మొరటు ఆర్ధశాస్త్రంలో ధరల సిద్ధాంతం..
ధరలకు సంతృప్తికరమైన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో పెట్టుబడిదారీ అర్ధశాస్త్రం వైఫల్యం వెలుగులో ఈ రెండు కారణాలలోని రెండవది ప్రత్యేక ప్రాముఖ్యతను పొందుతుంది. లాభాల రేటు నుంచి స్వతంత్రంగా పెట్టుబడిదారీ ఆర్ధికవ్యవస్థలో ధరలను నిర్ణయించలేమనే విషయాన్ని పెట్టుబడిదారీ అర్ధశాస్త్రంలోని ఇటీవలి వివాదాలు వెలికి/ బయటకు తెచ్చాయి.
లాభంపై స్థిరమైన, నమ్మదగిన సిద్ధాంతం పెట్టుబడిదారీ ఆర్ధికవ్యవస్థలో అవే వివాదాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశాలను స్పష్టం చేయడానికి మనం ఇప్పుడు పెట్టుబడిదారీ ధరల సిద్ధాంతంపై సంక్షిప్తంగా చర్చిందాము.
పెట్టుబడిదారీ ధరల సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా చర్చించడంలో, మార్క్స్ మొరటు ఆర్ధిక వ్యవస్థా, శాస్త్రీయ ఆర్ధికవ్యవస్థల మధ్య తేడాను ఎవరో ఒకరు చూడగలరు. సమకాలీన, అతనికి ముందున్న ఆర్ధికశాస్త్రవేత్తలను వర్గీకరించడానికి ఆ పదాలను మార్క్స్ వాడినప్పటికీ వాటిని ఆధునిక అర్ధశాస్త్రవేత్తలకు కూడా వర్తింపచేయవచ్చు.
మొరటు భావనలో, ధరలు సరఫరా– డిమాండును బట్టి నిర్ణయించబడతాయి. డిమాండును నిర్ణయించడానికి, వ్యక్తిగత ప్రవర్తనను నియంత్రించడమనే ఊహ(పరికల్పన) నుంచి ముందుకు వెళతారు. ఈ ఊహలు(పరికల్పనలు) వారి ఆదాయాల పరిమితులనుబట్టి, అత్యంత సంతృప్తిని పొందడానికి ప్రయత్నించే వ్యక్తుల ఆత్మాశ్రయ ప్రాధాన్యతలపరంగా రూపొందించబడినాయి. సరఫరాను నిర్ణయించడానికి విడి సంస్థల లేదా ఉత్పత్తి దారుల ప్రవర్తనకు సంబంధించిన ఊహ ఆధారంగా నిర్ణయిస్తారు.
మొరటుమయమైన తర్క వివరణ
ఒక నిర్దిష్ట సరుకును, ఉదాహరణకు బిస్కేట్లను పరిగణనలోకి తీసుకుందాము. కొనుగోలు శక్తీ, బిస్కేట్లు కొనాలనే కోరిక ఉన్న వ్యక్తుల నుంచి బిస్కేట్లకు డిమాండు పుడుతుంది. ఈ క్రింది విధంగా ఉద్భవించిన డిమాండు షెడ్యూలు(కాలపట్టిక) ద్వారా సిద్ధాంతపరంగా ఈ డిమాండు ప్రాతినిధ్యం వహిస్తుంది. అతని ఆదాయం, అభిరుచులు, బిస్కట్లు మినహా ఇతర అన్ని సరుకుల ధరలను బట్టి, ఏదైనా నిర్దిష్ట ధర వద్ద అతన్ని ‘సంపూర్ణంగా సంతృప్తిపరిచే మొత్తంలో, తన ఆదాయ పరిమితికి లోబడి’ ఒక వ్యక్తి బిస్కట్లు కొంటాడు. బిస్కేట్ల వివిధ ఊహాత్మక ధరలను ఒక వ్యక్తి ముందు ఉంచడం ద్వారా అతను కొనుగోలు చేసే సంబంధిత పరిమాణాలను మనం పొందవచ్చు.
ప్రతి సంభావిత బిస్కేట్ వినియోగదారునితోనూ ఈ విధంగా చేయడం ద్వారా మనం ప్రతి బిస్కేట్ల ధరకూ మొత్తం ‘డిమాండు’ పరిమాణాన్నీ మూల్యాంకనం చేయవచ్చు. బిస్కేట్ల ధర, వాటి డిమాండు పరిమాణం మధ్య సంబంధాన్ని స్పష్టంగా డిమాండు(కర్వ్‌ను) చాపాన్ని చిత్రించవచ్చు.
సరఫరాను నిర్ణయణం..
సంస్థ తన ఉత్పత్తుల ధరను స్వతంత్రంగా నిర్ణయిస్తుంది. అంతేకాకుండా, అమ్మకపు ఆదాయానికీ (ధర X అమ్మిన పరిమాణం), ఖర్చులు(స్థిర, అస్థిర ఖర్చులను పరిగణనలోకి తీసుకొని) మధ్య వ్యత్యాసం గరిష్టంగా ఉండే విధంగా ఉత్పత్తి పరిమాణాన్ని ఉత్పత్తి చేస్తుంది.
నిర్దిష్ట సరుకు(ఉదాహరణకు బిస్కేట్లు) ఏదైనా ధరకు వివిధ బిస్కేట్ల తయారీదారులు వివిధ(ఊహాత్మక) మొత్తాలలో బిస్కేట్లను, వారి లాభాలను గరిష్టంగా పెంచుకోవడానికి తగినంతగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా ఇష్టపూర్వకంగా సరఫరా చేయబడిన బిస్కేట్ల మొత్తం నిర్దిష్ట ధర వద్ద సరఫరా అయిన బిస్కేట్ల పరిమాణాన్ని ఇస్తుంది.
వివిధ ఊహాత్మక ధరల వద్ద సంబంధిత బిస్కేట్ల సరఫరాను ఇదే విధంగా నిర్ణయించవచ్చు. ఈ ‘సరఫరా షెడ్యూల్’ను సరఫరా చాపంగా(కర్వ్గా) రేఖాచిత్రంగా గీయవచ్చు.
సరఫరా, డిమాండు చాపాలను(SS, DD)ఒకే కాగితంపై అదే స్థాయికి రెండు చాపాలు కలిసే పాయింటు E, బిస్కట్ల ధర వద్ద (AE)‘వినియోగదారులు’ కోరిన బిస్కేట్ల పరిమాణం, ‘ఉత్పత్తిదారులు సరఫరా చేయడానికి ఇష్టపడిన దానికి సమానంగా సూచిస్తుంది. ఒక వేళ అది ప్రబలంగా ఉంటే, ఉత్పత్తిదారుల నిర్ణయాలూ వినియోగదారుల నిర్ణయాలూ ఒకదానికి ఒకటి స్థిరంగా ఉండే పాయింటు E, ‘సమతౌల్య ధర’ పాయింటు అని చెబుతారు.
సరఫరా పరిమాణం– డిమాండు పరిమాణం..
మొరటు ధర సిద్ధాంతానికి చాలా సరళమైన(బహుశా సరళమైనది) సరఫరా పరిమాణం, డిమాండు పరిమాణం ప్రాతినిధ్యం వహిస్తుంది. మనవద్ద ఉన్నది, ఇతర సరుకుల అన్నిటి ధరనూ స్థిరంగా ఉంచి, ధరను గురించి తీసుకున్న పాక్షిక నిర్ణయమని గుర్తుపెట్టుకొని ఈ వాదనను వర్ణించవచ్చు. అన్ని మార్కెట్లలోనూ పనిచేస్తున్న సరఫరా, డిమాండు శక్తుల ద్వారా అన్ని సరుకుల ధరలూ ఏకకాలంలో నిర్ణయించబడతాయని వాదించడం ద్వారా ఒకరు(చాలామంది) వాదనను సాధారణీకరించడాన్ని కొనసాగించవచ్చు.
ప్రారంభంలో ఏకపక్షంగా నిర్ణయించిన నిర్దిష్ట విధంగా వివిధ వనరులు ఆర్ధిక ఏజంట్లు అందరికీ పంపిణీ చేయబడిన వాల్రాసియన్( Walrasian’) ప్రపంచాన్ని ఇది మనకు ఇస్తుంది. అప్పుడు ప్రారంభ పంపిణీకి లోబడి, ఆర్ధిక ఏజంట్ల ఆత్మాశ్రయ ‘ప్రాధాన్యతల’, సాంకేతికత వస్తుగత ఇబ్బందులు రెండింటి ప్రభావంలో ధరలు నిర్ణయించబడతాయి.
ఒకరు మరింత ముందుకు వెళ్లి విశ్వం అన్ని స్థితులలో పేర్కొన్న అనంతమైన సరుకులు ఎప్పటికీ లేని ప్రపంచానికి, ఈ నమూనాను విస్తరించవచ్చు. తద్వారా సారంలో ఏ మార్పూ రాదు. కానీ సరుకుల ధరలు సంపూర్ణమైన ‘టాటోలాజికల్’ (చెప్పిందే మరలా చెప్పే) ధోరణిలో ‘నిర్ణయించబడుతున్నాయి’: డిమాండు (నిష్పాక్షికంగా నిర్ణయించలేని వస్తువును ప్రజలు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు), సరఫరా (ఉత్పత్తి దారులు వివిధ ధరలకు అమ్మడానికి ‘సుముఖంగా ఉన్నారు, మళ్ళీ ఇది ఊహాత్మక అంశమే) కారణంగా అవి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి.
సరఫరా, డిమాండులకు సాధారణ సూత్రీకరణ చేయడంలోని అసలైన కష్టం ఏమిటంటే అది టాటోలాజీ రూపాన్ని సంతరించుకుంటున్నట్లు కనపడుతుంది. అంతేకాకుండా, సరఫరా– డిమాండులు రెండూ ఒకదానిని మరొకటి సమతుల్యం చేసుకుంటే, అవి దేనినైనా వివరించడం మానివేస్తాయి. మార్కెట్-విలువలను ప్రభావితం చేయవు. దీంతో మార్కెట్ విలువలు డబ్బు మొత్తంలో కాక మరేవిధంగానూ ఎందుకు వ్యక్తీకరించబడడం లేదో అన్న విషయంలో అవి మనల్ని చీకట్లో వదిలివేస్తాయి.
సరఫరా, డిమాండ్లు అసంబద్ధమైనవి అన్నది విషయం కాదు. అవి చాలా సంబంధితమైనవి. కానీ ధర ప్రాథమిక నిర్ణయాధికారులు కాదు. మార్క్స్ విశ్లేషణలో అవి పోషించే పాత్ర తరువాత బయటకు తీసుకువస్తాము. కానీ ఆ చర్చకు వెళ్ళే ముందు ‘శాస్త్రీయ ధరల సిద్ధాంతాన్ని’ మనం క్లుప్తంగా పరిశీలించాలి. అయినప్పటికీ, పెట్టుబడిదారీ విద్యా సంబంధిత అర్ధశాస్త్రంలో అత్యంత అధునాతన నకిలీ శాస్త్రీయత కలిగి ఉన్న మొరటు ధరల సిద్ధాంతానికి జరిగిన వివిధ మార్పులనూ, మెరుగుదలల లోతుల్లోకి మనం వెళ్ళలేము. అందుకు మనం పాఠకునికి సంబంధిత సాహిత్యాన్ని సూచిస్తాము.
‘శాస్త్రీయ’ ధరల సిద్ధాంతము..
రికార్డో,(ఆడం) స్మిత్ వంటి శాస్త్రీయ ఆర్ధిక శాస్త్రవేత్తలనూ, ఈ సిద్ధాంతాన్ని మరింత కఠినంగానూ, క్రమబద్ధంగానూ చేసిన వారి ఆధునిక అనుచరులనూ ఇరువురినీ స్వీకరించడానికి మనం ఈ పదాన్ని వినియోగిస్తాము. ధరను నిర్ణయిచడంలో సరఫరా, డిమాండ్ల పాత్ర పరిమితమని గుర్తించడమనే అర్ధంలో శాస్త్రీయ ప్రవాహం మార్క్స్ కు దగ్గరగా ఉంది. ఈ సిద్ధాంతం వారి పాఠాంతరం కొంత ముతకదీ, అస్తిరమైనదీ అయినప్పటికీ,విలువ శ్రమ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి, కట్టుబడి ఉండడంలో కూడా శాస్త్రీయ వాదులు మొదటివారు.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 46వ భాగం, 45వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
