ఢిల్లీ కారు పేలుడు ఘటన మీద అధికారులు నోరు విప్పక పోవడంతో అనామక వర్గాలందిస్తున్న సమాచారాన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో పేలుడు చుట్టూ దాగున్న విషయాలు మరింత జటిలమవుతున్నాయి.
న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎర్ర కోట ముందు జరిగిన కారు పేలుడు ఘటనలో 13మంది చనిపోగా, చాలామంది గాయపడ్డారు. అందరి కంటే ముందుండాలనే ఆలోచనతో సమగ్రంగా తెలుసుకోకుండానే అసంపూర్తి సమాచారాన్ని వివిధ వార్తా సంస్థలు పోటీపడుతూ హడావిడిగా ప్రసారం, ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఈ సంఘటన చుట్టూ అల్లుకున్న విషయాలు మరింత జటిలంగా మారుతున్నాయి.
ఈ ఘటనలో అసలేం జరిగింది? మనకు ఇంకేం తెలియదు?
కారు పేలుడు వెనుక “ఫిదాయీన్” దాడి లేదా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద జైష్- ఏ- మహమ్మద్ సంస్థ హస్తం ఉన్నట్టుగా ప్రాథమిక ధర్యాప్తు సూచిస్తుందని అనామక ఢిల్లీ పోలీసు అధికారులు తెలియజేసినట్టుగా వివిధ వార్తా సంస్థలు ఉటంకిస్తున్నాయి. కానీ “ఫిదాయీన్”దాడి లేదా ఆత్మహుతి వల్ల ఈ పేలుడు సంభవించినట్టుగా ఢిల్లీ పోలీసులు నిర్ధారించలేదు.
సాంప్రదాయ పేలుడుతో సంబంధమున్న విస్ఫోటనం- ఆర్డీఎక్స్ జాడలు లేనట్టుగా మనకు తెలుసు. సంఘటనా స్థలంలో కనబడిన దృశ్యం, తగిన సమాచారం తెలియజేయకపోవడం వల్ల సోమవారం సంఘటనలో ఎలాంటి సహజసిద్ధమైన విస్ఫోటాల జోక్యం ఉందనే దానిపై ప్రస్తుతం మనకు అంతలా స్పష్టత లేదు.
సంఘటనపై కనీసం ప్రాథమిక వివరాలు చెప్పడానికి కూడా అధికారులు నోరు విప్పడంలేదు. అయినప్పటికీ, కారు మాజీ యజమాని పేరుకు సంబంధించిన కొన్ని వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. అంతేకాకుండా ఈ పేలుడుకు మతాన్ని కూడా అంటగడుతున్నారు.
హర్యానాలోని ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్లో భాగమని ఆరోపిస్తూ జమ్మూకశ్మీర్ పోలీసులు ముగ్గురు డాక్టర్లను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ కారు పేలుడుతో వీరికి ఏమైనా సంబంధం ఉందానే ప్రశ్న కూడా తలెత్తుతుంది.
అయితే జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన వారిని పేలుడుకు అనామక ఢీల్లీ పోలీసు అధికారులు జోడిస్తున్నారు. మరో వైపు ఈ రెండు పరిణామాలను కలిపే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా ఫరీదాబాద్‌లో ప్రైవేటు వైద్య కళాశాల డాక్టర్ ఉమర్నబీకి; పేలుడుతో ఏమైనా సంబంధముందానే విషయం మీద తాము దర్యాప్తు చేస్తున్నట్టుగా ఢిల్లీ పోలీసు అధికారులు చెప్పారు. ఆయన ప్రధాన అనుమానితుడుగా భావిస్తున్నారు. తండ్రిని తల్లిని ప్రశ్నించడానికి, అవసరమైతే డీఎన్ఏ పరీక్ష కోసం ఉమర్నబీని పోలీసులు తీసుకెళ్లారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
