“ఒకవేళ సోనం జాతి వ్యతిరేకుడైతే , ప్రభుత్వం ఆయన ప్రయత్నాలకు ఎందుకు అవార్డులిచ్చింది?”
న్యూఢిల్లీ: సోనం వాంగ్‌చుక్ భార్య, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లద్దాఖ్(హెచ్‌ఐఏల్)డైరెక్టరు గీతాంజలి ఆంగ్మో కేంద్ర ప్రరభుత్వాన్ని సవాల్ చేశారు. పర్యావరణ కార్యకర్తయినటువంటి తన భర్త సోనమ్ వాంగ్చుక్పై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.
విదేశాలతో సంబంధాలున్నాయని, ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ గత వారం సోనం వాంగ్చుక్ను కేంద్ర ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. కఠినమైన జాతీయ భద్రత చట్టం క్రింద తనను నిర్బంధించింది. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన సోనం భార్య గీతాంజలి– ప్రభుత్వం చేసిన ఆరోపణలను నిరూపించాలని కోరారు.
“సెప్టెంబరు 27న వాంగ్చుక్ను పోలీసులు నిర్బంధించి, రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు తరలించారు. అయినప్పటికీ ఇంతవరకు నిర్బంధ ఆర్డర్‌ను మాకు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి మేము న్యాయవ్యవస్థ ద్వారా నా భర్తను కాపాడుకోవడానికి పోరాడుతాము. అంతేకాకుండా వాస్తవాలు వెలుగు చూసేవరకు మేము విశ్రాంతి తీసుకోము” అని గీతాంజలి అన్నారు.
సోనం చేసిన ఆవిష్కరణలను, భారతదేశానికి అందిస్తున్న సేవలను ఆమె గుర్తు చేశారు.
“నా భర్త ఆవిష్కరణలు జాతీయంగా– అంతర్జాతీంగా గుర్తింపు పొందాయి. లద్దాఖ్‌లో సౌరఊష్ణ భవనాల రూపకల్పనకు హెచ్ఐఏల్కు ఉత్తమ బహుమతిని కేంద్ర ఇంధన శాఖామంత్రి ఆర్కే సింగ్ అందజేశారు. విశ్వవిద్యాలయంలోని మంచు స్థూపం ప్రాజెక్టుకు కూడా అవార్డును కేంద్ర గిరిజన వ్యవహరాల మంత్రిత్వ శాఖ బహుకరించింది”అని చెప్పారు.
“ప్రస్తుత ప్రభుత్వం హెచ్ఐఏల్కు ఉత్తమ ఎకో ప్రాజెక్టు అవార్డును ప్రకటించింది. ఒకవేళ సోనం జాతి వ్యతిరేకుడైతే, ఆయన పడిన కష్టాలకు ప్రభుత్వం ఎందుకు అవార్డులిస్తోంది? నెల రోజుల్లోపే సోనం ఎందుకు జాతి వ్యతిరేకుడిగా మారాడు? తనను ఇరికించడానికే కావాలని ఈ నిందలన్నీ మోపారు” అని ఆమె చెప్పుకొచ్చారు.
ఇతరులు ఎలా ప్రేరింపించబడతారు?
జాతీయ, అంతర్జాతీయంగా తన భర్త ఆవిష్కరణలు గుర్తింపు పొందాయని, లద్దాఖ్ సమస్యపై పోరాడుతున్న కారణంగా ప్రభుత్వం తన భర్తను ఇరికించడానికి ప్రయత్నిస్తుందని, అయితే తన భర్తను నేరస్తుడిగా చూడటం సిగ్గుచేటని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద మీడియాతో మాట్లాడుతూ గీతాంజలి మండిపడ్డారు.
లద్దాఖ్‌లో 1.8 లక్షల చదరపు అడుగుల్లో సౌరఊష్ణ నిర్మాణాలను హెచ్‌ఐఏల్ రూపొందించిందని తన పనుల గురించి ఆమె వివరించారు. ఈ నిర్మాణాలను అధిక ఎత్తులోని మంచు ఎడారిలో సైనికులు కొన్నింటిని ఉపయోగిస్తున్నారని, ఇది ప్రతి నెల 4,000 టన్నుల కంటే ఎక్కువ కార్బన్‌ను ఆదా చేస్తుందని అన్నారు.
“ప్రపంచం మొత్తం కార్బన్ తటస్థత గురించి మాట్లాడుతోంది. కానీ లద్దాఖ్ మాత్రం కార్బన్‌కు ప్రతికూలంగా ఉంది. ప్రజలు నెట్ జీరో గురించి మాట్లాడుతున్నారు. మేము మాత్రం నెట్ పాజిటివ్‌గా ఉన్నాము. ఇలాంటి మంచి పనుల వెనుక ఉన్న వ్యక్తిని నేరస్తుడిగా చూస్తూ– చూపిస్తూ కర్ఫ్యూతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇలా అయితే, భారత్ ఎలా విశ్వగురుగా మారుతుంది? ఇతరులు ఎలా ప్రేరేపితులవుతారు” అని ఆమె ప్రశ్నించారు.
లద్దాఖ్ రాజధాని లేహ్ నగరంలో కర్ఫూ అమలులవుతోంది. మరో అక్టోబరు 3 మంగళవారం వరకు ఇంటర్నెట్పై నిషేధాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పొడిగించింది.
“ఎవరి పేరును ప్రస్తావించకుండా ప్రభుత్వ అధికారులు నా భర్తకు వ్యతిరేకంగా నిరాధారమైన ఆరోపణలను మోపారు. మా పనుల వల్ల ఎవరైనా సమస్యను ఎదుర్కొంటే, వారికి నేను బహిరంగంగా సవాల్ చేస్తున్నాను. చేసిన ఆరోపణలన్నీ తప్పని నిరూపించడానికి మా దగ్గర నిజాలు, సాక్ష్యాలు, పత్రాలున్నాయి” అని ఆంగ్మో చెప్పారు.
మంచు స్థూపం- భవిష్యత్తు పరిశోధన..
లద్దాఖ్ కోసం పోరాడుతున్న వాంగ్చుక్ను అధికారులు కక్షగట్టి వేటాడుతున్నారని హెచ్‌ఐఏల్ డైరెక్టర్, సామాజిక ఔత్సాహికురాలు ఆవేదన వ్యక్తంచేశారు. హెచ్ఐఏల్లో ఆర్ధిక అవకతవకలున్నాయని, ఎఫ్ఆర్సీఏ ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఆంగ్మో తిరస్కరించారు. గతవారం రద్దు చేసిన ఎఫ్ఆర్సీఏ లైసెన్సు ఉన్న తమ ఎన్జీఓ ఎలాంటి విదేశీ విరాళాలను అంగీకరించలేదని స్పస్టం చేశారు.
“మా భవిష్యత్తు పరిశోధనలను విదేశీ విశ్వవిద్యాలయాలు చేస్తున్నాయి. ఈ విషయంలో సిగ్గుపడాల్సిందేమి లేదు. ఈ చెల్లింపులన్నీ సర్వీసు ఒప్పంధాల్లోకి వస్తాయి. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు లేవని చివరికి సీబీఐ కూడా అంగీకరించింది. ఒక భారతీయ విశ్వవిద్యాలయ పరిశోధనకు బయటి దేశాల్లో విలువ ఇచ్చి ప్రశంసించడం మనందరికి గర్వకారణం” అని అన్నారు.
“హెచ్‌ఐఏల్ అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో అవగహాన ఒప్పందాలు చేసుకుంది. వివిధ కోర్సులను పూర్తి చేసి ఇప్పటి వరకు 400కు పైగా హెచ్‌ఐఏల్ విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారు. మా పరిశోధనను యూటీ ప్రభుత్వం(లద్దాఖ్‌లో) దత్తతకు తీసుకుంది. గత సంవత్సరం నుంచి మంచు స్థూపానికి టెండరు వేసి, ఈ ప్రాంతం మొత్తంలో అమలు చేస్తున్నారు. దీంతోపాటు కొత్త హోటళ్లు, వాణిజ్య భవనాల్లో ఖచ్చితంగా సౌరవేడి పరికరాలను అమర్చాలని, కొత్త పర్యాటక విధానం నొక్కి చెప్పింది” అని తెలిపారు.
పాకిస్తాన్ పర్యాటన..
పాకిస్తాన్‌తో తన భర్తకున్న సంబంధాల ఆరోపణలపై స్పందిస్తూ, “ఫిబ్రవరిలో ఐక్యరాజ్యాలు, ఇస్లామాబాద్ ఆధారిత డ్వాన్ మీడియా గ్రూపు సంయుక్తంగా– వాతావరణంపై పొరుగుదేశంలో సదస్సును నిర్వహించాయి. ఆ సదస్సులో వాంగ్‌చుక్ పాల్గొన్నారు” అని ఆమె తెలియజేశారు.
“ఇందులో ఏమి తప్పు ఉందని నేను అడుగుతున్నాను? హిందూకుశ్ పర్వతాలు ఎనిమిది దేశాలను తాకుతూ రెండు బిలియన్ల కంటే ఎక్కవ మంది ప్రజలకు నీరును అందిస్తున్నాయి. తన భర్త వేదికపై నుంచి “మిషన్ లైఫ్”పై ప్రధాని మోడీని ప్రశంసించారు” అని గుర్తుచేశారు.
ఒక పాకిస్తానీ పౌరునితో తన భర్తకు సంబంధాలున్నాయన్న ఆరోపణలకు హోంమంత్రిత్వ శాఖ సమాధానం చెప్పాలని గీతాంజలి డిమాండ్ చేశారు. ఒక పాకిస్తానీ పీఐఓతో వాతావరణ కార్యకర్తకు సంబంధం ఉందని, వీరు తరుచూ సరిహద్ధు సమాచారాన్ని చేరవేస్తుంటారని, గత వారం ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే ఎలాంటి సమాచారాన్ని చేరవేస్తున్నారన్న దానిపై ఆ ప్రకటన స్పష్టంగా చెప్పలేదు.
“లద్దాఖ్‌లో ఒక పాకిస్తానీని చూసినట్లయితే, భద్రతా నియమాలను ఎందుకు ఉల్లంఘించారు? ఇలా స్వేచ్ఛగా తిరగడానికి ఎందుకు అనుమతించారు?” అని ఆమె నిలదీశారు.
జాతి వ్యతిరేకులకు ప్రభుత్వం అవార్డు ఇస్తుందా?
భారతీయ సార్వభౌమత్వం ప్రాజెక్టుపై తన భర్త నిధులను స్వీకరించారని హోంమంత్రిత్వ శాఖ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, “స్థానికులు ఎలా స్వయం సమృద్ధి కాగలరో చెప్పె ఆహార సార్వభౌమత్వానికి తన భర్తను శిక్షించడం కోసం జాతీయ భద్రతగా అన్వయించారు. ఇవి నిరాధారమైన ఆరోపణలు. అంతేకాకుండా, హాస్యాస్పధమైనవి” అని ఆంగ్మో కొట్టిపారేశారు.
“మెగసెసే అవార్డును 60 మంది భారతీయులు గెలుచుకున్నారు. ఈ గొప్ప విజయాన్ని, నా భర్త ప్రతిష్టను దెబ్బతీడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం 60 మందిలో నుంచి 20 మందికి పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారు. దీనిని ఈ ప్రభుత్వం జాతి వ్యతిరేకులకు అవార్డులిచ్చిందని అర్ధం చేసుకోవాలా?” అని ప్రశ్నించారు.
లేహ్‌లో సెప్టెంబరు 24న పౌరుల నిరసనల సందర్బంగా చెలరేగిన హింసతో భద్రతా దళాలు జరిపిన కాల్పుల వల్ల నలుగురు చనిపోయారు. ఈ సంఘటనకు లెఫ్టినెంట్ గవర్నర్ కావిందర్ గుప్తా నేతృత్వంలోని లద్దాఖ్ కేంద్ర పాలిత పరిపాలన, పోలీసు డైరక్టరు జనరల్ ఎస్డీ జాంవాల్ దీనికి కారణమని ఆమె నిందించారు.
“సోనం పార్కులో కూర్చున్నారు, ఆయనకు ఎలాంటి ఆలోచనలేదు. తన భర్త గాంధేయవాద విలువలకు కట్టుబడి ఉన్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా ఆయన హింస లేదా రెచ్చగొట్టడానికి పాల్పడలేదు. ఇప్పుడు హింస సంభవిస్తే దానికి ఆయన వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఎందుకు హింస జరిగిందనే దానిపై లద్దాఖ్ ప్రజలకు యూటీ పరిపాలన– ఎల్జీ డీజీపీ సమాధానం చెప్పాల్సిందే” అని గీతాంజలి డిమాండ్ చేశారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
