
పరువు నష్టం చట్టాన్ని నేరరహితం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. “పరువు నష్టం నేరం కాదు కానీ, చట్టంలో సవరణ అవసరముంద”ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేశ్ అన్నారు.
పరువునష్టానికి సంబంధించిన దావా పిటీషన్‌ను ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫేసర్ అనితా సింగ్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను సవాలు చేస్తూ ది వైర్ మాతృసంస్థ “ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం” మరో పిటీషన్‌ను దాఖలు చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ పై వ్యాఖ్యలు చేశారు.
“ప్రజలకు సంబంధంలేని లేదా వారికి ఏమాత్రం ఉపయోగపడని నేర పరువు నష్టం చట్టాన్ని- అనేక రాజకీయ పార్టీలు, ప్రైవేటు వ్యక్తులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు”అని న్యాయమూర్తి తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో చట్టాన్ని సవరించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
ఈ పిటీషన్‌పై విచారణ సందర్భంగా పిటీషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. క్రిమినల్ పరువు నష్ట చట్టానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్ ఇతరులు గతంలో పిటీషన్లను దాఖలు చేశారు. ఇవి ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ధర్మాసం దృష్టికి తీసుకెళ్లారు.
కపిల్ సిబాల్ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్, తాజా పిటీషన్‌తో పాటు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటీషన్లను కలిపి విచారిస్తామని తెలియజేశారు. పరువునష్టానికి సంబంధించి సుబ్రమణ్యం స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు- 2016, ఇమ్రాన్ ప్రతాప్ గ్రాహీకి సంబంధించిన కేసులో మార్చి 2025 తీర్పును ఈ సందర్భంగా న్యాయమూర్తి ఉటంకించారు.
ఇటీవల కాలంలో నేర పరువు నష్ట చట్టానికి సంబంధించి అనేక కేసులు వివధబెంచిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై స్పందించిన కోర్టు- రాజకీయ కక్ష్యలను పరిష్కరించుకోవడానికి ఇది వేదిక కాదని గతంలో ఘూటుగా స్పందించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.