వయంలేని చర్యల ఫలితంగా, జరిగే సరుకుల ఉత్పత్తి వ్యవస్థ పనితీరుకు ‘సరఫరా, డిమాండ్ల శక్తుల’ ప్రాముఖ్యతను మార్క్స్ గుర్తించాడు.
సరుకుల ధరలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాటిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన మొత్తం సామాజిక శ్రమతో ఖచ్చితమైన సంబంధం కలిగి ఉన్నాయని నిర్వచించిన విలువ ప్రసిద్ధ నియమం సరఫరా, డిమాండు విధానం ద్వారా ఖచ్చితంగా పనిచేస్తుంది.
వాదనను ఈ విధంగా ద్రువీకరించవచ్చు: ఏదైనా నిర్దిష్ట సరుకును తీసుకొంటే, వేర్వేరు ఉత్పత్తిదారులు వివిధ పరిస్థితులలో, అటువంటి ఉత్పత్తి కోసం వేర్వేరు శ్రమ సమయాలను(కొద్దిగా) తీసుకొని దానిని ఉత్పత్తి చేస్తారని మనకు తెలుసు. ఒక నిర్దిష్ట విభాగంలో తీసుకున్న సమయాన్ని(వ్యక్తిగత) ఆ విభాగపు విలువగా పరిగణించవచ్చు. వివిధ యూనిట్లలోని ప్రతి యూనిట్ ఉత్పత్తి చేసిన పరిమాణాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొన్నప్పుడు, ఈ విభాగాల విలువల మొత్తం సగటు విలువను మార్కెట్ విలువ అని పిలుస్తారు.
ఏకరీతి మార్కెట్ ధర వద్ద అమ్మవలసిన సరకుల కోసం అక్కడ(i) ఉత్పత్తిదారుల మధ్య పోటీ ఉండాలి. (ii)అన్ని వస్తువులనూ అమ్మకానికి ఉంచిన ఉమ్మడి/సాధారణ మార్కెట్ ఉండాలి. ఈ మార్కెట్ ధర మార్కెట్ విలువకు అనుగుణంగా ఉండటానికి, వేరువేరు అమ్మకందారులు ఒకరిపై మరొకరు తీసుకువచ్చే ఒత్తిడి మార్కెట్కు సామాజిక అవసరాలను పూరించడానికి సరిపడా అంటే, సమాజం మార్కెట్ ధరలో చెల్లించగలిగినంత ప్రమాణంలో తగినంత సరకులను తీసుకురావడం అవసరం.ఉత్పత్తులు డిమాండుకు మించిపోతే, సరుకులను మార్కెట్ విలువ కన్నా తక్కువ ధరకు అమ్మాలి.
మార్కెట్కు తీసుకువచ్చిన సరఫరా ప్రస్తుతమున్న సామాజిక డిమాండును మించి ఉన్నప్పుడల్లా, మార్కెట్ ధరలు వాటి విలువ నుంచి లేదా ఉత్పత్తి ధరల నుండి భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు మార్క్స్కు, లక్షలాది మంది వ్యక్తుల మనస్తత్వం ఆధారపడిన ఆత్మాశ్రయ వాస్తవికత కాదు. అందుకు బదులుగా, సామాజిక డిమాండు, అంటే డిమాండు సూత్రాన్ని నియంత్రించే కారకం, వేరువేరు వర్గాల మధ్య– వారి ఆర్ధికస్థితి ప్రత్యేకించి అందువలన మొదటగా మొత్తం అదనపు విలువకూ, వేతనాలకూ మధ్య నిష్పత్తి, రెండవది అదనపు విలువ విభజించబడిన వివిధ భాగాల(లాభాలు, వడ్డీ, అద్దె, పన్నులు వగైరాల) మధ్య సంబంధానికి గల పరస్పర సంబంధాలకు లోబడి ఉండడం తప్పనిసరి. ఇది, ఈ సంబంధాలు ఏ ప్రాతిపదికన ఉన్నాయో తెలుసుకోవడానికి ముందే సరఫరాకూ డిమాండుకూ మధ్య గల సంబంధాన్ని ఎలా ఖచ్చితంగా వివరించలేమో ఇది సూచిస్తుంది.
అప్పుడు, ఏ సరుకుకైనా సామాజిక డిమాండు(ప్రధానంగా) మానసికంగా నిర్ణయించబడలేదు, లేదా గట్టిగా పరిష్కరించబడలేదు. ఉదాహరణకు జీవనాధార వస్తువులు చౌక అయితేనో లేదా ద్రవ్య వేతనం పెరిగితేనో కార్మికులు ఎక్కువ కొనుగోలు చేస్తారు.
‘సరఫరా, డిమాండ్లు’, విలువల లేదా ఉత్పత్తి ధరల క్రమం నుంచి తప్పుకొనే విధంగా మార్కెట్ ధరలను, సరఫరా డిమాండును మించినప్పుడు లేదా డిమాండు సరఫరాను మించినప్పుడు ప్రభావితం చేస్తాయి.
కానీ ముఖ్యమైన అంశాలు ఇవి: (i)సరఫరా, డిమాండ్లు తమకు తాముగానే మరింత ప్రాథమికమైన సామాజిక శక్తులతో అంటే, మొత్తం ఆదాయంలో పెట్టుబడిదారీ వర్గానికీ, కార్మిక వర్గానికీ సాపేక్ష వాటాలతో; ఆస్తిపరుల వివిధ వర్గాల మధ్యా ఆదాయాల పంపిణీచే నిర్వహించబడతాయి. అంతేకాకుండా, (ii) క్రమంగా, మార్కెట్ ధరలు ‘సరఫరా– డిమాండ్లను’ ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, సగటు కంటే ఎక్కువ ధర పెరిగిన సరఫరాను తెస్తుంది, ఇది డిమాండు తగ్గడానికి కారణమౌతుంది.
మార్క్స్ అభిప్రాయ సారాంశ ముగింపు..
ఒక వైపు డిమాండు– సరఫరాల మధ్య సంబంధం మార్కెట్ ధరల నుంచి మార్కెట్ విలువల వ్యత్యాసాలను మాత్రమే వివరిస్తుంది. మరొక వైపు ఈ వ్యత్యాసాలను తొలగించే ధోరణులను వివరిస్తుంది. ఉదాహరణకు, డిమాండు తత్ఫలితంగా మార్కెట్– ధరలు పడిపోతే మూలధనాన్ని ఉపసంహరించుకోవచ్చు. దీంతో సరఫరా తగ్గిపోతుంది. దీనికి విరుద్ధంగా డిమాండు పెరిగితే తత్ఫలితంగా మార్కెట్- ధరలు మార్కెట్ విలువకన్నా ఎక్కువగా పెరుగుతాయి. ఇది చాలా ఎక్కువ మూలధనం, ఈ విధమైన ఉత్పత్తి ప్రక్రియలోకి ప్రవహించడానికి, మార్కెట్ ధరలు మార్కెట్ విలువకంటే తక్కువగా పడిపోయేటంతగా ఉత్పత్తి పెరగవచ్చు. సరఫరా, డిమాండు మార్కెట్ ధరను నిర్ణయిస్తాయి. అంతేకాకుండా మరింత విశ్లేషణలో మార్కెట్ విలువ, సరఫరా డిమాండ్లను నిర్ణయిస్తుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 47వ భాగం, 46వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
