రెండవది, ఉమ్మడి స్టాక్ కంపెనీల ఏర్పాటు నిజంగా ఒక విప్లవాత్మక ముందడుగు. ఇది ఉత్పత్తి స్థాయిలో అపారమైన పెరుగుదలను సాధ్యం చేసింది. పెట్టుబడిదారీ విధానంలోని సముపార్జన ప్రైవేటు స్వభావంతో ప్రత్యక్షంగా వైరుధ్యాన్ని కలిగి ఉన్న ఉత్పత్తి సామాజిక స్వభావాన్ని మరింత స్పష్టంగా ఇది చూపించింది.
ఉమ్మడి స్టాక్ కంపెనీ విషయంలో ‘మూలధనం, ప్రైవేటు మూలధనానికి భిన్నంగా, సామాజిక మూలధనం(నేరుగా సంబంధం ఉన్న వ్యక్తుల మూలధనం)రూపంతో సంపన్నమై ఉంది. ఇదు, పెట్టుబడిదారీ ఉత్పత్తి ఛత్రం లోపలే వ్యక్తిగత ఆస్థిగా మూలధనం రద్దుకావడం.’
ఇంకా, మూలధనం యాజమాన్యం, దాని వాస్తవ నియంత్రణల మధ్య విభజనను ఈ రూపంలోని మూలధనం సూచిస్తుంది. కానీ ఇంతకు ముందటి వాక్యం అర్ధం పెట్టుబడిదారీ విధానం ‘ప్రజాస్వామ్యీకరణ’ వంటిది ఏమీ కాదని, లేదా సాంకేతిక- స్వరూపం ఆధిపత్యం లేదా అనేక ఇతర పురాతన, కొత్త–వింతైన పెట్టుబడిదారీ సంస్కరణ, క్షమాపణ భావనలను, ఎత్తి చూపడంలో మార్క్స్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇది కేవలం కొద్ది మంది మిగిలిన పెట్టుబడిదారులు తమ స్వంత డబ్బులతో కాక ప్రజల డబ్బులతో ఆడుకోవడమే.
‘వ్యక్తిగత పెట్టుబడిదారుడికి కొన్ని పరిమితులకు లోబడి ఇతరుల మూలధనం, ఆస్తిపై సంపూర్ణ నియంత్రణ అమలు జరపడానికి అధికారాన్ని ఋణం ఇస్తుంది. వ్యక్తిగత మూలధనంపై నియంత్రణ కాక సామాజిక మూలధనంపైన ఉన్న నియంత్రణ అతనికి సామాజిక శ్రమపై నియంత్రణనిస్తుంది’
ఒకరి మూలధనం మూలాన్ని మరొకరి పొదుపుతో అనుసంధానించే, ఇతరుల సొమ్ము, శ్రమ తీసుకువచ్చిన భోగభాగ్యాలలో మునిగి తేలుతున్న పెట్టుబడిదారుడు ‘సంయమనం’ గురించి మాట్లాడే పెట్టుబడిదారీ క్షమాపణల అబద్దాన్ని ఈ పరిణామాలు బహిర్గతం చేస్తాయి, సంపూర్ణంగా ఇస్తాయి. ఉత్పాదక శక్తుల భౌతిక అభివృద్ధిలోనూ, ఉత్పత్తి పెరుగుతున్న సాంఘికీకరణలోనూ ఋణ ప్రగతిశీల పాత్రను మార్క్స్ గుర్తిస్తూనే, స్టాక్ కంపెనీల అభివృద్ధి ‘కొన్ని రంగాలలో కేవలం గుత్తాధిపత్యాన్ని ఏర్పరుస్తుంది. కొత్త ఆర్ధిక కులీనులను, ప్రమోటర్ల, స్పెక్యులేటర్ల, నామమాత్రపు నిర్దేశకుల రూపంలో, మోసం– మోసపూరిత దోపిడీ సంపూర్ణ వ్యవస్థను కార్పోరేట్ వ్యవస్థను ప్రోత్సహించడం, స్టాక్‌ల జారీ, స్పెక్యులేషన్ల ద్వారా కొత్త తరహా పరాన్న జీవులను పునరుత్పత్తి చేస్తుందని చాలా స్పష్టంగా ఎత్తిచూపాడు.
చివరగా పెట్టుబడిదారీ సంక్షోభాలు తీవ్రతరం కావడానికి ఋణ వ్యవస్థ గణనీయంగా దోహదం చేస్తుందని కూడా అతను ఎత్తిచూపాడు. రెండవ అంతర్జాతీయ సంస్థకు(ఇంటర్నేషనల్‌కు) చెందిన కౌట్స్కీ, అతని ఆధునిక సహచరులు పెట్టుబడిదారీ వైరుధ్యాలను మసకబార్చి, సామ్రాజ్యవాదులతో యుద్ధాలు లేకుండా శాంతియుత సహజీవనం సాధ్యమనే అందమైన చిత్రాలను చిత్రించడానికి ప్రయత్నించగా లెనిన్ మాత్రమే ఈ విషయాలన్నిటి పైనా వాదనలను చేబట్టి, వాటిని అద్భుతంగా అభివృద్ధి చేశాడు.
కార్మిక నిరుద్యోగ సైన్యం..
వాదనలన్నిటినీ ఒక చోట చేర్చి చూస్తే(వాదనలన్నిటి తీగలు కలిసి లాగితే)వేగవంతమైన మూలధన సంచితాల కాలాలు వేతనాల తాత్కాలిక పెరుగుదలకు దారి తీస్తాయి. సుదీర్ఘ చారిత్రక వ్యవధిలో, కార్మికవర్గ పోరాటాలు(కార్మిక సంఘాల విధానం మొదలైనవి) కార్మిక శక్తి విలువ ఏమిటనే దానిని, అందువలన వేతనాలను(పైకి) ఊర్ధ్వముఖంగా సవరించవచ్చు. ఇంకా, మూలధనంలో అస్థిర భాగంతో పోల్చినప్పుడు, స్థిర మూలధన భాగాన్ని పెంచడం ద్వారా, ఉత్పాదక శక్తులను అభివృద్ధి చేయడం మూలధన సంచితంలో అంతర్లీనంగా ఉన్న ధోరణి. చివరగా, మూలధన కూర్పు, కేంద్రీకరణ ప్రక్రియలు ఉన్నాయి.
కూర్పు, కేంద్రీకరణ రెండూ కూడా యాంత్రీకరణకు దారి తీస్తాయి. ఆ విధంగా సామాజిక మూలధనంలో అస్థిర మూలధనంతో పోల్చినప్పుడు స్థిర మూలధనంలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఏమిటంటే, మూలధన సంచిత ప్రక్రియ శ్రమ శక్తిలో కొంత భాగాన్ని నిరంతరం పని లేకుండా ఉంచుతుంది. అయితే, పెట్టుబడిదారుడు ఉత్పత్తిని గణనీయంగా పెంచేటంతగా ఉత్పాదకతను కార్మికులను తొలగించే యంత్రాలు పెంచుతాయి. చివరకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తాయి లేదా సంబంధిత పరిశ్రమలలో ఉపాధి పెరుగవచ్చు.
ఉదాహరణకు(స్పిన్నింగులో) నూలు వడకడంలో ఉత్పాదకతను పెంచే ఒక ఆవిష్కరణ నూలు విస్తారమైన సరఫరాను అందించవచ్చు. తద్వారా చేనేత కార్మికుల ఉపాధిని పెంచవచ్చన్నది వాస్తవం. ఏమైనప్పటికీ, మొదటగా ఇదంతా చాలా సమయం తీసుకుంటుంది, చాలా సందర్భాలలో పనిలోకి తీసుకున్న కార్మికులు ఉపాధి కోల్పోయిన వారు కాకపోయే అవకాశం ఉన్నందున ఆ కార్మికులకు ఎటువంటి ఓదార్పు ఉండదు. రెండవది, మొత్తం సమాజంలో మూలధన సంచిత ప్రక్రియ ప్రభావాలన్నీ కలిసి కార్మికులను పనిలోకి చేర్చుకోవడానికి బదులు వారిని స్థానభ్రంశం చేసి పనిని కోల్పోవడానికి దారితీస్తుంది. ఇంకా ప్రతి యాంత్రికీకరణా ఉద్యోగావకాశాలను చంపివేస్తుంది. ఆ విధంగా భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను తగ్గిస్తుంది. ఆవిధంగా, మాల్తస్ అభిప్రాయానికి భిన్నంగా వాస్తవం ఈ విధంగా ఉంటుంది.
శ్రమించే జనాభా, అది ఉత్పత్తి చేసిన మూలధన సంచితంతో పాటు తమను నిష్ప్రయోజకులుగా చేసి సాపేక్షంగా మిగులు జనాభాగా చేసే ఉత్పత్తి సాధనాలను కూడా ఉత్పత్తి చేస్తారు. అంతేకాకుండా, ఇది ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. పెట్టుబడిదారీ విధానపు విచిత్రమైన జనాభా సూత్రం ఇది.
పెట్టుబడిదారీ అవసరాలతో పోలిస్తే ఎప్పుడూ సాపేక్షంగా అదనమే అయిన అదనపు శ్రామిక జనాభా మూలధన సంచిత ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయినదే, దాని పరిణామమే కానీ సంపూర్ణ లేదా సహజ అధిక జనాభా కాదు. అదే సమయంలో పెట్టుబడి అవసరాల మేరకు సరిపడిన రేటులో మూలధన సంచితం కావడం ఒక షరతు అవుతుంది: ‘ఈ అదనపు జనాభా, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన ఉనికికి ఒక షరతు అవుతుంది. ఇది తిరిగి ఉపయోగించలేని పారిశ్రామిక కార్మిక నిరుద్యోగ సైన్యాన్ని తయారు చేస్తుంది.’
దాని మూలధన సాంకేతిక కూర్పులో(అందువలన సజీవ కూర్పులో) వేగవంతమైన మార్పులతో పెట్టుబడిదారీ మూలధన సంచితం గమనము విస్తరణ, సంకోచాల ప్రత్యామ్నాయ కాలాలలో ఒకటి లేదా మరింత ప్రజారంజకంగా చెప్పాలంటే ‘తీవ్రమైన మాంద్యం తరువాత ఆర్ధిక చక్రం గొప్పగా పెరుగుట– పతనమగుట’ మార్క్స్ చేసినట్లు దానిని ‘ సగటు కార్యాచరణ, అధిక ఒత్తిడితో ఉత్పత్తి, సంక్షోభాలు, స్తబ్ధత కాలాలుగా విభజించవచ్చు.
పెట్టుబడిదారీ కార్యకలాపాల వలయ విశ్లేషణను తరువాతి సందర్భానికి వదిలివేసి, ఈ వలయం అవసరాలకు పూర్తిగా సరిపడా మూలధన సంచితం సృష్టించిన పారిశ్రామిక కార్మికుల నిరుద్యోగ సైన్యం ఉనికిని మనం గమనించవలసిన అవసరం ఉంది. విస్తరణ కాలాలలో పెట్టుబడిదారులు తమకు అవసరమైన కార్మికులని ఈ నిరుద్యోగ కార్మిక సైన్యం నుండి తీసుకుంటారు, ఆవిధంగా వేతనాలను తొక్కిపెట్టి ఉంచుతారు.
సంకోచం (మాంద్యం) దశకు చేరుకున్నప్పుడు తరిగి పోయిన నిరుద్యోగ కార్మిక సైన్యాన్ని అనేక మార్లు లే-ఆఫ్‌లూ రిట్రెంచ్మెంట్లతో భర్తీ చేయవచ్చు. పెట్టుబడిదారీ మూలధన సంచిత ప్రక్రియ నిరంతరాయంగా(విస్తరించిన స్తాయిలో) పునరుత్పత్తి చేస్తున్న ఈ నిరుద్యోగ కార్మిక సైన్యం పనిలో ఉన్న కార్మికుల వేతనాల పెరుగుదలకు బలమైన నిరోధకంగా పనిచేస్తుంది. సరుకుల, శ్రమ శక్తుల సరఫరా, డిమాండు ఈ నిరుద్యోగ కార్మిక సైన్యం ఆధారపడి ఉంటుంది, దాని ద్వారా పరిమితం చేయబడుతుంది. ‘సాపేక్ష అదనపు జనాభా, పని చేసే కార్మికుల సరఫరా– డిమాండ్లకు ఇరుసు దోపిడీ కార్యకలాపాలకు, మూలధన ఆధిపత్యానికి ఖచ్చితంగా సౌకర్యవంతంగా ఉండే విధంగా. ఇది ఈ నియమ కార్యాచరణ రంగాన్ని పరిమితం చేస్తుంది.’
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 41వ భాగం, 40వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
