
కార్మికులు, ఉద్యోగులకు చట్టబద్ధ ప్రాతినిధ్యం వహించాల్సిన బీఓసీడబ్ల్యూ సంక్షేమ బోర్డు గడచిన ఐదు సంవత్సరాలుగా ఒకే ఒక ప్రభుత్వ అధికారితో పని చేస్తుంది.
న్యూఢిల్లీ: గుజరాత్లో భవననిర్మాణ కార్మికుల సంక్షేమ వ్యవస్ధ పూర్తిగా పతనమైందని కంట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక వెల్లడించింది. చాలీచాలని సిబ్బందితో 2017 నుంచి పని చేస్తున్న ప్రాథమిక సంక్షేమ బోర్డులో 72% రెగ్యులర్ పోస్టులు ఖాలీగా ఉన్నాయంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తుందని కాగ్ తన నివేదికలో తెలియజేసింది.
శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ నివేదిక, పరిపాలనా వ్యవస్థ పతనాన్ని బట్టబయలు చేసింది.
బీఓసీడబ్ల్యూ చట్టబద్ధంగా కార్మికులకు, ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఇలాంటి కీలకమైన బోర్డులో గడచిన ఐదు సంవత్సరాలుగా కేవలం ఒక్క అధికారి పనిచేయిస్తున్నారు. దాంతో బోర్డు విధానాలను రూపొందించాల్సిన నిపుణుల సలహా కమిటీ 2011 నుంచి గైర్హాజరు అయ్యింది.
సంస్థాగత వ్యవస్థ కుప్పకూలిపోవడంతో యాజమాన్యలోపం వల్ల అనేక ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయి. దుర్భలమైనస్థితిని ఎదుర్కొంటున్న కార్మికుల కోసం 2006 నుంచి సంక్షేమ సెస్ రూ 4,787.6 కోట్లు వసూలు చేసింది. దాంట్లో సుమారు 47% అంటే, సుమారు రూ 2,243 కోట్లు నిరూపయోగంగా ప్రభుత్వ ఖాతాలలో నిలిపివేయబడ్డాయని కాగ్ నివేదిక వెల్లడించింది.
కార్మికులకు ఒక నిర్దిష్టమైన సంక్షేమ నిధి అంటూ ఏదీ ఏర్పాటు చేయలేదు. పైగా సెస్ ద్వారా వసూలు చేసిన నిధులలో సగానికి సగం నిధులు మళ్లించి కేవలం పేరుకుమాత్రమే బోర్డు కోసం నిధులను విడుదల చేశారు.
ఇలాంటి నిర్ణయాల వల్ల క్రింది స్థాయి ఆపరేషన్లు లేదా పనులు పూర్తిగా కుంటిపడిపోయాయి. ఇన్స్పెక్టర్ స్థాయిలో 42% పోస్టులు ఖాళీగా ఉండడంతో కీలకమైన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లేకుండా జిల్లాలు పనిచేస్తున్నాయి. సిబ్బంది కొరత రాష్ట్రంలోని అనేక నిర్మాణ సంస్థల్లో కూడా ఏర్పడింది. ఈ కొరత 2017 నుంచి 2022 మధ్య ఆరింతలు పెరిగింది. దాంతో పెరుగుతున్న కార్మిక శక్తికి ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని కాగ్ తెలియజేసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.