దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతి సంస్థ టీసీఎస్, గత ఏడాది జూలైలో దశలవారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సుమారు 2 శాతం శ్రామిక శక్తిని- దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు తెలిపింది. అయితే, వాస్తవంగా తగ్గిన సంఖ్య చూస్తే ఊహించిన దాని కంటే ఎక్కువగానే కోత పడినట్టు స్పష్టమవుతోంది.
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మొత్తం ఉద్యోగుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 6,07,979 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి 5,84,519 కు పడిపోయింది.
అంటే ఏకంగా 23 వేల మంది ఉద్యోగులు తగ్గినట్టు దక్కన్ హెరాల్డ్ పత్రిక నివేదించింది.
టీసీఎస్ గత ఏడాది కూడా దాదాపు 12,260 మంది ఉద్యోగులకు లే-ఆఫ్లు ఇచ్చినట్టు ప్రకటించింది.
డిమాండ్ మందగించడమే కారణం..
సుదీర్ఘకాలంగా డిమాండ్ అంచనాల్లో నెలకొన్న మందగమనం కారణంగా, ఆర్థిక సంవత్సరం 2022 నుంచి ఐటీ పరిశ్రమ స్థాయిలో నికర నియామకాలు బలహీనపడినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
ఏఐ నైపుణ్యాలపైనే మా దృష్టి..
“నాల్గవ త్రైమాసికంలో, అనుభవజ్ఞులైన టాలెంట్- క్యాంపస్ నియామకాల ద్వారా భవిష్యత్తుకు అవసరమైన వర్క్ఫోర్స్పై మా పెట్టుబడులను కొనసాగించాము”అని టీసీఎస్ హెచ్ఆర్ చీఫ్ సుదీప్ కున్నుమల్ తెలిపినట్టు దక్కన్ హెరాల్డ్ పేర్కొంది.
“ఏఐ-ఫస్ట్ సంస్కృతిని నిర్మించడం, మా ఉద్యోగులను ఏఐ నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం అనేది FY26లో మా కీలక ప్రాధాన్యతగా కొనసాగింది. మా కస్టమర్ల మారుతున్న అవసరాలకు అనుగుణంగా FY27లో కూడా దీనిని కొనసాగిస్తాం”అని ఆయన అన్నారు.
19 వేలకు పైగా నికర తగ్గింపు..
గత ఏడాది జూన్ నెలాఖరు నాటికి 6,13,069గా ఉన్న కంపెనీ ఉద్యోగుల సంఖ్య, 2025 సెప్టెంబర్ 30 నాటికి 5,93,314 కు పడిపోయింది; అంటే నికరంగా 19,755 మంది ఉద్యోగులు తగ్గిపోయారు.
జూలై నాటి ప్రకటన..
దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతి సంస్థ టీసీఎస్- గత ఏడాది జూలైలో దశలవారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సుమారు 2 శాతం శ్రామిక శక్తిని- దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తగ్గించనున్నట్టు తెలిపింది.
అయితే వాస్తవంగా తగ్గిన సంఖ్య, ఊహించిన కోత కంటే ఎక్కువగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
తగ్గుతున్న ఐటీ బడ్జెట్లు..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాలు తగ్గడం, క్లయింట్ల బడ్జెట్లు కుదించుకుపోవడం, అలాగే జనరేటివ్ ఏఐ- ఆటోమేషన్ వైపు మొగ్గు చూపడం వంటి పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యలో ఈ తగ్గింపు చోటుచేసుకుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
