సజీవ కూర్పును(organic composition) పెంచడం, మూలధనాన్ని ఒక చోట చేర్చడం, కేంద్రీకరణ, నిరుద్యోగ కార్మిక సైన్యం వంటి మూలధన సంచిత విభిన్న ప్రభావాలను ఉన్న వాటిని ఉన్నట్లు మొత్తాన్ని ప్రస్తుతం పరిశీలించడం లేదా మరొక మాటలో చెప్పాలంటే మార్క్స్ మూలధన సంచిత సాధారణ నియమాన్ని చర్చించడం సముచితమైనది.
పెట్టుబడిదారీ మూలధన సంచిత సాధారణ సూత్రం/నియమం..
మార్క్స్ తెలియజేసిన సూత్రం/ నియమం: సామాజిక సంపద మూలధనం పనితీరు, దాని పెరుగుదల పరిధి, శక్తీ అందుచేత సంపూర్ణ శ్రామిక జనబాహుళ్యం, దాని కార్మికుల ఉత్పాదక శక్తి, ఎంత ఎక్కువైతే, నిరుద్యోగ కార్మిక సైన్యం, క్రియాశీల కార్మిక సైన్యానికి గల అనులోమపాతం, వారి కష్టాలు వారి శ్రమ హింసకు విలోమ నిష్పత్తిలో ఉండే అదనపు జనాభా సంఘటిత బలగం అంతే ఎక్కువ ఉంటుంది. చివరగా, కార్మిక వర్గం రోగగ్రస్త- పొరలు, పారిశ్రామిక నిరుద్యోగ సైన్యం ఎంత విస్తృతమైతే అంత ఎక్కువ అధికారిక బీదరికం. ఇది పెట్టుబడిదారీ మూలధన సంచిత సంపూర్ణ సాధారణ నియమం. ఇతర అన్ని నియమాలలాగానే ఇది అనేక పరిస్థితులలో అది పనిచేసే సందర్భంలో సవరించబడింది.
ఈ నియమాన్ని తప్పుగా అర్ధం చేసుకోకుండా నివారించడానికి ఇంతటి సుదీర్ఘమైన వచనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఉదహరించడం జరిగింది. మార్క్స్ ఇక్కడ చెబుతున్న దాని సారం, పెట్టుబడిదారీ మూలధన సంచిత ఫలితం కార్మికులను ఉత్పాదకంగా నియమించుకోగల పెట్టుబడిదారీ సామర్ధ్యాన్ని బాగా తగ్గించడానికి దారితీస్తుందని. ఇది, అభివృద్ధి చెందుతున్న ఉత్పాదక శక్తులకూ, పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలకూ మధ్య ఉన్న వైరుధ్యంలోని ఒక ప్రాథమిక అంశం.
ఈ నియమ పరిణామాలను వివరిస్తూ మార్క్స్ ఇలా చెప్పాడు: మూలధన సంచితానికి అనుగుణంగా కష్టాలను కూడబెట్టుకోవడాన్ని ఇది నిరూపిస్తున్నది. అందుచేత, ఒక చోట(ధృవం వద్ద) పెట్టుబడి మూలధన సంచితం, అదే సమయంలో కష్టాలను, శ్రమ వేదనను, బానిసత్వాన్ని, అజ్ఞానాన్ని, క్రూరత్వాన్ని, మానసిక క్షీణతను దానికి వ్యతిరేకంగా ఉన్న మరొక చోట(ధృవం వద్ద) అంటే తన సరుకును మూలధన రూపంలో తానే ఉత్పత్తి చేసుకునే వర్గం వైపున కూడబెట్టడం.
మార్క్స్ బూర్జువా విమర్శకులూ, కొందరు నీచ మార్క్సిస్టులూ, పెట్టుబడిదారీ విధానంలో నిజ వేతనాల క్షీణతా ధోరణి ఉన్నదన్నది మార్క్స్ భావన లేదా నొక్కిచెప్పాడని వాదించడానికి, ఈ ప్రకటనకు తప్పు అర్ధం చెప్పారు. స్పష్టంగా మార్క్స్ ఇటువంటిది ఏమీ చేయలేదు.
మారకం సాపేక్ష అదనపు విలువ సూత్రం ప్రకారం, రెంటికీ సరిపడా కార్మికుల ఉత్పాదక శక్తి పెరుగుదలతో అదనపు విలువ రేటూ, కార్మికుల నిజ వేతనాల(జీవన ప్రమాణాల) పెరుగుదల సాధ్యమే. పై భాగంలో కష్టాలు పోగుపడటాన్ని అతను సూచించినప్పుడు, పనిలో ఉన్న కార్మికుల నిజవేతనాల గురించి పూర్తిగా ఆర్దికవాద పద్దతిలో అతను ఖచ్చితంగా మాట్లాడలేదు.
శ్రమ ప్రక్రియ నుంచి కార్మికుల పరాయీకరణను, మానసిక, భౌతిక శ్రమ మధ్య తీవ్రతను,పెరుగుతున్న పెట్టుబడిదారుల బలాన్ని, పెట్టుబడిదారులకూ కార్మికులకూ మధ్య పెరుగుతున్న వ్యత్యాసాన్ని, క్రియాశీలంగా ఉన్న కార్మికుల, నిరుద్యోగ కార్మిక సైన్యం రక్షణలేమి తనాన్ని, సున్నితమైన స్వభావాన్ని, ఏ ఉత్పాదక పనికీ అర్హులుగాని వ్యక్తుల తరగతి సృష్టి, పొడిగింపు , గురించి మాట్లాడుతున్నాడని పై ఉదాహరణకు ముందు వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యంగా అతనిలా చెప్పాడు: అదనపు శ్రమ ఉత్పత్తి కొరకు ఉపయోగపడుతున్న అన్ని పద్ధతులూ అదే సమయంలో మూలధన సంచిత పద్దతులు కూడా; మూలధన సంచిత ప్రతి పొడిగింపూ ఆ పద్దతుల అభివృద్ధికి సాధనమవుతుంది. అందుచేత మూలధన సంచితం పెరుగుదల నిష్పత్తిలో, వారి వేతనాలు ఎక్కువైనా, తక్కువైనా చాలామంది కార్మికుల జీవితాలు దుర్భారమౌతాయి.
నొక్కి వక్కాణించడానికి , మార్క్స్ పెట్టుబడిదారీ మూలధన సంచిత సాధారణ నియమ సూత్రం సారంలో మూలధన సంచితం నిరుద్యోగ సైన్యాన్ని పెంచుతుందనీ; ఉనుత్పాదక వర్గం(పెట్టుబడిదారీ వర్గం) చాలా చాలా ఎక్కువగా అధికారాన్నీ, సంపదనూ పోగేసుకుంటుండగా కార్మికవర్గం పెరుగుతున్న ఉపాధి అభద్రతనూ, ఉనికి అస్థిరతనూ ఎదుర్కొంటున్నది, ఈ చివరిది పునరావృతమౌతున్న పెట్టుబడిదారీ సంక్షోభాల సృష్టి.
మూలధన సంచితం– సంక్షోభం..
ఈ వ్యాసం పెట్టుబడుదారీ సంచిత ప్రక్రియ కొన్ని ప్రాథమిక లక్షణాలను, ప్రత్యేకించి (i) సజీవ మూలధన కూర్పు నిరంతర పెరుగుదల, (ii) పోటీ, ఋణ వ్యవస్థ ద్వారా ప్రోత్సహించబడిన మూలధన కేంద్రీకరణ, (iii) షరతుగా, మూలధన సంచిత ప్రక్రియ పర్యవసానంగా విస్తరిస్తున్న నిరుద్యోగ కార్మిక సైన్యం వంటి ధోరణుల ద్వారా ప్రకాశవంతం చేసింది. విశ్లేషణను అభివృద్ధి చేయవలసిన రెండు ప్రధాన దిశలు ఉన్నాయి.
మొదటగా, ఇప్పటివరకూ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో సంక్షోభాలంటే సామాజిక మూలధనం అభివృద్ధిలో అడ్డంకులనే అర్ధంలో ప్రస్తావనా పూర్వక సూచనలు మాత్రమే చేశారు. పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభాలన్ని తక్షణ దృగ్గోచర విషయం అమ్మకందారుల చేతుల్లో ముఖ్యమైన అన్ని సరుకుల అమ్ముడుబోని నిల్వలు పెద్దమొత్తంలో పేరుకుపోవడం. కానీ దృగ్గోచర విషయం ఇది కాగా, పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభాల వేళ్ళు మరొకచోట ఉన్నాయి.
సారంలో అటువంటి సంక్షోభాలు పెట్టుబడిదారీ మూలధన సంచిత ప్రక్రియలోని ప్రాథమిక వైరుధ్యాల ఉత్పత్తులు. వీటిని కనుగొనటానికి ఎవరైనా, పైన వివరించిన పెట్టుబడిదారీ మూలధన సంచిత ధోరణుల అంతరార్ధాల లోతుల్లోకి వెళ్ళాలి. ఈ విశ్లేషణలోకి ఇప్పటి వరకూ విడిచిపెట్టిన సర్క్యులేషన్ పరిధి రావాలి.
రెండవది, పోటీ నుంచి గుత్తాధిపత్య అభివృద్ధికి దారితీయడంలో,మూలధన కేంద్రీకరణ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఈ ప్రక్రియ సాధారణీకరణ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం గుత్తాధిపత్య దశకు చేరుకోవడానికి దారితీస్తుంది. తన రచన సామ్రాజ్యవాదంలో, పోటీ పెట్టుబడిదారీ విధానం నుంచి పెట్టుబడిదారీ గుత్తాధిపత్య తార్కిక అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో ఇమిడి ఉన్న రాజకీయ- ఆర్ధిక చిక్కుముడులను లెనిన్ వివరించాడు. ఈ విశ్లేషణ మరింత అభివృద్ధి, సామ్రాజ్యవాదాన్ని అధ్యయనం చేయడానికి పిలుపునిస్తుంది. దీనిని పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో గుత్తధిపత్య దశగా లెనిన్ గుర్తించాడు.
పెట్టుబడిదారీ సంక్షోభాల(ప్రశ్న) అంశాన్ని సామ్రాజ్యవాదంపై మార్క్సిస్టు–లెనినిస్టు అవగాహన తరువాత తీసుకోబడుతుంది.
గమనికలు– ప్రస్తావనలు..
1 K. Marx, Capital, Vol. I, International Publishers, 1967, p. 620.
2 Ibid., p. 618.
3 Ibid., p. 638; కుండలీకరణాలలోని ఆశ్చర్యార్ధకం జోడించబడింది.
4 Ibid., p. 628.
5 Ibid., pp. 625–26.
6 Ibid., p. 626. 110 (మార్క్సియన్) మార్క్సిస్టు రాజకీయ ఆర్ధిక వ్యవస్థ
7 Ibid., p. 627.
8 V.I. లెనిన్ , సామ్రాజ్యవాదం: పెట్టుబడిదారీ విధాన అత్యున్నత దశ; N.I. బుఖారిన్ సామ్రాజ్యవాదం– ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ. మంత్లీ రివ్యూ , 1972, P.M. స్వీజీ పెట్టుబడిదారీ అభివృద్ధి సిద్ధాంతం మంత్లీ రివ్యూ, 1942లు చూడండి. (V.I. Lenin, Imperialism: The Highest Stage of Capitalism; see also N.I. Bukharin, Imperialism and World Economy, Monthly Review, 1972, and P.M. Sweezy, The Theory of Capitalist Development, Monthly Review, 1942.)
9 Marx, Capital, Vol. III, p. 436.
10 Ibid., p. 439; వక్కాణింపు చేర్చబడింది.
11 Ibid., p 438.
12 Marx, Capital, Vol. I, pp. 631–32, వక్కాణింపు చేర్చబడింది.
13 Ibid., p. 632.
14 Ibid., p. 633.
15 Ibid., p. 639.
16 Ibid., p. 644.
17 Ibid., p. 645.
18 Ibid., వక్కాణింపు చేర్చబడింది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 42వ భాగం, 41వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
