పెట్టుబడిదారీ సంచితం సాధారణ నియమం..
మునుపటి వ్యాసం సామాజిక పునరుత్పత్తి అనే భావనను పరిచయం చేసి, సాధారణ– విస్తరించిన రెండు రకాలుగా విభజించింది. సాధారణ పునరుత్పత్తి అధ్యయనం విశ్లేషణాత్మకంగా ఉపయోగపడుతుంది. పునరుత్పత్తి దృక్కోణం నుంచి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన ప్రధాన లక్షణం అదనపు విలువను మూలధనంగా మార్చడం, అంటే విస్తరించిన ఉత్పత్తి లేదా మూలధన సంచితం. వినియోగ విలువను ఎప్పుడూ పెట్టుబడిదారుని లక్ష్యంగా చూడకూడదని మార్క్స్ విశ్లేషణ నొక్కిచెబుతుంది.
మూలధనం దాని విలువ స్వీయ- విస్తరణ స్వభావం వలన నిరంతరాయంగా విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. అందువలన, పెట్టుబడిదారీ ఆర్ధిక విధాన ఆర్ధిక నియమాల చలన సూత్రాలను కనుగొనడానికి ఎవరైనా, పెట్టుబడిదారీ సంచిత ప్రక్రియను విశ్లేషించాలి. ఈ ప్రక్రియపై మార్క్స్ విశ్లేషణను వివరించే ఒక ప్రయత్నం ఈ ప్రస్తుత అధ్యాయం.
తను మొదట అభివృద్ధి చేసిన సైద్ధాంతిక వాదన అనేక(దారపు పోగులను) తంతువులను కలపడం ద్వారా, పెట్టుబడిదారీ సంచిత సాధారణ నియమమని పిలిచే నిర్ధారణకు మార్క్స్ చేరుకున్నాడు. ఈ వివరణలో తన విధానాన్ని అనుసరించడం జరిగింది.
సంక్షిప్తంగా పోగుసేత ప్రక్రియ (i) మానవ శ్రమ స్థానంలో భారీగా యంత్రాలను భర్తీ చేయడం; (ii) పోటీ పోరాటంలో, చాలా మంది పెట్టుబడిదారులు నాశనమవడం, చాలా తక్కువ మంది పెట్టుబడిదారులు మనుగడలో మిగలడం, ఇలా బ్రతికి బట్ట కట్టిన వారు పెద్ద మొత్తంలో మూలధనాన్ని నియంత్రించడం (iii) పై రెండు పరిణామాల ఫలితంగా నిరుద్యోగ కార్మిక సైన్యం సృష్టి, విస్తరణ దిగువ వివరిస్తున్న పదం.
సంచితం, వేతనాలు..
పెట్టుబడిదారీ సమాజంలో వేడెక్కిన ఆర్ధిక కార్యకలాపాల కాలాలు, ఆర్ధిక వ్యవస్థ మందకొడిగా ఉన్నప్పటి కార్యకలాపాలు ఒక దాని తరువాత ఒకటి సంభవిస్తూ ఉంటాయని చారిత్రక అనుభవం తెలుపుతున్నది. కోటా మార్కెట్లు తెరుచుకోవడం, శాస్త్ర సాంకేతిక రంగాలలో సరికొత్త ఆవిష్కరణలు, కొత్త వలసలను జయించడం మొదలైన కారణాల వంటి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కారణాల వలన కొన్ని సమయాలలో పెట్టుబడిదారీ వర్గం చాలా లాభదాయకమైన వ్యాపార పరిస్థితుల ప్రయోజనాలను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తూ, సాధ్యమైనంత ఎక్కువగా తన అదనపు విలువను మూలధనంగా మార్చాలని ప్రయత్నిస్తుంది. అటువంటి కాలాలలో మూలధన సంచితం రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.
మొత్తం సమాజంలో సాంకేతిక స్థాయిలు ఇప్పటికే ఉన్న స్థాయికి కొంచెం అటూఇటూగా ఉండడంతో, ఇది శ్రమ శక్తికి గణనీయంగా పెరిగిన డిమాండును సూచిస్తుంది. అయితే సరుకుల, శ్రమ శక్తుల స్వభావాన్ని బట్టి పెట్టుబడిదారుల డిమాండుకు అనుగుణంగా దాని సరఫరాని తక్షణమే పెంచడం సాధ్యం కాదన్నది స్పష్టం.
శ్రమ శక్తికి పెరిగిన డిమాండు, శ్రమ శక్తి సాంప్రదాయక విలువ కన్నా ఎక్కువగా వేతనాల పెరుగుదలలో ఇది ప్రస్ఫుటమౌతుంది. మొదటగా, వారి పెట్టుబడుల నుంచి వారి పెరిగిన అదనపు విలువలద్వారా పరిహారం ఎక్కువ పొందుతున్నామని అప్పటికి పెట్టుబడిదారులు తమంతట తాము తెలుసుకున్న మేరకు మాత్రమే అటువంటి వేతన పెరుగుదల జరుగుతుంది. రెండవది, వేతనాలలో పెరుగుదల పెట్టుబడిదారుల లాభాలకు కోత పెట్టినప్పుడు, లాభం ఉద్దీపన తద్వారా మొద్దుబారుతుంది, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను తగ్గిస్తారు. ఆవిధంగా మూలధన సంచితం మందగిస్తుంది. వేతనాల పెరుగుదలకు గల కారణాలను తొలగిస్తుంది.
మార్క్స్ ఈ విధంగా చెప్పాడు: కార్మిక వర్గం సరఫరా చేసిన, పెట్టుబడిదారీ వర్గం పోగేసుకున్న, వేతనం లేని(చెల్లింపు లేని) శ్రమ చాలా వేగంగా పెరిగితే, డానిని మూలధనంగా మార్చదానికి అసాధారణంగా వేతన శ్రమను చేర్చడం అవసరమౌతుంది, అప్పుడు వేతనాలు పెరుతాయి. అంతేకాకుండా, అన్ని ఇతర పరిస్థితులూ సమానంగా ఉంటే దానికి తగ్గట్టు దామాషాలో చెల్లింపులు లేని శ్రమ తగ్గుతుంది. కానీ ఈ క్షీణత మూలధనాన్ని పోషించే అదనపు శ్రమను సాధారణ పరిమాణంలో సరఫరా చేయని దశకు తాకినా వెంటనే, ప్రతి చర్య ప్రారంభమౌతుంది.
ఆదాయంలో కొంత భాగం పెట్టుబడిగా మారుతుంది, సంచితం వెనుకబడుతుంది. వేతనాలలో పెరుగుదల కదలికకు అడ్డుకట్ట పడుతుంది. అందువలన వేతనాలలో పెరుగుదల, పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను చెక్కు చెదరకుండా ఉంచడం మాత్రమే కాక దాని పునరుత్పత్తి స్థాయిని ప్రగతిశీల స్థాయిలో భద్రంగా ఉంచే పరిమితుల్లో పరిమితం చేయబడుతుంది.
అనేక విషయాలను ఇక్కడ చెప్పవలసి ఉంది. పెట్టుబడిదారీ వర్గం చేసే మూలధన సంచిత రేటు వేతనాల స్థాయిని, వాటి పెరుగుదలను నిర్ణయిస్తుంది. ఆ విధంగా, పెట్టుబడిదారీ అభివృద్ధి సమయంలో కూడా పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెట్టుబడిదారీ వర్గం తీసుకునే స్వతంత్ర నిర్ణయం ద్వారా నిర్ణయించబడతాయన్నది వాస్తవం. రెండవది, తాత్కాలికంగా వేతనాలు పెరగడం వలన ప్రాథమిక ప్రాముఖ్యత కల మార్పులు ఏమీ జరగవు. కార్మికులు అదనపు విలువను, వాస్తవానికి పెద్ద మొత్తంలో అదనపు విలువను ఉత్పత్తి చేయడం కొనసాగుతూనే ఉంటుంది. కార్మిక వర్గానికీ, పెట్టుబడిదారీ వర్గానికీ మధ్య సంబంధాలు గతంలో లాగానే ఉంటాయి.
మంచి దుస్తులు, ఆహారం, చికిత్స వంటి చాలా తక్కువ సదుపాయాలూ, యజమాని అనుమతించిన పెద్ద ఆస్తి బానిసను దోపిడీ చేయడాన్ని తొలగిస్తాయి. వేతన కార్మికునికి చాలా తక్కువ వారు పక్కన పెట్టారు. మూలధన సంచితం పర్యవసానంగా శ్రమ ధరలో పెరుగుదల, వాస్తవానికి బంగారు గొలుసు పొడుగూ, బరువూ దాని ఒత్తిడిని సడలించడానికి అనుమతించే విధంగా వేతన కార్మికుడు తనకోసం ఇప్పటికే సృష్టించుకున్నాడన్నది ఒక్కటే దాని అర్ధం.
ఇంతకు ముందు గుర్తించినట్లు,పెట్టుబడిదారీ వర్గం దోపిడీ చేస్తున్న అదనపు విలువకు తీవ్రమైన కోత ఏర్పడిన వెంటనే వేతనాల పెరుగుదలకు అడ్డుకట్ట వేయబడుతుంది. ఇది అప్పుడు పెట్టుబడికి కోత విధిస్తుంది. తత్ఫలితంగా శ్రమ శక్తికి డిమాండు తగ్గుతుంది. అంతేకాకుండా వేతనాల పెరుగుదలకు కారణమైన డిమాండుకు సంబంధించి, కార్మికుల కొరత అని పిలవబడేది అదృశ్యమౌతుంది. ఒక అడుగు ముందుకు వేయడానికి వేతనాలలో పెరుగుదల, నిరంతరం ఉనికిలో ఉన్న పెట్టుబడిదారుల మధ్య పోటీ కార్మికుల స్థానంలో యంత్రాలను భర్తీ చేయడానికి దారి తీస్తుంది. ఆ విధంగా శ్రమ శక్తిలో కొంత భాగం మితిమీరింది లేదా అదనపు శక్తి అవుతుంది.
ఇక్కడ మరొక వాదన చాలా ముఖ్యమైనది. ఈ సమస్య విషయంలో అప్పుడూ ఇప్పుడూ కూడా పాలక వర్గాలకు సొంపైనదైన మాల్తూసియన్ భావనతో తీవ్రంగా విభేదిస్తుంది. కార్మికుల కొరకు డిమాండు, సరఫరాలను సమతుల్యపరచిన యంత్రాంగం జనాభా సహజ నియమమని మాల్తూస్ వాదించాడు. అతని వాదన ప్రకారం, కార్మికుల కొరకు డిమాండు పెరిగిన ఫలితంగా కార్మికుల వేతనాలు జీవనాధార స్థాయి కంటే ఎక్కువగా పెరగినప్పుదల్లా కార్మికవర్గ సంఖ్య వృద్ధి అవుతుంది. కార్మికుల సంఖ్య పెరిగిన పర్యవసానంగా కార్మికుల డిమాండు, సరఫరాల మధ్య సమతుల్యత మరలా ఏర్పడుతుంది.
వేతనాలు జీవనాధార స్థాయికి పునరుద్ధరించబడతాయి. కార్మిక వర్గం సాధారణ రేటులో పునరుత్పత్తి చేస్తుంది. నిరుద్యోగం, తక్కువ వేతనాలు పెట్టుబడిదారీ విధానం, దాని స్వాభావిక నియమాల పరిణామాలు కావనీ, సహజ శక్తుల, కార్మికుల అజ్ఞానం వలన వచ్చినవనీ వాదించిన అటువంటి వాదన సహజంగానే పాలక వర్గాలకు ఆనందం కలిగిస్తుంది.
‘మానవ జాతి పరువుపై తీరని మచ్చ’ అని మార్క్స్ సరిగ్గానే మాల్తూసియన్ వాదనను ఖండించాడు. ఒక నిర్దిష్ట దృష్టాంతం ద్వారా ఈ వాదన అంతటి అసంబద్ధతను నిరూపించాడు.
ఇంగ్లీష్ వ్యవసాయక జిల్లాలలో (వాస్తవానికి నిరాడంబరమైన స్థాయికి) వేతనాల తాత్కాలిక పెరుగుదలను సూచిస్తూ మార్క్స్ ఈ విధంగా ఎత్తి చూపాడు: ఇప్పుడు వ్యవసాయదారులు ఏమి చేస్తారు? పిడివాద ఆర్ధిక మెదడు సూచించినట్లు, ఈ తెలివైన (!)పారితోషికం ఫలితంగా వ్యవసాయ కూలీలు అంతగా పెరిగి వారి వేతనాలు మళ్లీ పడిపోయే వరకూ వేచి ఉంటారా? వారు మరిన్ని యంత్రాలను వినియోగిస్తారు. ఒక్క క్షణంలో కార్మికులు మళ్లీ అనవసరం అవుతారు.
మాల్తూసియన్ వాదనలకు విరుద్ధంగా, పెట్టుబడిదారీ సంచితం ప్రక్రియే క్రమానుగతంగా కార్మిక జనాభాలో కొంత భాగాన్ని నిరుద్యోగులుగా మారుస్తుందని , సంచితానికీ, వేతనాలకూ మధ్య సంబంధాలను గురించి చాలా చెప్పబడింది. దీనిని చూడడానికి వాదన రెండు ఇతర(దారపు) పోగులను తప్పక అనుసరించి పరిశీలించాలి.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 39వ భాగం, 38వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
