దీపావళి పండుగ రెండు రోజుల తర్వాత కూడా ఢిల్లీ వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉంది. బుధవారం ఉదయం నాటికి 345గా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) “చాలా తక్కువ నాణ్యత” విభాగంలోకి వస్తుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ఇది 380కు చేరుకుంది.
న్యూఢిల్లీ: దీపావళి రెండు రోజుల తర్వాత కూడా ఢిల్లీ ప్రజలు “చాలా తక్కువ నాణ్యత”గల గాలిలో శ్వాస తీసుకుంటున్నారు. బుధవారం(అక్టోబరు 22) ఉదయం కూడా ఢిల్లీని దట్టమైన పొగమంచు ఆవరించింది.
అక్టోబరు 22 ఉదయం 5:30 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 345గా నమోదైంది. ఇది కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)ప్రకారం, “చాలా తక్కువ నాణ్యత” విభాగంలోకి వస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు దీపావళి జరుపుకున్న తర్వాత, ఈ ప్రాంత వాతావరణం కాలుష్యం బారినపడింది.
ఢిల్లీలోని పలు ప్రాంతాలలో- అశోక్ విహార్, బవానా, దిల్శాద్ గార్డెన్లో ఉదయం 6:15కు ఏక్యూఐ 380కు చేరుకుంది. దేశ రాజధాని ఎక్కువ భాగంలో ఏక్యూఐ 300- 400 మధ్య నమోదయ్యింది. ఇది “చాలా తక్కువ నాణ్యత” విభాగంలోకి వస్తుంది. ఐజీఐ ఎయిర్పోర్ట్, లోధీ రోడ్‌లాంటి ప్రాంతాలలో ఏక్యూఐ 300 నుంచి తక్కువగా ఉంది, ఇది “తక్కువ నాణ్యత” విభాగంలో లెక్కించబడుతుంది.
దీపావళి తర్వాత మారిన పరిస్థితి..
దీపావళి మరుసటి రోజు మందపాటి పొగ ఢిల్లీని ఆవరించింది. అంతేకాకుండా గాలి నాణ్యత “రెడ్ జోన్”కి చేరుకుంది. రాత్రి 8- 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. సుప్రీంకోర్టు నిర్ణించిన సమయం దాటిన తర్వాత కూడా ఢిల్లీ ప్రజలు పెద్దమొత్తంలో టపాసులను పేల్చడం వల్ల గాలి నాణ్యత దెబ్బతింది.
మంగళవారం, అక్టోబరు 21నాడు ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో 500 కంటే ఎక్కువ నమోదయ్యింది. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత 24 గంటల సగటు ఐక్యూఐ 351(చాలా తక్కువ నాణ్యత)గా నమోదు చేయబడింది. ఇది సోమవారం నమోదైన 345 కంటే ఎక్కువని చెప్పవచ్చు.
ప్రతి సంవత్సరం ఢిల్లీలో గాలి నాణ్యత ఆందోళకరంగా మారుతోంది. గాలి తక్కువగా వీచే ఈ కాలంలో సమస్య మరీ ఎక్కువవుతోంది. దీని వల్ల ఈ నెలలో దట్టమైన పొగమంచు ఢిల్లీని కప్పివేస్తుంది.
టపాసుల వల్ల గాయపడిన ప్రజలు..
టపాసుల వల్ల ఢిల్లీలో దీపావళి రోజు 250 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. నగర ఆసుపత్రులలో కాలిపోయిన ఘటనలకు సంబంధించిన కేసులలో తీవ్ర పెరుగుదల కనిపించింది. ఇందులో ఎక్కువశాతం గాయాలు టపాసుల వల్ల జరిగినవే. దేశ అతిపెద్ద బర్న్ యూనిట్‌లాంటి సఫధర్జంగ్ ఆసుపత్రిలో ఇటువంటి కేసులు ఎక్కువశాతం నమోదు చేయబడ్డాయి, మొత్తం 129 కేసులు.
దీపావళి రాత్రి ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు మొత్తం 269 ఎమర్జెన్సీ కాల్స్ వెళ్లాయి. ఈ సంఖ్య నిరుడుతో పోల్చుకుంటే 15శాతం తక్కువ. అప్పుడు మొత్తం 318 కాల్స్ నమోదు చేయబడ్డాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
