గడిచిన ఆరు సంవత్సరాలలో ఎటుంటి మనీలాండరింగ్‌కు పాల్పడలేదంటూ 93 కేసులను మూసివేస్తున్నట్టు కూడా నివేదికలను ఈడీ దాఖలు చేసింది.
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రవేశపెట్టిన డేటా ప్రకారం, 2014 జూన్ నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 6,312 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసింది. ఈ చట్టంలోని నిబంధనల కింద 120 మందిని దోషులుగా నిర్ధారించారు.
2019 ఆగస్టు నుంచి మొదలు పెట్టి 93 కేసుల్లో ఎలాంటి మనీలాండరింగ్‌కు పాల్పడలేదని పేర్కొంటూ; కేసుల మూసివేత రూపకల్పన నివేదికలను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులకు ఈడీ దాఖలు చేసిందని కూడా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభలో అందచేసిన డేటా వెల్లడించింది.
పీఎంఎల్ఏ 2019 సవరణకు ముందు, అదే సంవత్సరం ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చినా; ఆ సంస్థ ప్రాంతీయ ప్రత్యేక డైరెక్టర్ ముందస్తు ఆమోదంతో మనీలాండరింగ్‌కు పాల్పడనటువంటి కేసులను మూసివేశారు. అయితే 2005 జులై 1న పీఎంఎల్ఏ అమలులోకి వచ్చినాటి నుంచి, 2019 జులై 31వరకు ఇలాంటి కేసులు 1,185 మూసివేయబడ్డాయి.
“నరేంద్ర మోడీ మొదటి సారి ప్రధాన మంత్రి అయిన రోజు– 2014 జూన్ 1 నుంచి 2025 నవంబరు 1 వరకు ఈడీ ఎన్ని కేసులను నమోదు చేసింది? ఎందరి మీద నేరలను మోపిందో వాటి వివరాలను అందచేయాలి” అని పశ్చిమ బెంగాళ్ అసన్సోల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మాజీ నటుడు శత్రుఘ్న సిన్హా డిమాండ్ చేశారు.
మంత్రి చౌధరీ అందచేసిన డేటా ప్రకారం, మొత్తం 6,312 కేసులు నమోదు కాగా; అదే సమయంలో 120 మంది నేరారోపణల నుంచి బయటపడ్డారు.
2019- 2020 ఆర్ధిక సంవత్సరం కంటే ముందు, 200 కేసులు లేదా అంతకు మించి నమోదు కాలేదు. కానీ ఆ ఏడాది 557 కేసులు నమోదయ్యాయి. అలాగే 2020- 2021లో 996; 2021- 2022లో ఒకేసారి 1,116 కేసులు పెరిగాయి. ఆ తర్వాత కేసులు కొంత వరకు తగ్గినప్పటికీ; ఆనాటి నుంచి మాత్రం ప్రతి ఏటా 700కు తగ్గకుండా నమోదవుతున్నాయి.
“49 కేసులకు సంబంధించి మూసివేత నివేదికలు దాఖలు చేసిన విషయం వాస్తవమైతే వివరాలను అందజేయాలి”అని కూడా సిన్హా కోరారు.
2015 నవంబరు 1 నుంచి 2025 జూన్ 30 మధ్యకాలంలో 49 మూసివేత నివేదికలను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టుల్లో ఈడీ దాఖలు చేసిందని జూలై పార్లమెంటు సమావేశంలో చౌధరీ చెప్పారు.
2019 ఆగస్టు 1 నుంచి మనీలాండరింగ్ నేరంతో సంబంధంలేని 93 కేసుల మూసివేత నివేదికలను ఈడీ దాఖలు చేసిందని సిన్హా వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలియజేశారు.
“నేరం కేసును మూసివేయడం, పీఎంఎల్ఏ కింద నిర్వచించబడిన నేరానికి సంబంధించి ఎటువంటి నేరం చేయలేదని కోర్టు కనుగొన్న కేసులు, ముందస్తు నేరం కేసును రద్దు చేయడం మొదలైన వివిధ కారణాలు” దీనికి ఉన్నాయని చెప్పబడింది.
ఏదిఏమైనప్పటికీ గుర్తించబడిన ప్రత్యేక కోర్టుల్లో మూసివేత నివేదికలు దాఖలు చేసే అవసరం కోసం చేసిన పీఎంఎల్ఏ సవరణలకు ముందు; గడిచిన 14 సంవత్సరాలలో మనీలాండరింగ్ సంబంధంలేని 1,185 కేసులను ఈడీ మూసివేసింది.
ఈ నేపథ్యంలో “అంచనా నేరాలు”వంటి వాటిని పీఎంఎల్ఏలోని ఏ, సీ నిబంధనలు నేరానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తాయి. ఈ నిబంధనల కింద ఆర్ధిక నేరాలపై దర్యాప్తు జరిపే ఈడీకి పోలీసులు లేదా ఇతర ఏజెన్సీలు మనీలాండరింగ్ కేసులను తమకు తాము నమోదు చేసుకున్న తర్వాత విచారణ జరిపే అధికారం ఉంది.
మోడీ ప్రభుత్వం సీఎంఎల్ఏ సవరణల ద్వారా ఈడీ అధికారాలను విస్తరించింది. ఇందులో భాగంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న బెయిల్ కోసం ప్రయత్నించే వ్యక్తులు సాక్ష్యాధారాలతో తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది.
తమ రాజకీయ ప్రత్యర్ధులను బీజేపీ లక్ష్యంగా చేసుకొని ఏజెన్సీని దుర్వినియోగం చేసేందుకు పీఎంఎల్ఏ అవకాశం కల్పిస్తుందని; పైగా సవరణలను నిలిపేస్తూ 2022లో సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర వివాదానికి కారణమైందని విమర్శకులు అంటున్నారు. తన తీర్పునే సవాల్ చేసే అంశం ప్రస్తుతం త్రిసభ్య ధర్మాసనం పరిశీలనలో ఉంది.
ఇదిలా ఉండగా శిక్షలు పడిన జాబితా తక్కువగా ఉందని ఈ సంవత్సరం మొదట్లో ధర్మాసనం వ్యాఖ్యానించగా, తాను నమోదు చేసిన కేసుల వివరాలను ఏజెన్సీ సురక్షితంగా భద్రపర్చింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
