భారతదేశం “విశ్వగురువు”గా మారిందని, లేకుంటే ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందంటూ ఎన్డీఏ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తరుచుగా చెప్పుకుంటూ వస్తోంది. ఈ బ్రాండింగ్ ప్రక్రియలో అప్పుడప్పుడు ఓటమి పాలౌతున్న భారతదేశాన్ని ప్రపంచం ఎలా చూస్తుంది?
భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు, హిందుత్వ పెరుగుదలను భారత్ బయటున్న ప్రపంచ సంఘాలు- సంస్థలు గమనిస్తూ, విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్య స్థితిగతులపై అనేక దేశాల పార్లమెంటేరియన్ల నుంచి యూఎన్ నిపుణులు, అంతర్జాతీయ మీడియా, పౌరసమాజ సమూహాలు వరకు ఏం చెప్పుతున్నారో తెలియజేస్తున్నాము.
అంతర్జాతీయ మీడియా కథనాలు
సండే టైమ్స్, శ్రీ లంక, నవంబర్ 2
బంగ్లాదేశ్, శ్రీ లంక, నేపాల్‌లలో బలహీన పరిపాలనే ప్రభుత్వాల మార్పిడికి కారణమైందని నరేంద్ర మోడీ “పరిపాలన మోడల్”పై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలపై కిషాలి పింటో- జయవర్ధనే స్పందించారు. “శ్రీలంకలో పరిపాలన ఆరోగ్యకరంగానే ఉంది. మోడీ పరిపాలన మోడల్ అనడానికి బదులుగా నిరంకుశ మోడల్ లేదా డొనాల్డ్ ట్రంప్ పరిపాలన మోడల్‌గా అభివర్ణిస్తే బాగుంటుంది”అని ఆమె సూచించారు.
అంతేకాకుండా, “మంచి ఉద్దేశంతోనే అయినప్పటికీ అర్ధాలను వ్యతిరేకించే దేశాలే ఇలా అతిగా మాట్లాడుతుంటాయి.తమ అంతర్గత రాజకీయ క్రియాశీలతలో “జోక్యం” చేసుకుంటున్నారంటూ తమ “పెద్దన్నయ్య”ను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు”అని ఆమె రాశారు.
సీఎన్ఎన్, యూఎస్, నవంబరు 16
ఒక సదస్సును ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిపాలన విభాగం రద్దు చేసి “అదే రోజు ఆవు సంక్షేమంపై ప్రోత్సాహక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించింద”ని, మోడీ ప్రభుత్వం విద్యా సంస్థపై ఎలా ఒత్తిడి పెంచుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ”గా నిలుస్తుందని, విశ్వవిద్యాలయం అధ్యాపకులు, విద్యార్ధులు తెలియజేశారని ఇషా మిత్రా కథనం పేర్కొన్నది.
“భూమి, ఆస్తి, ప్రజాస్వామ్య హక్కుల రద్దు” సదస్సు అంశమని పేర్కొన్నది. అంతేకాకుండా, ల్యాండ్ రైట్స్ ఇనిషియేటివ్ వ్యవస్థాపక డైరెక్టర్ నమితా వాహి సదస్సు ముఖ్యవక్తగా ఉన్నారని తెలియజేసింది. భూహక్కులను మోడీ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ, భూచట్టాల అండతో వివిధ ప్రాజెక్టుల కోసం ఆస్తులను సేకరించడాన్ని ఈ సంస్థ చాలా కాలంగా విమర్శిస్తుందని చెప్పుకొచ్చింది.
బీబీసీ, యూకే, నవంబరు 24
2025 నవంబరులో ప్రారంభించిన ఎస్ఐఆర్ వల్ల ఢిల్లీలో నివసిస్తున్న వలస కార్మికులు వ్యక్త పరచిన భయంకర అనుభవాల గురించి అభిషేక్ డే బీబీసీ వ్యాసంలో ప్రస్థావించారు.
దేశంలోని 12 రాష్ట్రాలలో సమైఖ్యపర పరిపాలన ప్రాంతాలలో “సుమారు 510 మిలియన్ ఓటర్ల” జాబితాను సమూలంగా సవరించాలనేది ఎస్ఐఆర్ లక్ష్యంగా ఉంది. ఈ నేపథ్యంలో “జీతభత్యాలు, ఉద్యోగం కోల్పోతామన్న భయంలో ఢిల్లీ వలస కార్మికులు ఉన్నారు. బంగ్లాదేశీయులమనే అనుమానంతో తమ పౌరసత్వాన్ని రుజువుచేసుకోవాలని కోరుతారనే భయంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులు సతమతమవుతున్నారు.
అయితే, ఎస్ఐఆర్ ఫారంలో ఆన్లైన్ ద్వారా కొన్ని నిబంధనలను నింపాల్సిందిగా చేర్చారు. తమకు ఈ ప్రక్రియ గురించి అసలు తెలియదని “అది చాలా ప్రమాదకరమైనది”గా గుర్తించినట్టు అనేక మంది వలస కార్మికులు తెలియజేశారు.
భారతీయ డయాస్పోరా, పౌర సమాజ గ్రూపులు
జార్ఖండ్‌కు హిందీ జర్నలిస్టు రూపేశ్ కుమార్ 2025 అక్టోబరు నాటికి 1200 రోజుల జైలు శిక్ష పూర్తి చేసుకోవడంతో; ఈ సందర్భంగా ఇన్సాఫ్ ఇండియా నవంబరు 7న ఒక వ్యాసాన్ని విడుదల చేసింది.
“ప్రజానుకూల కథనాల వల్ల రాజ్యం అణచివేత స్పష్టంగా తెలియజేస్తుంది”అని ఇన్సాఫ్ ఇండియా సంస్థ పేర్కొన్నది. న్యాయపరంగా పోరాడటానికి వ్యక్తిగతంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటునప్పటికీ “జైలులో జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి నిరంతరం రూపేశ్ మాట్లాడుతున్నారని; జైలులో ఖైదీల పట్ల చిన్న చూపు, హింసకు వ్యతిరేకంగా గళమేత్తుతున్నారని ఇన్సాఫ్ తెలియజేసింది.
అకారణంగా తనకు జైలు శిక్షవిధించారని రూపేశ్ స్వయంగా బాధపడుతున్న దాని కంటే; ఎక్కువగా తన కుటుంబం ముఖ్యంగా– తన భార్య ఇప్సా షటాక్షి, తండ్రి జైలుకు వెళ్లిన సమయంలో ఐదు సంవత్సరాలున్న తన కొడుకు బాధితులని వార్తా కథనం తెలియజేసింది.
సామాజిక కార్యకర్త ప్రియాంషు కష్యప్కు చట్టవిరుద్ధంగా జైలు శిక్ష విధించి వంద రోజులు పూర్తయిన సందర్భంగా పలు అంతర్జాతీయ సంఘాలు– సంస్థలు నవంబరు 9న ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. కష్యప్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో ఫ్రంట్ యాంటీ-ఇంపీరియలిస్టు(ఫ్రాన్స్), ఇన్సాఫ్ ఇండియా, లాల్ మోర్చా, పోర్టుల్యాండ్ యాంటి ఇంపీరియలిస్ట్ యాక్షణ్ రెవల్యూషనరీ మార్క్సిస్టు స్టడీ గ్రూపు(యూఎస్), ఆర్ఎస్ఓ- బర్కెలీ, ఆర్ఎస్ఓ- డేవీస్, ఆర్ఎస్ఓ- సాంతా క్రూజ్, సూపర్నోవా రెవీ మర్క్సిస్టు లెనినిస్టు(ఫ్రాన్స్), ది ఎడిటోరియల్ బోర్డు ఆఫ్ ది వర్కర్, రైట్ టు రెబల్ సాట్స్, సాన్ అంటోనియో టాక్స్స్తో పాటు అనేక భారతీయ పౌర సమాజ సంఘాలు కూడా ఉన్నాయి.
కష్యప్ అరెస్టు, నిర్బంధం “మొత్తం ప్రక్రియ” రాజ్యంగం కల్పించిన హక్కుల ప్రక్రియను ఉల్లంఘించినట్టున్నాయని ఈ సంఘాలు– సంస్థలు నొక్కి చెప్పారు.
నిపుణులు మాట
భారత్ బంగ్లాదేశ్‌ల మధ్య “ఒక ప్రమాదకరమైన సమరూపత” ఉద్భవిస్తుందని జియోపొలిటికల్ & అంతర్జాతీయ సంబంధాల పరిశోధకులు అర్మాన్ అహ్మద్ నవంబరు 17న ప్రచురించిన తన విశ్లేషణా పత్రంలో పేర్కొన్నారు.
“తన లౌకిక ప్రాజెక్టు మీద నైతిక అధికారిక విషయంలో” షేక్ హసినా ప్రభుత్వం రాజీపడిన తర్వాత; ఇస్లామిక్ రాజకీయాల పెరుగుదలను బంగ్లాదేశ్ చవిచూస్తుంది. దీన్ని భారత్‌లోని “మెజారిటీ జాతీయవాదం” మరింత ఉత్ప్రేరేపిస్తోంది. “హిందూరాష్ట్ర సృష్టిస్తున్న ఆవాహన కారణంగా “కోపం, ఆందోళనలకు” దారి తీయగా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఆ భావనకు మేత వేస్తూ మరింత పెంచుతున్నారు. “ఒకవేళ భారత్ నిర్లజ్జగా హిందు అయితే బంగ్లాదేశ్ గర్వంగా ముస్లిం ఎందుకు కాలేదు?” దక్షిణాసియా “సున్నితమైన సంతులనాన్ని” “హిందుత్వ విజయోత్సాహం” తుప్పుపట్టినప్పటి నుంచి ఇతర మినహయింపు సిద్ధాంతాల మాదిరిగానే మెజారిటీవాద అంటువ్యాధి అంటుకుంది.
పహల్గాం దాడి
పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న టెర్రరిస్టుల దాడి తర్వాత భారతీయ అధికారులు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని ఐక్యరాజ్య సమితి నిపుణుల సమూహం ఆందోళనవ్యక్తం చేసింది. నవంబరు 24న ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
ఏకపక్ష అరెస్టులు, పోలీసు స్టేషనులలో అనుమానాస్పద మరణాలు, వేధింపులు, శిక్షాత్మకమైన ఇళ్ల కూల్చివేత్తలు, ఇంటర్నెట్ సేవల నిలుపుదల; సుమారు 8,000 సామాజిక మాధ్యమాల నిషేధం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టుగా ప్రకటన పేర్కొన్నది.
అంతేకాకుండా ఇలాంటి ఉల్లంఘనలు ఇతర రాష్ట్రాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయని నిపుణులు అన్నారు. కశ్మీరీ విద్యార్థుల మీద నిఘా, వారిని వేధింపులకు గురిచేయడం. ఇంకా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా హింసకు ప్రేరేపిస్తున్నారని “అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులే అగ్గికి ఆజ్యం పోస్తున్నారు”అని, “మితిమీరిన తీవ్రవాద వ్యతిరేక చర్యలు” సమాజంలో మరిన్ని చీలికలు ఫిర్యాదులను తీసుకువచ్చి మరింత హింసకు దారి తీయగలవని నిపుణులు హెచ్చరించారు.
నేరపూరితమైన కుట్రలకు పాల్పడుతున్నారని, “ఉగ్రవాద భావజాలాన్ని” విస్తరింపచేస్తున్నారని పేర్కొంటూ జమ్మూకశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు ఏజెన్సీ కశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై దాడి అనంతరం కశ్మీర్ టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్ అనురాధా బాసిన్ రాసిన తీవ్ర ఖండన నవంబరు 25న ప్రచురించబడింది.
“ఈ అసత్య, రాజకీయ దురుద్దేశంతో కూడిన కల్పిత ఆరోపణలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. తమ విశ్వతనీయతను ప్రతిష్టను దెబ్బతీసి, తమనోరు మూయించడానికి ఈ చర్య మరో ప్రయత్నం. పత్రికా స్వేచ్ఛను ఒక పద్ధతి ప్రకారం అణచివేయాలన్న విస్తృత ఆలోచలనలో భాగమే ఈ దాడ”ని అభివర్ణించారు.
ఇంకా “ఈ ప్రాంతంలో స్వతంత్ర మీడియాను అణచివేసి, తొక్కి పెట్టడానికి కావల్సిన వాతావరణాన్ని భారత్- పాకిస్తాన్ సృష్టిస్తున్నాయి”అని బాసిన్ ఆరోపించారు.
అమ్నెస్టీ ప్రకటన
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నవంబరు 26న రెండు కథనాలనువిడుదల చేసింది. స్టిచ్డ్అప్: బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక జౌళి కార్మికులకు సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను నిరాకరించగా, ఫ్యాషన్‌ను వదిలేసింది:
“బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, శ్రీలంకలో అణిచివేతకు గురవుతూ, కార్మిక హక్కులను కాలరాస్తున్నప్పటికీ “గ్లోబల్ గార్మెంట్ పరిశ్రమ లాభాల్లో కొనసాగుతుందనడానికి సాక్ష్యం ఇదే”; జౌళి కార్మికుల హక్కులపై ఫ్యాషన్ బ్రాండ్లు పోరాడాలి. “ఫ్యాషన్ బ్రాండ్లు, ఫ్యాక్టరీ యజమానులు, ప్రభుత్వాలది అపవిత్ర కలయిక”అని అమ్నెస్టి సెక్రటరి జనరల్ ఎజ్నిస్ కల్లామార్డ్ అన్నారు.
“ఎక్కువగా పశ్చిమ ఫ్యాషన్ కంపెనీల వాటాదారుల కోసం లాభాలను అర్జించడానికి నిరంతరంగా కృషి జరుగుతుంది. భారత్‌లోని జౌళి పరిశ్రమలో అధికంగా కార్మికులు ఇంటి వద్ద నుంచే పని చేస్తారు. అయినా దేశ కార్మిక చట్టాలు వారిని ఉద్యోగులుగా గుర్తించకపోవడంతో వారు పింఛన్లు, ఇతర ఉపాధి సంబంధిత సామాజిక భద్రత లాభాలకు లేదా యూనియన్ సభ్యత్వానికి అర్హులుకారు”అని నివేదిక తెలియజేసింది.
ఫౌండేషన్ డయాస్పోరా
ఫౌండేషన్ డయాస్పోరా ఇన్ యాక్షన్ ఫర్ రైట్స్ అండ్ డెమోక్రసీ(డీఏహెచ్ఆర్డీ), “బీహర్ 2025 శాసనసభ ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు నుంచి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)అధికారిక సామాజిక మాధ్యమాల ఛానెళ్లు, హిందుత్వ నెట్‌వర్క్‌ల సమన్వయంతో ముస్లిం వ్యతిరేక విద్వేషపూరిత ప్రసంగాల ప్రచారాన్ని చేపట్టాయి”అని నెదర్లాండ్స్ ఆధారిత ఒక భారతీయ డయాస్పోరా సంఘం విడుదల చేసిన ఒక నివేదిక తెలియజేసింది.
ఈ నివేదిక 211 సామాజిక మాధ్యమాల పేజీలు, గ్రూపుల విశ్లేషణ ఆధారంగా రూపొందించడం జరిగింది.
సంఘం అధ్యయనం చేసిన వేదికలను– విద్వేషపూరిత ప్రసంగాలవ్యాప్తి కోసం ఉపయోగించుకుంటూ “ఒక పద్ధతి ప్రకారం ఎలుకలు, కుక్కలు, చొరబాటుదారులు, విదేశీ ఆక్రమణదారులంటూ ”ముస్లింలను అమానవీయులుగా చిత్రీకరించారని కనుగొన్నట్టు ఆ నివేదిక తెలిపింది.
కాగా మేటా సొంత విధానాలు విద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నాయి. అయినా ఈ అంశాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపర్చి భారత్‌లో తన సొంత విధానాలను అమలు పర్చకపోగా బేధాభిప్రాయలను సుస్థిర పర్చుకుంది. అయినా తన అతిపెద్ద గ్లోబల్ మార్కెట్‌ను కొనసాగిస్తుంది.
జర్మన్ వాచ్
“తీవ్ర వాతావరణ ప్రభావం వల్ల ప్రాణ, ఆర్ధిక నష్టాలలో” గ్లోబల్‌గా చూస్తే భారత్ 9వ స్థానంలో ఉందని ఒక స్వతంత్ర అభివృద్ధి, పర్యావరణం, మానవ హక్కుల సంఘం జర్మన్ వాచ్ విడుదల చేసిన వాతావరణ ప్రమాద ఇండెక్స్ 2026 తెలియజేసింది.
గడచిన 30 సంవత్సరాలుగా– 1995 నుంచి 2024 వరకు సేకరించిన డేటా ఆధారంగా, తీవ్ర వాతావరణ ప్రభావం వల్ల ప్రాణ, ఆర్ధిక నష్టాలలో భారత్ 9వ స్థానంలో ఉందని నివేదిక పేర్కొన్నది.
గత 30 సంవత్సరాలలో భారత్ “430 తీవ్ర వాతావరణ సంఘటనలను(తుఫాన్లు, వేడి అలలు, వరదలను) అనుభవించిందని, ఫలితంగా 80 వేల మరణాలు, 1.3 బిలియన్ ప్రజలపై ప్రభావం పడగా సుమారు 170 బిలియన్ డాలర్ల నష్టం జరిగిందని తెలియజేసింది.
”వాతావరణం మద్దతుకు మరిన్ని దీర్ఘకాలిక పథకాలు, నిధుల సేకరణ జరగాలి. ఈ విషయంలో జాగ్రత్తపడకపోతే తిరిగి కోలుకునే కష్టాలు మరింత పెరగవచ్చు” అని సూచించింది.
ఫ్రీడమ్ హౌజ్
గ్లోబల్ ఇంటర్నెట్ స్వేచ్ఛలో భారత్ 51 స్థానంలో ఉందని ఫ్రీడమ్ ఆన్ ది నెట్ 2025 నివేదికలో ఫ్రడమ్ హౌజ్ తెలియజేసింది.
భారత్ “పాక్షిక స్వేచ్ఛ” జాబితాలో ఉందని– ఆన్లైన్ సెన్సార్షిప్, ఇంటర్నెట్ షట్డౌన్లు డిజిటల్ హక్కులను నియంత్రించడానికి నిఘావంటి విషయాలతో భారత్ 51 స్థానంలో ఉందని పేర్కొన్నది.
“గడచిన 15 సంవత్సరాలుగా గ్లోబల్ ఇంటర్నెట్ స్వేచ్ఛ తిరస్కరించబడుతుంది. అంతేకాకుండా భారత్‌లో ఆధార్ వ్యవస్థను తరుచుగా ఉల్లంఘిస్తూ, ఆన్లైన్ కథనాలను తారుమారు చేయడం ఉప్పెనలా పెరిగిపోవడంతో డేటా గోప్యత ప్రమాదం ఏర్పడుతుంది”అని నివేదిక నొక్కి చెప్పింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
