ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) కొత్త నివేదిక ప్రకారం, 2024లో భారతదేశం మొత్తం 260 డోపింగ్ ఉల్లంఘనలను నమోదు చేసింది– అన్ని దేశాల కంటే కూడా ఇది చాలా ఎక్కువ. దీంతో భారతదేశం వరుసగా మూడవ సంవత్సరం ప్రపంచంలో అత్యధిక డోపింగ్ ఉల్లంఘనలు జరిగిన దేశంగా నిలిచింది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ రెండవ స్థానం, ఇటలీ మూడవ స్థానంలో నిలిచాయి.
న్యూఢిల్లీ: డోపింగ్ కేసుల్లో భారత అథ్లెట్లు మరోసారి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) కొత్త నివేదిక ప్రకారం, 2024లో భారతదేశం మొత్తం 260 డోపింగ్ ఉల్లంఘనలను నమోదు చేసింది, అన్ని దేశాల కంటే కూడా ఇది చాలా ఎక్కువ.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, డిసెంబర్ 16న వాడా వెబ్సైట్లో విడుదల చేసిన ఈ నివేదికలో, భారతదేశం వరుసగా మూడవసారి ప్రపంచంలోనే అతిపెద్ద డోపింగ్ నేరస్థ దేశంగా పేర్కొనబడింది.
2030లో కామన్వెల్త్ క్రీడల శతాబ్ది ఎడిషన్‌ను నిర్వహించడానికి భారతదేశం సిద్ధమవుతుంది. ఈ తరుణంలో, భారతదేశ అత్యధిక డోపింగ్ రికార్డును వెల్లడించే ఈ నివేదిక వెలువడింది. 2036 ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహించడానికి భారతదేశం కృషి చేస్తోంది.
దీనికంటేముందు, భారత ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో పునరావృతమయ్యే డోపింగ్ కేసులపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఆందోళన వ్యక్తం చేసింది.
వాడా నివేదిక ప్రకారం, భారతదేశంలో డోపింగ్ సంబంధిత కేసుల సానుకూలత రేటు 3.6 శాతం, అంటే మొత్తం 260 కేసులు నమోదయ్యాయి, ఇది అన్ని దేశాలలోకంటే అత్యధికం.
ది హిందూలో వచ్చిన కథనం ప్రకారం, 2024లో క్రీడా విభాగాలలో అథ్లెటిక్స్‌లో అత్యధికంగా డోపింగ్ 76 కేసులు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో 43, రెజ్లింగ్‌లో 29 కేసులు నమోదయ్యాయి.
ఇతర దేశాలలో, 2024లో 91 మంది అథ్లెట్లకు పాజిటివ్ రావడంతో ఫ్రాన్స్ రెండవ స్థానంలో ఉండగా, ఇటలీ 85 కేసులతో మూడవ స్థానంలో ఉంది.
ఈ నివేదిక విడుదలైన తర్వాత, భారతదేశ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(ఎన్ఏడీఏ) డోపింగ్‌కు వ్యతిరేకంగా తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది.
“గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ డోపింగ్ నిరోధక చట్రాన్ని గణనీయంగా బలోపేతం చేశారు. క్రీడలలో డోపింగ్ సమస్యను ఎదుర్కోవడానికి, నాడా ఇండియా పరీక్షల సంఖ్యను పెంచడమే కాకుండా విద్య, అవగాహనను కూడా నొక్కి చెప్పింది” అని నాడా తన ప్రకటనలో పేర్కొన్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
