
అదనపు విలువ మూలం..
సాధారణీకరించబడిన పూర్తిగా అభివృద్ధి చెందిన సరుకుల ఉత్పత్తి పెట్టుబడిదారీ ఉత్పత్తి. దానిలో శ్రమ శక్తే సరుకుగా అవుతుంది. దాదాపు అన్ని వస్తువులూ సరుకులుగా ఉత్పత్తి అవుతాయి. ఆ విధంగా సామాజిక ఉత్పత్తి ‘విలువ ఉత్పత్తి పాత్రను’ పొందుతుంది.
ఒక సరుకుకు సంబంధించి ‘విలువ’ అనే పదానికి రెండు అర్ధాలు(అంశాలు) ఉన్నాయని గుర్తుచేసుకోవాలి. గుణాత్మకంగా, సమాజ మొత్తం శ్రమ సమయంలో ఒక నిర్దిష్ట భాగాన్ని ఖర్చు చేయడాన్ని అది సూచిస్తుంది. అంటే సంపూర్ణ శ్రమ లేదా సాధారణంగా మానవ శ్రమలో కొంత భాగాన్ని చేర్చుతుంది. పరిణామాత్మకంగా, విలువ పరిమాణం, సరుకు ఉత్పత్తి చేయడంలో ఖర్చు చేసిన అవసరమైన సామాజిక శ్రమ. చారిత్రక భౌతికవాద విధాన లక్షణంగా మార్క్స్ విశ్లేషణ పెట్టుబడిదారీ విధాన చారిత్రక నిర్దిష్ట పాత్రను నొక్కి చెబుతుంది.
ఈ చారిత్రక విశిష్టతలో ఇక్కడి ఉత్పత్తి , సరుకు(విలువ) ఉత్పత్తినే(ఇందులో శ్రమ శక్తి తానే సరుకుగా మారుతుంది) కాదు, అదనపు విలువ ఉత్పత్తిని కూడా కలిగి ఉంటుంది. మూలధన సారం విలువ స్వీయ విస్తరణం, ఇందులో పెట్టుబదిదారీ ఉత్పత్తి విధానం(మునుపటి విధానాలకు సంబంధించి) ప్రాథమికంగా విప్లవాత్మకమైన పాత్ర– చారిత్రకంగా దాని తాత్కాలిక పాత్ర రెండూ ఉంటాయి.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో, ఉత్పత్తి ప్రక్రియ – శ్రమ ప్రక్రియపై – మార్క్స్ విశ్లేషణను ఈ వ్యాసం వివరిస్తుంది. మొదట సాధారణంగా శ్రమ ప్రక్రియ అంటే, ఉత్పత్తి ఉపయోగ విలువలు చర్చించబడ్డాయి. దీని తరువాత పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో శ్రమ ప్రక్రియపై ఒక విశ్లేషణ జరుగుతుంది. అదనపు విలువ మూలానికి, ఆ విధంగా పెట్టుబడి విస్తరించే యంత్రాంగ సారానికి ఈ విశ్లేషణ సమాధానం ఇస్తుంది.
కార్మికులను నియమించుకోవడం ద్వారా పెట్టుబడిదారుడు శ్రమ శక్తిని కొన్నప్పుడు, వారికి పనిముట్లను(ఉత్పత్తి సాధనాలను) అవసరమైన ముడి సరుకులను వారి చేత పని చేయిస్తాడు. పెట్టుబడిదారుడి నియంత్రణలోని ఈ శ్రమ ప్రక్రియ కొన్ని ప్రత్యేక సామాజిక లక్షణాలు కలిగి ఉంటుంది. ఆ విధంగా ఉత్పత్తి ప్రక్రియ– ఉత్పత్తి అన్ని యుగాలకూ సాధారణమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ‘ఉత్పత్తి సాధారణంగా ఇప్పటివరకు హేతుబద్ధమైన సంగ్రహణ సాధారణ మూలకాన్ని నిజంగా తెస్తుంది, పరిష్కరిస్తుంది’ అన్న మార్క్స్ వ్యాఖ్యను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి.
అందుచేత మనం మొదట అది నిర్వహిస్తున్న నిర్దిష్ట సామాజిక పరిస్థితుల నుంచి స్వతంత్రంగా శ్రమ ప్రక్రియను పరిగణించాలి.
ఉపయోగ విలువ ఉత్పత్తిగా శ్రమ ప్రక్రియ..
శ్రమ ప్రక్రియ గురించి మొదటి విషయం మనిషి ప్రకృతితో కలిసి పనిచేయడం. ఆవిధంగా కలిసి పని చేయడం ద్వారా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మారుస్తాడు. తనను తాను మార్చుకుంటాడు. మార్క్స్ చెప్పినట్లు మానవుడు ‘నిద్రావస్థలో ఉన్న తన శక్తులను అభివృద్ధి చేస్తాడు. తన అధికారానికి లోబడి ఉండేటట్లు బలవంతపెడతాడు’.
శ్రమ ప్రక్రియలో మనిషి చైతన్యంతో, ఉద్దేశపూర్వక చర్యలో పాల్గొంటాడనే విషయాన్ని ఇది మొదట అనుసరిస్తుంది.
ఈ క్రింది భాగంలో ఈ విషయాన్ని మార్క్స్ నొక్కి చెబుతాడు: ఉత్తమ తేనెటీగల నుంచి చెత్త వాస్తుశిల్పిని వేరుచేసేది ఏమిటంటే, వాస్తవంగా దానిని నిలబెట్టడానికి ముందు వాస్తుశిల్పి తన నిర్మాణాన్ని ఊహలలో నిర్మించడం. ప్రతి శ్రమ ప్రక్రియ చావరలో, దాని ప్రారంభం ముందు కార్మిక ఊహలో ఉన్నదానిని ఫలితంగా మనం పొందుతాము. ఆటను పనిచేసే పదార్ధం రూపంలో మార్పును ప్రభావితం చేయడమే కాదు. కానీ, తన ఇష్టాన్ని లోబరచి ఉంచవలసిన చట్టానికి అతని దినచర్యను అప్పగించే తన స్వంత ప్రయోజనాన్ని కూడా చెల్లుపుచ్చుకుంటాడు.
మూడవది శ్రమించే వ్యక్తి వ్యక్తిగత కార్యకలాపాలకు తోడు శ్రమ సాధనాలు, శ్రమకు లోబడినవి శ్రమ ప్రక్రియలో మనకు ఉన్నాయి. శ్రమకు లోబడి ఉన్నదానిని ప్రకృతి నేరుగా అందించవచ్చు. లేదా మునుపటి శ్రమ ప్రక్రియ ద్వారా దానిని ఉత్పత్తి చేయవచ్చు. ముందు దానికి ఉదాహరణ సహజ ప్రవాహంలోని చేపలు, రెండవ దానికి ఉదాహరణ శుద్ధి చేయవలసిన తవ్వి తీసిన ముడి ఖనిజం. మునుపటి శ్రమ ప్రక్రియ ద్వారా ఇప్పటికే వచ్చిన శ్రమకు లోబడి ఉన్న వాటినన్నిటినీ ముడి పదార్ధాలని మార్క్స్ పిలిచాడు.
మన జాతుల మొదటి సభ్యులకు ప్రకృతిలో కనపడిన రాళ్ళే పనిముట్లుగా (శ్రమ సాధనాలుగా) ఉపయోగ పడినప్పటికీ, మానవ నాగరికత ఒక నిర్దిష్ట దశకు చేరుకున్న తరువాత, శ్రమ సాధనాలన్నీ స్పష్టంగా ఇంతకు ముందు వెచ్చించిన మానవ శ్రమ ఫలితాలే. వాస్తవానికి ‘శ్రమ పరికరాల ఉపయోగం, కల్పన మానవ శ్రమ ప్రక్రియ ప్రత్యేక లక్షణమని’ మార్క్స్‌తో ఎవరైనా చెప్పవచ్చు.
శ్రమ ప్రక్రియలోని మూడు ‘ప్రాథమిక అంశాలు’: మనిషి శ్రమకు లోబడి ఉన్నది, శ్రమ సాధనాలు పోషిస్తున్న సాపేక్ష పాత్రలు ఏమిటి అనేది సహజంగా వచ్చే ప్రశ్న. పెట్టుబడిదారీ సిద్ధాంతమూ, పెట్టుబడిదారీ అర్ధశాస్త్రమూ ఈ మూడు అంశాలనూ ఒకేలా చూస్తాయి. అంటే శ్రమ ప్రక్రియలో కలిసి ఉన్న ఉత్పత్తి సాధనాలు, సజీవ మానవ శ్రమకూ మిగిలిన రెండు అంశాలకూ మధ్య తేడాను అవి చూడవు.
చారిత్రక భౌతికవాద ధృక్పథంలో తలెత్తుతున్న మార్క్స్ తీసుకున్న స్థితి, పెట్టుబడిదారీ వాదన– తీసుకున్న స్థితికి పూర్తిగా వ్యతిరేకం. మార్క్సిస్టు దృక్పథంలో శ్రమ ప్రక్రియలో మనిషి కార్యాచరణ క్రియాశీలమైనది. శ్రమ ప్రక్రియలోని ఉత్పత్తిలో ఈ కార్యాచరణ లేదా ప్రవాహం స్తంభింపజేయబడుతుంది.
మార్క్స్‌ను ఉదహరిస్తే: శ్రమ ప్రక్రియలో శ్రమ సాధనాల సహాయంతో జరుగుతున్న మనిషి కార్యాచరణ ప్రారంభం నుంచి రూపొందించిన, పని చేసిన పదార్ధంలో మార్పులను ప్రభావితం చేస్తుంది. ఉత్పత్తిలో ప్రక్రియ దాగి ఉంటుంది. శ్రామికుడిలో కదలికలాగా కనపడిందిప్పుడు ఉత్పత్తిలో చలనం లేని స్థిరమైన లక్షణంగా కనపడుతుంది. మొత్తం ప్రక్రియను ఫలిత కోణం నుంచి మనం పరిశీలిస్తే పనిముట్లు, శ్రమకు లోబడినది రెండూ కూడా ఉత్పత్తి సాధనాలే శ్రమ కూడా ఉత్పాదక శ్రమే.
పనివాని చైతన్యయుత, ఉద్దేశపూర్వక చర్య, మార్క్స్ దృష్టిలో శ్రమ ప్రక్రియలో క్రియాశీల అంశం. ప్రకృతితో పనిచేసే మనిషి ద్వారా, ఈ ప్రక్రియలో ప్రకృతినీ, తనను తానూ మార్చుకోవడం ద్వారా ఆవిధంగా నేర్చుకోవడం ఉత్పాదక శక్తులను అభివృద్ధి చేయడం వలన మానవ సమాజాల అభివృద్ధి జరుగుతుందనే చారిత్రక భౌతికవాద ధృక్పథం తార్కిక కోణ ఫలితం అటువంటి దృక్కోణం.
మనిషి గురించి ఆవిధంగా మాట్లాడేటప్పుడు, ఉత్పత్తి ప్రక్రియ క్రమంలో మనం మానవుల మధ్య ఉన్న సంబంధాలను సంక్షిప్తం చేస్తున్నామని ఎత్తిచూపాలి. ఉత్పత్తి సంబంధాల ఈ అంశం, వర్గపోరాటాన్ని అది అనుసరించి ఉండడం మార్క్సిస్టు దృక్పధంలో ఖచ్చితంగా కీలకం, వదిలివేయడం కానీ ఉత్పాదక శక్తుల కోణం నుంచి వేరుచేసి ఒంటరిదానిగా పరిగణించడం కానీ చేయకూడదు. మన(క్షణిక) సంక్షిప్తీకరణకు ఉన్న ఏకైక సమర్ధన ఈ దిగువన ఇస్తున్న మార్క్స్ చెప్పినది:
శ్రమ ప్రక్రియ పైన చెప్పిన విధంగా దాని సాధారణ ప్రాథమిక అంశాలలో పరిష్కరించబడింది. అంటే, వినియోగ విలువల ఉత్పత్తి చేసే ఉద్దేశంతో చేసే మానవ చర్యలు, అది మానవుని ఉనికికి ప్రకృతి విధించిన శాశ్వత నియమం, అందువల్ల ఆ ఉనికి ప్రతి సామాజిక దశ నుంచి స్వతంత్రంగా ఉంటుంది. లేదా అందుకు బదులుగా అటువంటి ప్రతి దశకు అది సాధారణం. అందుచేత ఇతర కార్మికులతో పాటు మన కార్మికుడు ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం లేదు. మనిషి, అతని శ్రమ ఒక వైపునా ప్రకృతి, దాని పదార్ధాలు మరొక వైపునా సరిపోతాయి.
మార్క్స్ తన శ్రమ ప్రక్రియ విశ్లేషణలో వాడిన ‘మనిషి’ అన్న పదం కొంత మానవ శాస్త్ర సారాంశం ద్వారా ‘మానవ స్వభావంగా’ వివరించతగ్గది కాదు. అది మానవుని ఉనికికి ప్రకృతి విధించిన శాశ్వత నియమాన్ని బయటకు తెచ్చే క్రమంలో ఈ పదం మనసారా ఉపయోగించబడింది. మానవ శ్రమ ఉద్దేశపూర్వక జోక్యం లేకుండా ప్రకృతి సంపద తరచుగా కుళ్ళిపోగా, శ్రమ సాధనాలు తుప్పు పట్టి పాడవుతాయన్నది స్పష్టం. మార్క్స్ చెప్పినట్లు ‘ఇనుముకు తప్పు పడుతుంది, కలప పాడవుతుంది. మనం నేయని లేదా అల్లని దారం వృధాచేసిన పత్తి. సజీవ శ్రమ వీటిని స్వాధీనం చేసుకోవాలి, వాటి మరణ- నిద్ర నుంచి మేల్కొలపాలి. వాటిని కేవలం సంభావ్యత ఉన్న ఉపయోగ విలువల నుంచి నిజమైన, ప్రభావవంతమైన వాటిగా మార్చాలి.’
పెట్టుబడిదారుడు తన స్వంత వినియోగానికి ఉపయోగ విలువలను ఉత్పత్తి చేయడంలో ఆసక్తి చూపడు. సరుకులను(విలువలను) ఉత్పత్తి చేయడానికి, అదనపు విలువను పొందడానికి అతను శ్రమ శక్తినీ, ఉత్పత్తి సాధనాలనూ కొంటాడు. ఇది పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియకు దాని నిర్దిష్ట సామాజిక లక్షణాలను ఇస్తుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 15వ భాగం, 14వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.