
పుస్తకాలు చదవడమే కాదూ
జీవించడం ఎలాగో నేర్పేది గురువు
పలకపై ఓనమాలు దిద్దించి
అక్షరాలను ఆనంతంగా ఒదిగించి
మస్తిష్కంలో జ్ఞానబీజాలు మొలకెత్తించి
మూర్ఖత్వాన్ని వదిలించి
బుద్ధిని ప్రసాదించి
వెలుగులును పంచే కిరణాలు
అహర్నిశలు ఆత్మవిశ్వాసంతో
జ్ఞానాన్ని సృష్టించి
అజ్ఞానాన్ని తొలగించి
తల్లిగర్భపు తరగతి గదిలో
రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతూ
తేజస్సు నింపే కాగడాలు
వృత్తిసంబధిత పాఠాలతో
ఆధునిక బోధనలను అందిస్తూ
అత్యున్నత నైతిక విలువలను
హక్కులను బాధ్యతలను
వ్యక్తిత్వపు మూలాలను
సక్రమంగా బోధించే జ్ఞానజ్యోతులు
నవ సమాజంలో ఉత్తమమైన
జీవన మార్గాన్ని చూపి
సముపార్జనకు గల తెలివితేటలను
బతుకునకు భవిష్యత్తును చూపే
గ్రంథాలయ భాండాగారపు
అవిశ్రాంత రథసారధి గురువు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.