పెట్టుబడిదారీ ఉత్పత్తిలో, మూలధన సంచితం శ్రమ తీవ్రత పెరుగుదల, అధిక ఉత్పాదకత మొదలైన వివిధ వనరులు, అంతిమంగా మానవ శ్రమ శక్తి కారణంగా దేనిలోనైతే అది(శ్రమ శక్తి) విలీనం చేయబడిందో, ఆ ‘మూలధనం అంతర్గత ఆస్తి రూపాన్ని తీసుకుంటాయి’: పెట్టుబడిదారీ విధానం వట్టి మాయ, వస్తు పూజ(commodity fetishism).18
లేబర్ – ఫండ్ భావన / సంకల్పం..
పైన మనం చేసిన విశ్లేషణ మూలధన సంచిత పరిమాణాన్ని మనకు చూపింది. కూడబెట్టుకోవలసిన అదనపు విలువ నిష్పత్తి ఇవ్వబడినప్పుడు కూడా, శ్రమ దోపిడీ స్థాయిపై, కార్మికుల ఉత్పాదకతపై, కార్మికుల ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ, కొందరు 19వ శతాబ్దపు పెట్టుబడిదారీ అర్ధ శాస్త్రవేత్తలు మూలధన సంచిత పరిమాణం “లేబర్ ఫండ్” అని పిలవబడుతున్న దానిచే నిర్ధారించబడిందని చూపడానికి ప్రయత్నించారు.
వాదన ఈ విధంగా సాగింది: మొదటగా, సమాజంలోని మొత్తం మూలధనం ఒక స్థిర పరిమాణంగా భావించబడింది. తద్వారా అది సాగడానికి దోహదపడే కారకాలను విస్మరించింది. మొత్తం మూలధనంలోని కార్మికుల జీవనోపాధికి అవసరమైన మూలధన భాగాన్ని కూడా, పనిచేయగలిగిన కార్మికులను సంఖ్యాపరంగా ఖండితంగా నిర్దారించినట్లుగా పరిగణించడమైనది. ఆ విధంగా మూలధన సంచిత పరిమాణాన్ని ‘లేబర్ ఫండ్’ అని పిలవబడిన జీవనాధార అవసరాల(ధాన్యం) పరిమాణం ఖండితంగా నిర్ధారించింది.
మనం ఇప్పటికే చెప్పిన కారణాల వలన ఈ భావన తప్పే అనుకోండి. మొదట, సామాజిక మూలధన పరిమాణం, దోపిదే రేటుపై, ఉత్పాదకతపై, మొదలైన వాటిపై ఆధారపడి, దాని సాగే గుణ పరిమితుల్లో మారవచ్చు. అందువల్ల ఇది ‘స్థిర స్థాయి సామర్ధ్య స్థిర పరిమాణం కాదు.’
రెండవది, సాంకేతిక పరిస్థితులు ఉత్పత్తి సాధనాలకీ, మానవ శ్రమకీ మధ్య భౌతిక సంబంధాలను నిర్దారించినప్పటికీ, కార్మికులచే వినియోగించబడిన జీవనాధార సాధనాలు తరచుగా వాటి సాధారణ ప్రమాణాలకన్న దిగువకు నెట్టబడతాయి. ‘లేబర్-ఫండ్’ వాదన వాస్తవానికి మూలధన సంచితానికి కార్మికుల వినిమయం అద్దంకి అని చూపడానికి చేసిన ప్రయత్నం, వినియోగ– సంచితాల మధ్య అదనపు విలువను విభజించి, కొల్లగొట్టడానికి పెట్టుబడిదారుడి హక్కును పవిత్రం చేయడానికి ఉద్దేశించినది.
ఒక సారాంశం..
పెట్టుబడిదారీ విధానాన్ని దాని పునరుత్పత్తిలో అంటే సామాజిక ఉత్పత్తి ప్రక్రియ నిరంతరం పునరావృతం అవడాన్ని చూడడం ద్వారా మనం ప్రారంభించాము. ఇది చేయడంలో పంపిణీ(circulation) ప్రక్రియలు అంతరాయాలు లేకుండా జరుగుతాయని ఊహించాము. ప్రస్తుతానికి ఉత్పత్తి ప్రక్రియపై దృష్టిని కేంద్రీకరించి పెట్టడానికి వీలు కల్పిస్తున్నందున ఈ ఊహ సౌకర్యవంతంగా ఉంటుంది. తరువాత పంపిణీ (circulation) దశలను మనం క్లుప్తంగా పరిశోధిస్తాము.
పెట్టుబడిదారీ పునరుత్పత్తి(తార్కికంగా) సాధారణ పునరుత్పత్తిగా గానీ లేదా విస్తరించిన పునరుత్పత్తిగా గానీ కావచ్చునని మనం కనుగొన్నాము. మొత్తం అదనపు విలువను అనుత్పాదకంగా వినిమయం చేసినప్పుడు, సమాజం వద్ద ఉన్న ఉత్పత్తి సాధనాలు ఇంతకూ ముందు లాగానే ఉన్నప్పుడు మొదటిది జరుగుతుంది. అందువలన ఉత్పత్తిని ఇంతకూ ముందు ఉన్న స్థాయిలోనే కొనసాగించవచ్చు. ప్రారంభ సామాజిక మూలధనం మొత్తం నుంచి పొందిన అదనపు విలువలోని కొంత భాగాన్ని మూలధనంగా తిరిగి మార్చినప్పుడు, అంటే మూలధన సంచితం జరిగినప్పుడు విస్తరించిన పునరుత్పత్తి జరుగుతుంది.
పెట్టుబడిదారీ ఉత్పత్తి జరగడానికి ఉత్పత్తి సాధనాలనూ, డబ్బు సంపాదించిన సంపద కలిగి ఉన్న ఒక చిన్న సమూహానికీ, ఆస్తులేమీ లేని, తమ శ్రమ శక్తిని అమ్ముకోవడానికి బలవంతపెట్టబడిన(స్వేచ్చగా) ఒక పెద్ద సమూహానికీ మధ్య ముందస్తుగా సమాజంలో విభజన ఉండాలి. ఈ విభజనను తీసుకువచ్చిన ప్రక్రియే మార్క్స్, ఆ తరువాత లెనిన్, బారన్ ఇతరులచే విస్తృతంగా చర్చించబడిన ఆదిమ లేదా ప్రాథమిక మూలధన సంచితం.
పెట్టుబడిదారీ మూలధన సంచితం ముందుకు సాగడంతో, సామాజిక పెట్టుబడిలోని భాగమైన ప్రారంభ పెట్టుబడి ప్రాముఖ్యత తగ్గుతుంది. ఇప్పటికే ఉన్న మూలధనంలో ఎక్కువ భాగం గత, వర్తమాన అదనపు విలువ తప్ప మరొకటి కాదు. ఈ విధంగా (సరళమైన) సరుకుల ఉత్పత్తి విధానంలో తమ స్వంత శ్రమద్వారా వృద్ధి చెందే వ్యక్తిగత సముపార్జన నియమాలు, ఇతరుల శ్రమ ద్వారా వృద్ధి చెందే పెట్టుబడిదారీ సముపార్జన నియమాలచే భర్తీ చేయబడతాయి. మూలధనం పైనే కార్మికవర్గం పునరుత్పత్తి చేస్తున్న, విస్తరిస్తున్న మూలధన శక్తి పెట్టుబడిదారుల సంపద, కార్మికుల స్వంత జీవనోపాధి, ఆధీనత.
మొత్తం అదనపు విలువను వెనువెంటనే వినియోగించుకోనందున పెట్టుబడిదారులు ‘సంయమనం’ బాధలను అనుభవిస్తున్నారని, లాభాలు ఆ సంయమనానికి బహుమతని, బూర్జువా అర్ధ శాస్త్రవేత్తలు వాదించడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం చూసిన వాస్తవాలు మరొక విధంగా ఉన్నాయి. పెట్టుబడిదారులు నిరంతరం పెరుగుతున్న జీవన ప్రమాణాలను అనుభవిస్తారు. అంతేకాకుండా కార్మికులు మాత్రమే అత్యంత ప్రాథమిక అవసరాలకు కూడా దూరంగా ఉండవలసి వస్తుంది.
మూలధన సంచిత పరిమాణాన్ని (i)వినియోగం, మూలధన సంచితాల మధ్య అదనపు విలువ విభజన; (ii) కార్మికుల ఉత్పాదకత; (iii) శ్రమ దోపిడీ స్థాయిల ద్వారా నిర్ణయించబడుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతి, దోపిడీ స్థాయికి సాగే పరిమితులను దృఢంగా స్థిరపర్చినట్లు, మూలధన సంచితాన్ని లేబర్ ఫండ్ అని పిలవబడేది దృఢంగా నిర్ణయించినట్లు, సామాజిక మూలధన భావనను అర్ధం లేనిదిగా చేస్తున్నది.
గమనికలు, ప్రస్తావనలు..
1 ‘సంవత్సరం ‘అన్నది, ఉత్పత్తి కాలాన్ని సూచిస్తుంది. వివరణ సరళత కోసం , సామాజిక ఉత్పత్తి మొత్తానికి సగటు ఉత్పత్తి వ్యవధిని ఊహిస్తున్నాము.
2 ఉత్పాదక కార్మికులు శ్రమ చేసే ప్రక్రియలో వినియోగించుకునే ఉత్పత్తి సాధనాలు, ఈ కార్మికులు వాటిని పునరుత్పత్తి చేయడానికి అవసరమైన మేరకు వ్యక్తిగతంగా వినియోగించుకునేవి ఉత్పాదక ఉత్పాదక వినిమయం కింద వస్తాయి. పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడిదారులకు అదనపు విలువను ఉత్పత్తి చేసేదే ఉత్పాదక శ్రమ. విలువ, అదనపు విలువల ఉత్పత్తికి అవసరం కాని వినిమయమంతా అనుత్పాదకమైనది.
3 కారల్ మార్క్స్, పెట్టుబడి, సంపుటి I ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1967, పేజీ. 568 (K. Marx, Capital, Vol. I, International Publishers, 1967, p. 568.)
4 Ibid., p. 571.
5 Ibid., p. 573.
6 Ibid., p. 578.
7 Ibid., p. 713.
8 విస్తృతమైన చారిత్రక విషయాల కోసం ఇతరాలలో, ibid., part VIII; రోజా లగ్జెంబర్గ్, మూలధన సంచితం, మంత్లీ రివ్యూ ప్రెస్, 1962; P.A. బారన్, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ గ్రోత్, మంత్లీ రివ్యూ ప్రెస్, 1968; V.I. లెనిన్ రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి; సంకలిత రచనలు సంపుటి 1లో ప్రచురించారు. ప్రోగ్రెస్ పబ్లిషర్స్ 1964. (For extensive historical material see, among others, ibid., part VIII; R. Luxemburg, Accumulation of Capital, Monthly Review Press, 1962; P.A. Baran, The Political Economy of Growth, Monthly Review Press, 1968; and V.I. Lenin, The Development of Capitalism in Russia, published in Vol. 3 of Collected Works, Progress Publishers, 1964.)
9 మార్క్స్ , పెట్టుబడి, సంపుటి I, పేజీ 582.
10 Ibid., p. 583.
11 Ibid., pp. 583–84.
12 Ibid., p. 587.
13 Ibid., pp. 591–92.
14 Ibid., p. 152.
15 Ibid., p. 592.
16 Ibid., p. 594.
17 Ibid., p. 605.
18 Ibid., p. 607.
19 Ibid., p. 609.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 38వ భాగం, 37వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
